Home News Andhra Pradesh జగన్‌కి ఇక కోర్టులతోనే చెక్... చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ

జగన్‌కి ఇక కోర్టులతోనే చెక్… చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ

అధికారంలోకి వచ్చినప్పటినుండి జగన్ సర్కార్‌కు కోర్టులలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా అంశాల్లో అక్షింతలు పడుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక ఎన్నికల అంశంలోనూ.. ఇప్పుడు కర్నూలుకు కార్యాలయాల తరలింపులోనూ ప్రభుత్వాానికి చుక్కెదురైంది. వీటన్నిటికి కారణం చంద్రబాబే అంటూ వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత మాత్రమో తెలియదు గానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం జగన్ సర్కార్‌ నిర్ణయాలను కోర్టుల ద్వారానే చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాపై పోరాటం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలని కోరారు. అలాగే స్థానిక ఎన్నికల్లో వైకాపా అక్రమాలపై పోరాడాలని, ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లు సేకరించాలని నాయకులకు సూచనలు చేస్తున్నారు. వైకాపాబెదిరింపులకు పాల్పడినా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సరే వాటికి సంబంధించి సాక్షాలు సేకరించాలని అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసీకి పంపించాలని దిశా నిర్దేశం చేయడం చూస్తుంటే.. ఇకపై న్యాయస్థానాల ద్వారా పోరాటానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా స్థానిక ఎన్నికల ప్రక్రియలో వేలాదిమందిపై కేసులు బనాయించినట్లు, ఎస్‌ఈసీ రాసిన లేఖ కూడా ఇప్పుడు టీడీపీకి అస్త్రంగా మారింది. అలాగే ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలపై కూడా ఎక్కడికక్కడ కోర్టులలో కేసులు వేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అందుకోసం చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకునేలా కూడా బాబు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా జగన్ సర్కార్‌కు న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతుంటే.. ఇప్పుడు దాన్నే చంద్రబాబు తన అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. మరి చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా..? లేదా జగన్‌ సర్కార్‌ కోర్టులను ఎదుర్కొనేందుకు తన వ్యూహాలను మార్చుకుంటుందా అన్నది చూడాలి.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...

సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి...

సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్...

గురూజీని లాక్ చేసి పూరి చెప్పిందే నిజం చేశాడా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ ఉన్న ద‌ర్శ‌కుల వెంట ప‌డ‌తాడ‌ని పూరి అంత‌టివాడే సెల‌విచ్చారు. అది వాస్త‌వ‌మేనా? అంటే ఇటీవ‌ల త‌న ఎంపిక‌లే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ప్ల‌స్ స‌క్సెస్ రెండూ...