Home Andhra Pradesh Rayalaseema పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన సవ్యంగా సాగుతుందా?

పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన సవ్యంగా సాగుతుందా?

అమరావతి నుండి రాజధాని తరలించ కూడదని మూడు రాజధానుల ప్రతి పాదన విరమించుకోవాలని పవన్ కల్యాణ్ ఈ నాటికి పోరాడుతున్నారు. రేపు 15 వ తేదీ రాజధాని గ్రామాల్లో పర్యటన పెట్టుకొని వున్నారు. కర్నూలులో హైకోర్టు ఏవిధంగా పెడతారని కూడా ప్రశ్నించిన సందర్భాలున్నాయి. ఈ దశలో కర్నూలులో చంద్రబాబు నాయుడు తో పాటు పవన్ కళ్యాణ్ శవ యాత్రలు జరిగాయి. సీమ ఉద్యమ కారులు నిరసన ప్రదర్శనలు చేశారు. పవన్ కళ్యాణ్ ను రాయలసీమ ద్రోహిగా సీమ ఉద్యమ కారులు ముద్ర వేశారు ఒకప్పుడు రాయలసీమ పరిరక్షణ కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ కోస్తా వాళ్ళ ఏజంట్ గా మారి పోయారని సీమ జిల్లాల్లో అడుగు పెట్ట నివ్వమని ఉద్యమ కారులు ప్రకటనలు చేసిన సందర్భముంది.

ఇటీవల వరకు సీమ పర్యటన గురించి పట్టించుకోని పవన్ కళ్యాణ్ హఠాత్తుగా కర్నూలు జిల్లా జన సేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు నెలకొల్పే అంశం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి సమావేశం తర్వాత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కర్నూలులో హైకోర్టు నెలకొల్పుటకు జనసేన అనుకూలమని ప్రకటన చేశారు.అయినా తన పర్యటనలో నిరసనలు వ్యక్తం అవుతాయని భావించి కాబోలు. తెలుగు దేశం హయాంలో హత్యాచారానికి గురైన గిరిజన యువతి ప్రీతికి న్యాయం కోసం తను ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైకోర్టుకు అనుకూలంగా ప్రకటన చేసినా సుగాలి యువతి ప్రీతి అంశం ముందుకు తెచ్చినా సీమ ఉద్యమ కారులు సంత్రుప్తి పడ లేదు
కొందరు పవన్ కళ్యాణ్ వస్తే అడ్డగిస్తామని ప్రకటనలు చేశారు. అందుకు ప్రతిగా గిరిజన సంఘాల నేతలు పలువురు పవన్ కళ్యాణ్ పర్యటనకు అండగా వుంటామని ప్రకటనలు చేశారు.ఇరువురు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని వుంది.

ఈ పూర్వ రంగంలో పవన్ కళ్యాణ్ పర్యటన కర్నూలు జిల్లాలో బుధ గురు వారాల్లో జరగ నుంది. కర్నూలులోనే కాకుండా ఎమ్మిగనూరులో కూడా పర్యటన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సీమ ఉద్యమకారుల స్పందన ఏలా వుంటుందో చూడాలి. సీమ ఉద్యమకారులురు నిరసన ప్రదర్శనలు నిర్వహించితే అటు పోలీసులు ఇటు జనసైనికులు స్పందన తీవ్రంగా వుండే పరిస్థితి వుంది.

అయినా ఎప్పుడో 2017 జరిగిన ప్రీతీ హత్య మీద ఇప్పుడే నిద్రలేచినట్టు పవన్ కళ్యాణ్ స్పందించడం కొందరికి ఆశ్చర్యం కలగచేస్తుండగా, కొందరేమో ఇది పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఒక వ్యూహాత్మకమైన పర్యటనగా చూస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులూ ఎప్పుడు కోరుకునేది వార్తల్లో నిలవాలని. ఈ పర్యటనతో ఆ లక్ష్యం పవన్ కళ్యాణ్ కి సిద్ధిస్తుంది.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

సీసీసీ నిధికి చేరిన 6 కోట్లు కార్మికుల అకౌంట్లోకి!

