Home TR Exclusive Ilapavuluri Murali Mohan Rao న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిన గొగోయ్ 

న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిన గొగోయ్ 

సుమారు పాతికేళ్ల క్రితం అని గుర్తు…చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా పదవీవిరమణ చేసిన ఐదారేళ్ళ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యాడు.  ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు.  ఎందుకు ఆయనకు ఆ పదవి దక్కిందయ్యా అంటే…ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లు, సిక్కుల ఊచకోత మీద ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ కు ఆయన అధ్యక్షుడు.  విచారణ జరిపి  కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చాడు!  అందుకు బహుమతిగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి గెలిపించిందని ఆరోపణలు ఉన్నాయి.  
 
దాదాపు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ గా పనిచేసిన  జస్టిస్ ప్రభా శంకర్ మిశ్రా  మీద అనేక దారుణమైన ఆరోపణలు వచ్చాయి.  అప్పట్లో ఒక కేసులో  చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి చంద్రబాబు ఆయనకు ఒక సినిమా నటిని తాయిలంగా సమర్పించారని నేటికీ చెప్పుకుంటారు…దీనిలో వాస్తవం ఎంతో తెలియదు.  ఏమైనప్పటికీ, ఆయన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారనేది వాస్తవం.  
 
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కక్రూ జగన్ మీద మోపడిన అక్రమాస్తుల కేసులో నాటి సోనియా, చంద్రబాబుల మనసెరిగి వెంటనే విచారణ చేపట్టడమే కాక జగన్ మీద సిబిఐ విచారణకు ఆదేశించారు.  ఫలితంగా ఆయన పదవీవిరమణ చేసిన ఇరవై నాలుగు గంటలు తిరగకముందే ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల సంఘం చైర్మన్ గా నియమించారు!  నిజానికి కక్రూ కాశ్మీర్ కు చెందినవాడు.  ఆయనకు తెలుగు భాష ఏమాత్రం రాదు.  తెలుగు ఆచారాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలతో ఆయనకు అసలు పరిచయం లేదు.  అలాంటి వాడిని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘానికి చైర్మన్ గా నియమించారంటే ఆశ్చర్యంగా లేదూ?   
 
నాలుగు నెలల క్రితమే సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రంజన్ ను ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది మోడీ ప్రభుత్వం.  దీనిమీద దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.  గొగోయ్ చేసిన ఘనకార్యాలు ఏమిటి?  ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కేవలం పదమూడు మాసాలు.  ఈ స్వల్ప సమయంలో ఆయన శబరిమలైలో మహిళలకు ప్రవేశం, రాఫెల్ విమానాల కొనుగోలులో మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, అయోధ్య వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు, ఆర్టికల్ 370 రద్దుపై అనుకూలం,…ఇలా దేశాన్ని రగిలిస్తున్న అనేక సమస్యల మీద ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారు.  ఫలితమే ఈ రోజు గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.   రాజ్యసభ సభ్యత్వం అంటే నెలకు మూడు లక్షల రూపాయల వేతనం, విలాసవంతమైన బంగాళా, ప్రభుత్వ కారు, సిబ్బంది, ప్రోటోకోల్, హంగామా, ఎంపీ లాడ్స్,  దేశంలో ఎక్కడికైనా ఉచిత విమానయాన సౌకర్యం, ఇంకా అనేక సదుపాయాలు ఉంటాయి.  
 
 గొగోయ్ నిర్వహించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పదవితో పోల్చితే ఈ రాజ్యసభ పదవి ఎంత?  ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పార్లమెంట్ చేసిన చట్టాలను సైతం కొట్టివేసి అధికారాలను కలిగి ఉన్నాడు.  ఆయన ఎవరైనా మంత్రిని తప్పు పడితే ఆ మంత్రి తక్షణం రాజీనామా చేసి పోవాల్సిందే.  దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆ ముఖ్యమంత్రి పదవి పోతుంది.  గవర్నర్లు, ఎలెక్షన్ కమీషనర్లు, రాజ్యాంగ సంస్థల అధినేతలు తీసుకున్న నిర్ణయాలను కొట్టేసే అధికారం కలిగిన పదవి అది.  అలాంటి వ్యక్తి గుంపులో గోవిందా లాంటి రాజ్యసభ సభ్యుడి పదవిని స్వీకరించారంటే ఆయన వ్యక్తిత్వానికే కాదు..న్యాయవ్యవస్థకు కూడా అతి పెద్ద మచ్చగా మిగిలిపోతుంది.  అంతే కాదు…ప్రస్తుత సుప్రీమ్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద  ఈ నియామకం ప్రభావాన్ని చూపిస్తుంది.  ఎంత జడ్జీలైనా వారు మానవమాత్రులే.  వారికీ కుటుంబాలు, కోరికలు, విలాసాలు, జల్సాల మీద మోజు ఉంటాయి..  ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే రిటైర్ అయ్యాక మరో ఆరేళ్ళ పాటు భోగమయ జీవితాన్ని గడపవచ్చు అనే అభిప్రాయం వారిలో ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.   వారి మనసులను కలుషితం చేస్తాయి.  
 
ఈదేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని, ఒక్క న్యాయవ్యవస్తే కొంచెం పరిశుద్ధంగా ఉన్నదని ప్రజలు నమ్ముతారు.  ప్రభుత్వం మనకు అన్యాయం చేసినపుడు న్యాయస్థానం తలుపు తడితే మనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం సజీవంగా ఉన్నది.  ఇలాంటి సమయంలో పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులకు పదవుల ఆశలు చూపుతూ వారి మనసులను చంచలింపజెయ్యడం ఘోరం.  ఒకసారి ప్రభుత్వంలో పదవీవిరమణ చేసిన వారు చట్టసభలకు ఎన్నిక లేదా ఎంపిక కావడం, కమీషన్ల పదవులు, అధ్యక్ష పదవులు…అలాగే ఎలాంటి లాభదాయక పదవులు చేపట్టకుండా కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

RR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...