Home News Andhra Pradesh తన చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లేనా ?

తన చేతకానితనాన్ని ఒప్పుకున్నట్లేనా ?

అధికారంలో ఉన్నది చంద్రబాబునాయుడు. జగన్మోహన్ రెడ్డేమో ప్రధాన ప్రతిపక్ష నేత. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రప్రభుత్వ పాలనా పగ్గాలు మొత్తం చంద్రబాబు చేతిలో ఉంటాయనటంలో సందేహం అవసరంలేదు. పాలనాపగ్గాలు చంద్రబాబు చేతిలో ఉండగా శాంతిభద్రతలు అదుపు తప్పాయంటే అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలి.  అలాంటిది ఏపిని జగన్ మరో బీహారుగా మార్చాలని చూస్తున్నారంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది.

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రత్యేకంగా వైసిపి నేతలను టార్గెట్ గా చేసుకుని పోలీసులను పెట్టి చంద్రబాబు వాయించేస్తున్నారు. అయినదానికి కానిదానికి వైసిపి నేతలను అరెస్టులు చేయిస్తున్నారు. అదే సమయంలో మామూలుగా జనాలపైన, అధికారులపైన కూడా టిడిపి నేతల దాడులు పెరిగిపోతున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని తమకు గిట్టని వాళ్ళపైన టిడిపి నేతలు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా అడిగే వాళ్ళు లేరు.

అనేక చోట్ల మహిళలను నడిరోడ్డుపై బట్టలూడబీకి చావ కొట్టినా ఎవరిపైనా చర్యలుండటం లేదు. ఎంపి కేశినేని నాని, ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావు రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యం ముందే ఆయన గన్ మెన్ పైన చేయి చేసుకున్న విషయం తెలిసిందే. మరో ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టుపట్టుకుని కొట్టినా అదేమని అడగలేదు ఎవరూ.

నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు ఎలాగుందనటానికి పై ఉదాహరణలు కొన్నిమాత్రమే. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో కూడా టిడిపి ప్రజాప్రతినిధులదే ప్రముఖ పాత్ర. అంతెందుకు ఎక్కడ గొడవలున్నా టిడిపి నేతలే ఉంటున్నారు.  అలాంటిది ఏపిని జగన్ మరో బీహార్ లాగ మారుస్తున్నారని చెప్పటంలో అర్ధమేమన్నా ఉందా ? నిజంగానే జగన్ ఏపిని బీహార్ లాగ మారుస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేస్తున్నట్లు ?  అంటే తన చేతకాని తనాన్ని చంద్రబాబే ఒప్పకున్నట్లేగా ?

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...