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్ప‌టి వ‌ర‌కు 6 కోట్ల‌కు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్‌, ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, ద‌గ్గుబాటి ఫ్యామిలీ.....

రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా?

ద‌ర్శ‌క‌ధీర అంటూ జేజేలందుకుంటున్న రాజ‌మౌళి మ‌ళ్లీ దొరికిపోయాడా? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. జ‌క్క‌న్న తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` ఓ హాలీవుడ్ చిత్రానికి కాపీ అని తెలిసింది. `స్టూడెంట్ నెం.1`...

క‌రోనా సినిమాలు చూడొచ్చు క‌దా శేష్‌?

టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్త‌ద‌నం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావ‌డం గూఢ‌చారి హీరో శేష్ ప్ర‌త్యేక‌త‌. ఇంత‌కుముందు గూఢ‌చారి అలాంటి సినిమానే. ఉన్న‌ట్టుండి ప‌రిమిత బ‌డ్జెట్...

ఇంట్లో క్వారంటైన్ అని చెప్పి కుర్ర‌హీరోతో బెడ్ రూమ్‌లో

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని లాక్ డౌన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అగ్ర రాజ్యం పేద రాజ్యం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్ట‌బెట్టేసింది. ఈ స‌మ‌యంలో సెల‌బ్రిటీ ప్ర‌పంచం.. సామాన్య ప్ర‌జ‌లు అనే...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

వైట్ల వ‌ర్సెస్ కోన‌: క‌త్తుల‌తో పొడుచుకునేంత లేదు కానీ!

దర్శ‌కుడు శ్రీనువైట్ల‌-రైట‌ర్ కొన వెంక‌ట్ జోడీ సూప‌ర్ స‌క్సెస్ ల గురించి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఢీ`..`రెడీ`.. `దూకుడు`..`బాద్ షా` బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. ఈ విజ‌యాల‌తోనే శ్రీ‌ను...

క‌రోనా సాయం: ద‌ర్శ‌క‌ధీరతో ఎవ‌రికీ ఏ ఉప‌యోగం లేదా?

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో టాలీవుడ్ నుంచి కేవ‌లం స్టార్ హీరోలు.. కొంత మంది చిన్న హీరోలు... డైరెక్ట‌ర్లు.. కొద్ది మంది సాంకేతిక నిపుణులు మాత్రమే విరాళాలిచ్చారు. కోట్లాది రూపాయ‌లు దండుకున్న ఏ...

హీరోల పెళ్లిళ్లే కాదు అంద‌రి పెళ్లిళ్లు వాయిదా!

పెళ్లి వేడుక అంటే సామూహికంగా జ‌రిగేది. బంధుమిత్రులు బంధాలు అనుబంధాలు అన్నిటికీ ఇదో వేదిక‌. అంతేకాదు ఇప్పుడున్న ప‌రిస్థితిలో పెళ్లి చేసుకోవ‌డం అంటే పెను ప్ర‌మాదంతో పెట్టుకున్న‌ట్టే. కోరి ముప్పు కొని తెచ్చుకున్న‌ట్టే....

ర‌చ్చకెక్కి హ‌ద్దులు దాటుతున్న మహేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతోంటే మ‌రో హీరో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ ఈ మ‌ధ్య తారా స్థాయికి చేరుతోంది. ఈ సంక్రాంతికి ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌హేష్ నటించిన `సరిలేరు...

`పోకిరి` హాట్ గాళ్ ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్య‌హ‌!

2006లో వ‌చ్చిన ఇండ‌స్ట్రీ బ్లాక్ బ‌స్ట‌ర్ `పోకిరి`. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌హేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో టాలీవుడ్‌కి...