Home Andhra Pradesh Rayalaseema కడప ఉక్కు పై గొంతు విప్పలేవా జగన్మోహనా !

కడప ఉక్కు పై గొంతు విప్పలేవా జగన్మోహనా !

(యనమల నాగిరెడ్డి)

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం రాజకీయ నాయకుల భాద్యత. ఇలాంటి విషయాలపై స్పందించడం ప్రత్యేకించి పార్టీ అధినేతలకు అవసరం.  శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయ తలపెట్టిన ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రజాభీష్టం మేరకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆయన నిన్న ధర్మల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలను వాళ్ల శిబిరానికి వెళ్లి కలుసుకున్నారు. కాకరాపల్లి లో 3050 రోజులుగా ప్రజలు ప్రాజక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. జగన్ వారి దగ్గిరకు వెళ్లి పరామర్శించి మద్దతు తెలిపి హామీ ఇచ్చారు.ఇది హర్షణీయ.

అయితే  కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం సాగుతున్న ఆందోళన మీద జగన్ ఈ ఉత్సాహం ఎందుకు చూపడం లేదు?

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన కడప  ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం వైస్సార్ పార్టీ అధినేత ఎందుకు గొంతు విప్పడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రజల డిమాండ్లకు ఒక న్యాయం? ఇతర ప్రాంతాల వారికి ఒక న్యాయమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ అవసరాలపై ఆయనకు ఎందుకింత చిన్న చూపు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని  కాంగ్రెస్ ప్రభుత్వం “కమిటీని వేసి ఆరు నెలల లోగా ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక తెప్పించి అనే  చిన్న మెలిక” పెట్టి కడపకు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల కన్నీళ్లు తుడవడం కోసమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా  రాయలసీమలో పలు రాజకీయ పార్టీలు , ఉద్యమసంఘాలు, ప్రజాస్వామికవాదులు అనేక ఆందోళనలు చేశారు. బీజేపీ నాయకులు అడపా దడపా “ప్రధాని నరేంద్ర మోడీ” కడప ఉక్కుకు శంఖుస్థాపన చేస్తారని సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో ఫలితం సూన్యం. అయితే అత్యుత్సాహంతో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, అందుకు మద్దతు పలికిన బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీలు  ఆ తర్వాత చట్టంలో ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. “ప్రత్యేక హోదా” తప్ప మరే ఇతర డిమాండ్ ను జగన్ కూడా పట్టించుకోలేదు.

అనేక  ఆందోళనలు   

ప్రొద్దుటూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఏర్పాటు చేసిన నాలుగేళ్లుగా  ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం మ అనేక ఆందోళనలు చేశారు. నిరాహారదీక్ష కూడా చేశారు. ఇటీవల మరోసారి ఆందోళన  బాట పట్టారు.

ఇకపోతే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రవిశంకర రెడ్డి సుమారు నాలుగు వందల రోజులు రిలేనిరాహార దీక్షలు చేయించారు.  అలాగే అనేక రకాల ఆందోళనలు చేశారు కూడా.రాయలసీమలోని అనేక ప్రజా సంఘాలు శక్తి వంచన లేకుండా కడప ఉక్కు కోసం యుద్ధమే చేశారు.

టీడీపీ అధినేత సూచనల మేరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్, ఎం.ఎల్.సి బిటెక్ రవి మహా ఆర్బాటంగా, అంగరంగ వైభోగంగా ఆమరణ దీక్షలు (గిట్టని వారు దొంగ దీక్షలున్నారనుకోండి)” కూడా చేశారు. అనేక మంది మంత్రులు, ఎంఎల్ ఏ లు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు తండోపతండాలుగా ఈ దీక్షలకు మద్దతు పలికారు. బస్సులు పెట్టి జనాన్ని తరలించారు. చివరకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షా శిబిరానికి వచ్చి ఆ నాయకుల దీక్షలు విరమింప చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మూడు నెలల్లోగా కేంద్రం కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేయకపోతే రాష్ట్రమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తుందని ఘనంగా ప్రకటించారు”.(ప్రకటించి ఆరు నెలలైనా మరో  రకమైన ప్రకటనలు గుప్పించడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదు.) .

కడప ఉక్కు కోసం వైస్సార్ పార్టీ కడప ఎంపీ అవినాష్, ఇతర ఎంపీలు కూడా గొంతు విప్పారు. బీజేపీ నాయకుడు కందుల రాజమోహన్ రెడ్డి ఏకంగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వెంట పడ్డారు. అలాగే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఈ విషయంపై దృష్టి పెట్టామని అనేక సార్లు ప్రకటించారు.

నోరు విప్పని జగన్

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇన్ని జరుగుతున్నా వైస్సార్ పార్టీ అధినేతకు చీమ కుట్టినట్లు లేక పోగా , ఆయన  ఇప్పటి వరకూ నోరు విప్పక పోవడం అశ్చర్యం కలిగిస్తున్నది. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ఆందోళనలు జరిగినా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆయన తన వైఖరి ప్రకటించలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కమిటీ తేల్చిందని,  ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన ముడిసరుకు లేదనే కుంటి సాకులు చెప్పి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించినా ఆయన స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఫ్యాక్టరీ ఏర్పాటైతే నిధులకు కొరత ఉండదని, పని కూడా చురుకుగా  సాగుతుందని తెలిసికూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని ప్రకటించినా జగన్ ఎలాంటి స్పందన చూపలేదు.

ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా మత్స్య కారుల కోరిక మేరకు అక్కడ నిర్మించ తలపెట్టిన ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేస్తామని ప్రకటించగలిగిన జగన్ సొంత జిల్లాలో ఉన్న పరిస్థితులపై ఎందుకు స్పందించడం లేదని జనం గుసగుసలాడుతున్నారు. జగన్ బాబు తాను  ప్రతిరోజూ వల్లించే తారక మంత్రం “మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత” ప్రక్కన పెట్టి ఇప్పటికైనా కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

Recent Posts

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

బిగ్ న్యూస్‌: ప్ర‌భాస్ 21వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం 20 సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్నియువీ క్రియేష‌న్స్‌తో క‌లిసి గోపీకృష్ణ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తోంది. `సాహో` ఆశించిన...

నాగ‌శౌర్య సినిమాపై అది పుకారేన‌ట‌!

నాగ‌శౌర్య హీరోగా శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఇటీవ‌ల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. కొంత భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే తాజాగా నాగ‌శౌర్య న‌టించిన...

వీడియోటాక్‌: విశ్వ‌క్‌సేన్ హిట్టుకొట్టేలా వున్నాడే!

`ఫ‌ల‌క్‌నుమా దాస్‌` చిత్రంతో హంగామా చేసిన విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `హిట్‌`. కొత్త త‌ర‌హా పోలీస్ క‌థ‌తో ఈ చిత్రం రూపొందిన‌ట్టు తెలుస్తోంది. శైలేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రుహానీశ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది....

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...