Home News Andhra Pradesh మూడు రాజధానులు ఓట్లు రాలుస్తాయా? అమరావతిలో టీడీపీ ఎందుకు ఓడినట్లు?

మూడు రాజధానులు ఓట్లు రాలుస్తాయా? అమరావతిలో టీడీపీ ఎందుకు ఓడినట్లు?

రాష్ట్రంలో రాజధాని రగడ తారా స్థాయికి పోయింది. రాజధానికి అభివృద్ధికి ముడి పెట్టి వాదప్రతివాదాలు సాగు తున్నాయి. పరిపాలన వికేంద్రీకృతం చేస్తే గాని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా అభివృద్ధిని కేంద్రీకృతం చేసి వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధిని దెబ్బ తీశాడని కూడా ఆరోపిస్తున్నారు. కాగా పరిపాలన వికేంద్రీకృతం చేసినంత మాత్రాన వెనుక బడిన ప్రాంతాల్లో అభివృద్ధి సాధ్యం కాదని ఉపాధి కల్పన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజల జీవన ప్రమాణం పెంచే చర్యలు చేపట్టాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమని ప్రతి పక్షాలు చెబుతున్నాయి

ఈ వాదోపవాదాలు పక్కన బెడితే మూడు రాజధానుల ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా ఏమేరకు లబ్ది పొందుతారు? ఇది మాత్రం బిలియన్ డాలర్ల ప్రశ్నే.. విశాఖలో రాజధాని పెట్టినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంతంలో తిరుగు లేని పలుకుబడి ఏర్పడటం వాస్తవమైతే అమరావతి రాజధాని చుట్టు పక్కల గల గుంటూరు కృష్ణ జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడి పోయింది? అంతేకాదు ఈ రోజు అమరావతి రాజధాని మార్పు చేయ వద్దని రోడెక్కి ఆందోళన చేస్తున్న మంగళగిరి తాడి కొండ నియోజకవర్గాల్లోని ఓటర్లు టిడిపి అభ్యర్థులను ఎందుకు ఓడించారు? వైసిపి అభ్యర్థులను ప్రజలు ఎందుకు గెలిపించారు? అంతేకాదు చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికే పరిమితమౌతున్నారని నేడు కొందరు వైసిపి నేతలు ఆరోపించుతున్నారు. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అధికంగా గల ప్రాంతాల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొండటమే కాకుండా వైసిపి అభ్యర్థులకు పలు నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ఓట్లు వేయకుండా వుంటే 151 మంది శాసనసభ్యులు గెలుపొందే వారా?

అసలు సమస్య అదికాదు. చంద్రబాబు నాయుడు అయిదు ఏళ్ల కాలంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలు రాజకీయ అవినీతి జన్మ భూమి కమిటీల పేర ప్రభుత్వానికి పార్టీకి మధ్య గల సరళ రేఖ చెరిపేసినందున 2004 లాగా అవకాశం కోసం ఎదురు చూచిన ప్రజలు చంద్రబాబు నాయుడును పని గట్టుకొని ఓడించారు. 2019 ఎన్నికల ఫలితాల తీరు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఘనత అనుకుంటే పప్పులో కాలు వేసి నట్లే. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపులో తన లెక్కలు తన కుంటాయి. కాని రాజధాని విశాఖకు తరలించినంత మాత్రన ఏదో బావుకుంటామని భావిస్తే చంద్రబాబు నాయుడు అనుభవాన్ని మరుగు పర్చడమౌతుంది. ప్రజలు తమ జీవితాలను రూపాయలు పైసల్లో లెక్కలు వేసుకుంటారు. ప్రభుత్వం విధానాలతో సాధారణ ప్రజలు తమ జీవితాల్లో ఏదైనా మెరుగుదల వుందా? అని చూస్తారు. రాజధాని పెట్టి లేదా హైకోర్టు పెట్టినంత మాత్రాన దానితోనే సంత్రుప్తి పడి ఓట్లు గుమ్మరిస్తారనుకోవడం భ్రమ మాత్రమే. అయితే సమాజంలో ఉపరితల భాగంలో వుండే నోరుగల తరగతుల గొంతు మాత్రం ఈ ధోరణి విన్పించుతుంది అయితే అది గీటురాయి కాదు. అట్టడుగున వుండే నిద్రాణ శక్తులు సమయం వచ్చినప్పుడు తమ ప్రతాపం చూపుతాయి. వీరే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు గుణపాఠం నేర్పారు. దురదృష్టం ఏమంటే నేడు వైసిపి ప్రభుత్వం గుణపాఠాలు పరిగణనలోనికి తీసుకోవడం లేదు. జన్మభూమి కమిటీలు పోయి వాలంటీర్లు వచ్చారు. మున్ముందు వీరి వ్యవహార సరళే గ్రామ స్థాయిలో వైసిపి పరువు కాపాడ బోతోంది. దీనికి తోడు ప్రభుత్వం ప్రజలకు ఒకటి ఇచ్చి రెండు పీకేస్తోంది. ఇది ఎక్కడికెలుతుందో వేచి చూడాల్సిందే.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013

Recent Posts

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

Featured Posts

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...