Home News Andhra Pradesh ఈ ఏడాదికి చివరి పూజ ఇదే... మునిగిపోతున్న సంగమేశ్వరుడు

ఈ ఏడాదికి చివరి పూజ ఇదే… మునిగిపోతున్న సంగమేశ్వరుడు

శ్రీశైల జలాశయంకు వరద నీరు పోటెత్తడంతో మునుగుతున్న సంగమేశ్వర ఆలయం. చివరిసారిగా ఆలయంలోని వేపదారి శివలింగం కు ఈ రోజు చివరి పూజ జరిగింది. ఫోటోలో  పూజ చేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ్ శర్మను చూడవచ్చు .ఈ ఆలయం ఇప్పుడు మునిగితే బయటికి వచ్చేందుకు మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. ప్రతిఏటా ఇది ఓ అద్భుత ఘటన. కృష్ణాజలాలతో శ్రీశైలం జలాశయం నిండినపుడల్లా సంగమేశ్వర ఆలయం మునిగిపోతుంది. మళ్లీ జలాశయం ఎండినపుడు ఆలయం ప్రత్యక్షమవుతుంది. అయితే, ఇందులో ఒక విచిత్రం ఉంది. స్వామి మునిగితే నా రాయలసీమకు రిజర్వాయర్ నుంచి నీళ్లొస్తాయి. స్వామి బయలెల్లితే, అంటేరిజర్వాయర్ ఎండిపోతే, రాయలసీమకు కృష్ణాజలాలు ఉండవు, గొంతెండిపోతుంది. కనిపించి కన్నీరు పెట్టించే ఆలయం ఇదే.

కృష్ణా జలాలు ఆలయాన్ని ముంచేస్తున్నాయి

ఆలయ చరిత్ర

దక్షిణాదిలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన రాజ్యం చాళుక్యులది.వీరికాలం నాటికి బౌద్ధ,జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నా వీరు మాత్రం వైదిక మతావలంబులు.వీరి తొలిరాజధాని ఐహోళె,పట్టాభిషేకాలు జరుపుకున్న పట్టాడకల్ లలో ఎన్నో అపురూప ఆలయాలను,బాదామిలో గుహాలయాలను నిర్మించారు.ఆ తర్వాత రాజ్యవిస్తరణలో భాగంగా మొలకసీమ,ఏరువసీమ,రెండేరులసీమ గా పిలువబడే ప్రస్తుత మహబూబ్ నగర్,కర్నూల్ జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు.ఈసీమలో తుంగభద్ర,కృష్ణల సంగమ ప్రదేశమైన కూడలి,కూడవెల్లిగా వ్యవహరించే ప్రదేశంలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాల నమూనాతో కూడవెల్లి సంగమేశ్వరాలయాన్ని నిర్మించారు.

 

చూస్తుండగానే ఆలయం మునిగిపోతున్నది

ఈ ఆలయ నిర్మాణానంతరం మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నా వరద సమయాల్లో గర్భాలయాల్లోకి ఒండ్రుమట్టి చేరుతున్నందున మరో ప్రాంతాన్ని అన్వేశించగా తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అలంపురం కనిపించింది.ఇది అదివరకే జోగుళాంబ శక్తి పీఠమైనందున,పరుశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమ ప్రాంతమైనందున ఇక్కడ నవబ్రహ్మాలయాలను నిర్మించారు.

కాలక్రమేణా చాళుక్యుల ప్రాభవం తగ్గింది.రాష్ట్రకూటుల ప్రాభవం హెచ్చింది.వీరికి పల్లవులతో సంబంధబాంధవ్యాలున్నందున చాళుక్యులను జయించారు.వీరూ ఆలయాలు నిర్మించాలనుకున్నారు.

