Home News International 2020 ఒలింపిక్స్ లో పొగ తాగడం నిషేధించిన జపాన్...

2020 ఒలింపిక్స్ లో పొగ తాగడం నిషేధించిన జపాన్…

 

(మల్యాల పళ్ళంరాజు)

సరదా… సరదా సిగిరెట్లు.. ఇది దొరలు తాగు బల్ సిగిరెట్లు… అన్న కోసరాజు గారి పాట జనాలకు గుర్తు ఉండే ఉంటుంది. ఆ పాటలో సిగిరెట్ తాగడం వల్ల వచ్చే నష్టాలను కూడా చెప్పినా.. పొగతాగే జనాభా ప్రపంచ వ్యప్తంగా పెరుగుతూనే ఉంది. అలా సరదా… సరదా సిగిరెట్లు…అంటూ గుప్పు గుప్పు మని సిగిరెట్ లు ఊదేసే సరదా రాయుళ్లకు జపాన్ లో 2020లో జరిగే ఒలింపిక్స్ లోనూ, పారా ఒలింపిక్స్ లోనూ ప్రవేశం లేదంటున్నారు నిర్వాహకులు.

నిజానికి భారతదేశంతో సహా పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించినా, పొగాకు కేన్సర్ కు కారణం.. అని బోర్డులు పెట్టినా.. సిగిరెట్ పెట్టెలపై తాటికాయంత అక్షరాలతో రాసినా ఆ అలవాటు గలవాళ్లను కట్టడి చేయడం ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కావడం లేదు. మనదేశంతో పోలిస్తే.. జపాన్ లో పొగతాగే అలవాటు ఉన్న జనాభా ఎక్కువే. 2020 ఒలింపిక్స్ సందర్భంగా జపాన్ వ్యాప్తంగా పొగాకు వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేసే ఏర్పాట్లు సాగుతున్నాయి. జపాన్ లో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకుల నుంచి హోటళ్లు, బార్లలో సామాన్యజనం యథేచ్ఛగా పొగాకు వినియోగిస్తుంటారు. చాలా అనారోగ్యాలకు మూలమైన ఈ పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఈ సారి ఒలింపిక్స్ వేదికగా జపాన్ లో ఓ విప్లవాత్మక మార్పు తెచ్చేందుకు క్రీడల నిర్వాహకులు కంకణం కట్టు కుంటున్నారు.

జపాన్ 2020లో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నది. అలాగే పారా ఒలింపిక్స్. ఈ ఒలింపిక్ క్రీడలు జరిగే అన్ని మైదానాలలోనూ, చుట్టు పక్కల ప్రాంతాలలో కూడా పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించారు. ఆ నిషేధాన్ని 100 శాతం అమలు చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

క్రీడాకారులు, ప్రేక్షకులు, క్రీడా సంఘాల అధికారుల ఆరోగ్యం దృష్ట్యా అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నియమావళి కచ్చితంగా అమలు చేసేందుకు, జపాన్ ప్రభుత్వం గట్టి కృషి చేస్తున్నది. ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్ష విధించేందుకు అవసరమైన చట్టాలను సిద్ధం చేస్తున్నారు.

2012 లండన్ ఒలింపిక్స్, 2016 రియో డిజెనెరో ఒలింపిక్స్ సందర్భంగా క్రీడా ప్రాంగణాల వెలుపల పొగతాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ, జపాన్ లో క్రీడా ప్రాంగణాల వద్ద అలాంటి సౌకర్యాలు ఉండబోవని సుస్పష్టం చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే స్కూళ్లు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాల్లో పొగతాగడాన్ని నిషేధించారు. అలాగే డబ్బు వేస్తే.. సిగిరెట్లు ధారగా పడే యంత్రాలను దేశంలో తొలగించారు. కానీ, చిన్న హోటళ్లు, బార్ లు, ఇతర బహిరంగ స్థలాల్లో పొగతాగేందుకు అనుమతి ఇస్తూనే ఉన్నారు. టీవీల్లో, సినిమా హాళ్లలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం లేదు.

ఒలింపిక్స్ లో పతకాల పంట పండించడం తో పాటు దేశ ప్రజల ఆరోగ్యం మెరుగు పరచడమే టోక్యో 2020 ఒలింపిక్స్ లక్ష్యం. జపాన్ జనాభాలో ఐదో వంతు జనం స్మోకర్లే. పొగతాగడం వల్ల అనారోగ్యం పాలయ్యే వారి సంఖ్య ఎక్కువే. సిగిరెట్ తాగా వారి కన్నా.. ఆ పొగ పీల్చడం వల్ల ఏటా 15 వేల మంది మహిళలు, పిల్లలు చని పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, జపాన్ లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా దేశంలో దేశంలోని 80శాతం పైగా హోటళ్లు, కేఫేలను స్మోకింగ్ ఫ్రీ జోన్ లుగా ప్రకటించేందుకు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

2020 జపాన్ ఒలింపిక్స్ జరిగే క్రీడా ప్రాంగణాలతో పాటు దేశంలోని అన్ని ఇండోర్, ఔట్ డోర్ క్రీడా ప్రాంగణాలలోనూ నిషేధం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 2018లో పయాంగ్ ఛాంగ్ వింటర్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఇదే విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు.
అయితే ప్రపంచంలో అత్యధికంగా సిగిరెట్లు ఉత్పత్తి చేసే జపాన్ కంపెనీ ఆ దేశ ప్రభుత్వరంగ పరిశ్రమ అంటే ఆశ్చర్యం కలగక మానదు.

ఈ మధ్య భారతదేశంలోని బెంగళూరులో ఎయిర్ షో సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ 300 కార్లు, చెన్నైలోని పోరూర్ లో ఓ పెద్ద ఆసుపత్రి వద్ద పార్కింగ్ స్థలంలో జరిగిన ప్రమాదంలో 200 పైగా కార్లు దగ్ధమయ్యాయి. చెన్నై వద్ద జరిగిన ప్రమాదానికి ఎవరో నిర్లక్ష్యంగా విసిరేసిన సిగిరెట్ పీక కారణమన్న ఆరోపణ ఉంది. క్రీడా ప్రాంగణాల వద్ద పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధించడం వల్ల అలాంటి ప్రమాదాలను అరికట్ట వచ్చు. ఇక పొగ తాగడం నిషేధించడం వల్ల ఒలింపిక్స్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి. క్రీడా ప్రాంగణాల వద్ద కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు.

 

( మల్యాల పళ్ళంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ 9705347795)

Recent Post

స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా...

మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న...

రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు...

టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం...

జ‌క్క‌న్నకు భారీ షాక్.. ఈ సారి మ‌రో లీక్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్‌కు ముందే సోస‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారుతోంది. సినిమా మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక‌టి లీక్ అవుతూనే వుంది. క్యారెక్ట‌ర్స్...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో?

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో సిద్ధ‌మ‌వుతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల పాటు రామానాయుడు హ‌యంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్క‌డ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వ‌ర‌కు ఓపెనింగ్‌లు జ‌రుపుకున్నాయి....

ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న...

CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం...

కేంద్రం హామీతో జోష్ లో ముఖ్యమంత్రి

వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి...

Featured Posts

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

వైసిపి- బిజెపి పొత్తు! ఒక్క రోజులోనే పలు యూ టర్న్ లు!

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని...