Home News National మోదీ జగన్ మధ్య జరిగిన చర్చలు సారాంశం ఏమిటి?

మోదీ జగన్ మధ్య జరిగిన చర్చలు సారాంశం ఏమిటి?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రితో దాదాపు ముప్పాతిక గంట బేటి సాగించారు. ఈ బేటిపై భిన్న కథనాలు విన్పించు తున్నా అత్యంత వివిఐ ల మధ్య జరిగిన చర్చలపై ఊహాగానాలు చేయడం వృథా ప్రయాసే. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నదీ ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అయితే రాష్ట్రానికి చెంది కేంద్రం నుండి రావలసిన నిధులు రాయితీల గురించి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రికి లేఖ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో షరా మామూలు గా పోలవరం ప్రాజెక్టుకు నిధులు ప్రత్యేక హోదా లోటు బడ్జెట్ పూడ్చేందుకు రావలసిన నిధులు తదితరాలు లేఖలో వుంటాయి.

అయితే ఇవేవీ ముఖ్యమైనవి కావు. వీటి కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం పెట్టుకోలేదు. తను ప్రతిపాదించిన మూడు రాజధానులకు శాసన మండలి రద్దుకు కేంద్రం నుండి ఆమోదానికే ముఖ్యమంత్రి ఈ బేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇవి ఒక విధంగా వివాదాంశాలే. ఎందుకంటే రాష్ట్ర బిజెపి నాయకత్వం కూడా ఈ అంశాల్లో వ్యతిరేక వైఖరి తీసుకొని పోరాడుతోంది. ఈ అంశాల్లో కేంద్రం నుండి క్లారిటీ కోసం వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర తర్వాత రాష్ట్రంలో సంభవించే పరిణామాలను బట్టి వీరిరువురి మధ్య సాగిన చర్చల సారాంశం అంచనా వేయవలసి వుంటుంది. ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే పరిపాలన సౌలభ్యం పేరుతో ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వేగవంతం చేసిందంటే ప్రధాన మంత్రి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే లెక్క..ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ముఖ్యమంత్రి వెనకడుగు వేసే ప్రసక్తే వుండదు. ఒక వేళ ఈ చర్యలు మంద గించితే ప్రధాన మంత్రి నుండి సానుకూలత లభ్యం కాలేదని భావించాలి. అంతేకాదు శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభ తీర్మానం చేసి పంపిన ప్రతిపాదనల ఫైల్ కేంద్ర హోం శాఖ చురుకుగా కదలించిందంటే ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రి హామీ ఇచ్చినట్లు భావించ వచ్చు. లేదా శాసన మండలిని ప్రొరోగ్ చేసి ఆర్దినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినా ప్రధాన మంత్రి గో అహెడ్ అని చెప్పినట్లు భావించ వచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం రోజుల్లో గైకొనే చర్యలను బట్టి ముఖ్యమంత్రి ప్రధాని మధ్య జరిగిన చర్చలు తీరు అంచనా వేయవచ్చు. ఈ లోపు ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా అవన్నీ ఉత్తుత్త ఊహాగానాలే

Recent Posts

మృతుల ఫ్యామిలీస్‌కి క‌మ‌ల్ భారీ విరాళం!

క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న `ఇండియ‌న్ 2` సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా అక‌స్మాత్తుగా క్రేన్ కూలి ముగ్గురు సిబ్బంది అక్క‌డి క‌క్క‌డే మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది. డైరెక్ష‌న్ టీమ్‌లోని కృష్ణ‌, ప్రొడ‌క్ష‌న్ అస్టిస్టెంట్ మ‌ధు,...

నాగ‌శౌర్య‌కు తెలివిగా కౌంట‌రిచ్చిన వెంకీ!

`ఛ‌లో` సినిమాతో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఈ సినిమా అత‌ని కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఆ ఆనందంలో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు...

రౌడీ ప‌క్క‌న బాలీవుడ్ పోరి ఫిక్స్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్‌జోహార్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్...

ఎవరిని చైతన్యపరుస్తారు చంద్రబాబు? 

సమాజంలో ఎవ్వరిలోనూ చైతన్యం ఉండదని, తాము యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తామనే భ్రాంతిలో రాజకీయనాయకులు మునిగితేలుతుంటారు.  మోడీ పాలన ఎలా ఉంది?  కేసీఆర్ పాలన ఎలా ఉంది?  జగన్ పాలన ఎలా ఉంది? ...

`ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్ రికార్డ్‌!

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రంభీం వీరిద్ద‌రు ఎక్క‌డ క‌లిశారు?. ఎలా క‌లిశారు? ఎందుకు క‌లిశారు? క‌ఒంత కాలం పాటు అజ్ఞాత జీవితాన్ని ఎందుకు గ‌డిపారు. చ‌దువురాని కొమ‌రంభీం...

`ఇండియన్ -2` సెట్‌లో ప్ర‌మాదం ముగ్గురు మృతి!

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఇండియన్ -2`. 1996లో వ‌చ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు....

బొబ్బిలి కోట పై బొత్స గురి

సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి వంశానికి చెందిన ఈ తరం రాజకీయ నాయకుడు. 2004 2009 లో కాంగ్రెస్ తరఫున గెలిచిన సుజయ్ కృష్ణ 2014లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. విజయనగరం...

జగన్ని జైల్లో పెట్టే దమ్ము నరేంద్ర మోడీకి లేదు

ఈరోజు రాజమండ్రి లో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ కేంద్రంపై తిరుగుబాటు చేస్తే జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే...

టిడిపికి కొత్త మిత్రుడు దొరికాడా?

విజయవాడలో మంగళవారం ఇది సూచన ప్రాయంగా ఆవిష్కరణ అయింది. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో టిడిపి పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని పాల్గొన్నారు. వాస్తవంలో ఈ సభను స్థానిక...

ధ‌నుష్ గ్యాంగ్‌స్ట‌ర్‌ మూవీ టైటిల్ ఇదే!

విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు త‌మిళ హీరో ధ‌నుష్‌. ఇటీవ‌ల `అసుర‌న్‌` హిట్‌తో రెట్టించిన ఉత్సాహంలో వున్న ధ‌నుష్ త‌న తాజా చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయ‌బోతున్నాడు. `పిజ్జా`...

Featured Posts

ఎవరిని చైతన్యపరుస్తారు చంద్రబాబు? 

సమాజంలో ఎవ్వరిలోనూ చైతన్యం ఉండదని, తాము యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తామనే భ్రాంతిలో రాజకీయనాయకులు మునిగితేలుతుంటారు.  మోడీ పాలన ఎలా ఉంది?  కేసీఆర్ పాలన ఎలా ఉంది?  జగన్ పాలన ఎలా ఉంది? ...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...