నల్లమలలో భవనాశి అనే సెలయేరుగా పుట్టి కృష్ణలో కలిసే ప్రదేశాన్ని ఎంచుకున్నారు.ఈ సంగమానికి నివృత్తి సంగమం అని పేరు.పాపులను పునీతులుగా మారుస్తూ గంగా నదికి కాకి రూపం వచ్చిందని,ఆ రూపం పోగొట్టుకోవడానికి సంస్థ తీర్తాల్లో జలకమాడుతూ తిరుగుతున్న ఆవిడ ఇక్కడ హంస రూపం పొందిందని కథనం.ఆవిడ పాప నివృత్తి అయినందున నివృత్తి సంగమేశ్వరంగా వ్యవహరించేవారు.ఇక్కడ నది ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంటుంది.పాండవులు అరణ్యవాస సమయాన ఇక్కడికి వచ్చారని.శివలింగం తేవడానికి భీమూన్ని కాశీకి పంపగా అతను ముహూర్త సమయానికి రానందున ధర్మరాజు ఒక వేపమొద్దును శివలింగంగా ప్రతిష్టించాడని కథనం.తల మీద,రెండు బాహువుల్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు లింగాలు తెచ్చిన భీముడు ఆగ్రహంతో వాటిని విసిరెయ్యగా అక్కడ మల్లేశ్వరం,అమరేశ్వరం,సిద్దేశ్వరం,కపిలేశ్వరం,సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని కథనం.

నీళ్లొచ్చేస్తున్నాయ్

ఇక రాష్ట్రకూటులు ఈ ప్రదేశంలో చాళుక్య,పల్లవుల వాస్తు రీతులను మేళవించి ఆలయాలు నిర్మించారు.వీరి ఆలయం ఒక పెద్ద రాతిరధాన్ని పోలి ఉంటుంది.ఈ ఆలయాలున్న ప్రదేశంలో ధ్యానం చేస్తే రూపాయలు కురుస్తాయనే నమ్మకంతో దీన్ని రూపాల సంగమం అనేవారని ప్రజల్లో ఒక కథ ప్రచారంలో ఉంది.

కాలచక్ర గమనంలో రాజులు,రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి.మన తొలి ప్రధాని నెహ్రూ “ఆధునిక ఆలయాలు” గా అభివర్ణించిన బహుళార్ధసాధక ప్రాజెక్టులు మొదలయ్యాయి.కృష్ణా నది మీద శ్రీశైలం లో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది.మహబూబ్ నగర్,కర్నూలు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి,ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

చివరి పూజ అందుకో సంగమేశ్వరా

క్రీ.పూ 1250 ప్రాంతంలో ఈజిప్ట్ లో నాటి పాలకుడు రామ్‌సెస్ 2 తన విజయచిహ్నంగా ఒక కొండను తొలచి భవ్య ఆలయం నిర్మించాడు.దాన్ని అబు సింబెల్ ఆలయంగా వ్యవహరిస్తారు.1960 ల్లో అస్వాన్ హై డామ్ నిర్మాణంలో ఈ ఆలయం మునుగుతుందని అనేక దేశాలు,UNO సహకారంతో ఆ కొండను,శిల్పాలను ఒక్కొక్కటిగా విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో పునర్ణిర్మించారు.ఈ ఆలయ ప్రేరణతో పురావస్తు శాఖ వారు సంగమేశ్వర ఆలయాలనూ ఊకో రాయికి ఒక నంబర్ ను ఇచ్చి విడదీసారు.

 

కూడవెల్లి లోని ఆలయాన్ని అలంపురంలో నిర్మించగా…రాష్ట్రకూటుల రూపాల సంగమేశ్వరాన్ని కర్నూలు శివారులో ఉన్న జగన్నాధ గట్టు పైన పునర్ణిర్మించారు.ఇక పాత నివృత్తి సంగమేశ్వరంలో గొప్ప శిల్పసంపద లేనందున వదిలివేసారు.

ఇలా స్వామి మునిగిపోతుంటే, మాకు నీళ్లు విడుదలవుతాయని రాయలసీమ వాసులు ఆశిస్తారు.

(ఔత్సాహిక చరిత్ర కారుడు  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలసి)

Telugu Latest

ఒకరి‌కి గుండె పోటు.. ఇంకొక‌రు క‌రోనా డెత్

సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో విషాదాలు అభిమానుల్లో నిరంత‌రం చ‌ర్చ‌కొస్తున్నాయి. తాజాగా ఒక‌రికి గుండె పోటు .. ఇంకొక‌రు క‌రోనాతో మృతి చెంద‌డం హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్...

టాలీవుడ్ ఒక్క‌టిగా ఉండ‌డం అసాధ్యం

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌లు ఒక్క‌టి అవ్వ‌డం కుద‌ర‌ని ప‌నా? ప‌రిశ్ర‌మ‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డం అన్న‌ది ఏనాటికీ కుద‌ర‌నిదా? అంటే అవున‌నే బాంబ్ పేల్చాడు ఆర్జీవీ. గ‌త కొంత‌కాలంగా మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఎపిసోడ్స్...

దుర్గ‌మ్మ సాక్షిగా అది పొలిటిక‌ల్ మ‌ర్డ‌ర్!

ముందు ఇద్ద‌రి మ‌ధ్య స్ర్టీట్ ఫైట్ అన్నారు. ఆ త‌ర్వాత చిన్న గ్యాంగ్ వార్ అన్నారు. ఇంకాస్త ముందుకెళ్తే చిన్న భూ వివాదం అన్నారు. మ‌రో అడుగు ముందుకేసి ఇది ఆధిప‌త్యం కోసం...

మోక్ష‌జ్ఞని తెర‌కు ప‌రిచ‌యం చేసేది ఆయ‌నే!

న‌ట‌సింహా బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఎప్పుడు? అస‌లు హీరో అవుతాడా లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం చాలా కాలంగా నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. గ‌త మూడు నాలుగేళ్లుగా మోక్ష‌జ్ఞ...

బాల‌య్య బ‌ర్త్ డే కి మెగాస్టార్ ని ఆహ్వానిస్తారా?

న‌ట‌సింహ‌, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ భూములు పంచుకుంటున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్-టాలీవుడ్ పెద్దల భేటీపై చేసిన వ్యాఖ్య‌లు ఐదారు రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే....

‘శోభన్ బాబు  జయలలిత’ లవ్ ట్రాక్ కూడా ఉందట !  

  తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత'గారి  జీవితం ఆధారంగా  'తలైవి' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ...

బాబు మీద సానుభూతి..   వైసీపీ నాయకుల వల్లే !  

  జగన్ మోహన్ రెడ్డిది  రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో,  తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నారు.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ...

ఆ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటే !

  గొప్ప పని చేయలేనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  మన పెద్దలు చెప్పారు. ఆయితే ఈ సూక్తిని సాధారణ ప్రజానీకం కంటే కూడా, మన రాజకీయనాయకులే బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము...

బెజవాడ గ్యాంగ్ వార్ లో జరిగింది అదే !

  బెజవాడ అంటేనే రౌడీల  అరాచకాలకు మారు పేరుగా గుర్తుకు వస్తోంది.  వంగవీటి రంగా కాలం నాటి కక్షలు కార్పణ్యాల పై ఉన్న ఎన్నో వివాదాలతో పాటు రోజుకొక గొడవలు అల్లర్లతో ఇప్పటికీ బెజవాడ...

అండర్ వరల్డ్ డాన్ దావూద్ క‌రోనాతో మ‌ర‌ణించారా?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతను పాకిస్తాన్ లో దాక్కుని దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతన్ని తిరిగి దేశానికి...

English Latest

Super Star’s Panvel farmhouse affected by cyclone Nisarga

Cyclone Nisarga did not create a huge damage to Mumbai as it bypassed the city, but it has impacted several areas outside the city....

Nikhil dares to question PM Modi

When PM Modi announced lockdown everyone supported it wholeheartedly though few questioned its effectiveness in controlling the spread of coronavirus. But with almost all...

Shruthi Haasan makes shocking revelations

Star hero, Kamal Haasan's daughter, Shruthi Haasan is not having that great time in her career as she has no big films apart from...

Did Pawan Kalyan hide her abortion?

The initials PK drives people of two Telugu states crazy. Everyone associates them with Power Star Pawan Kalyan, chief of Jana Sena. But since...

Suresh Babu reveals bad news for movie fans

The lockdown has left many lives in danger as the film business has gone for a toss. Shoots have been stalled and most importantly,...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show