Home TR Exclusive A column by Aditya రూ 150 కోట్లు ... అందుకే సిబిఐ వద్దన్నారా?

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 “ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి.” “మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన ఆధారాలు దొరికాయి.””డైరీలు, ఈమెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలు, వాట్సాప్ సందేశాలు, నోటు పుస్తకాలు, విడి కాగితాలు లభించాయి.” “ఢిల్లీ, ఆగ్రా, పూణే, ముంబయి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఈరోడ్ నగరాల్లో 82 ప్రదేశాల్లో దాడులు, పరిశోధనలు జరిగాయి.” “లెక్కలు లేని ధనం, చిరునామా లేని కంపెనీలు అనేకం ఉన్నట్టు తేలింది. చిరునామా లేని కంపెనీల ద్వారానే హవాలా లావాదేవీలు జరిగాయి. హవాలా ప్రతినిధులు చిరునామా లేని కంపెనీల ద్వారా విదేశీ పెట్టుబడుల రూపంలో నల్లధనాన్ని తిరిగి తెచ్చినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి.” ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు. సాక్షాత్తు దేశ ఆదాయపన్ను శాఖ అధికారులు చెప్పినవి. ఈనెల 11 మరియు 13 తేదీల్లో ఆశాఖ అధికారి, శాఖ అధికారప్రతినిధి అయిన సురభి అహ్లువాలియా స్వయంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాలు.

డైరీల్లో, వాట్సాప్ సందేశాల్లో ఈమెయిలు సందేశాల్లో అనేక పేర్లు, ఆధారాలు లభించాయి. బోగస్ కంపెనీలు, చిరునామాలో కనిపించని కంపెనీలు, అసలు చిరునామాయే లేని కంపెనీలు… ఇలా అనేకం అధికారులకు దొరికాయి. వీటిలోనే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించినట్టు సాక్షాధారాలు ఉన్నాయని సదరు అధికారి విడుదల చేసిన ప్రకటనల్లో స్పష్టం చేశారు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో సదరు అధికారి చెప్పకపోయినా అధికారులు దాడులు నిర్వహించిన ప్రదేశాలు, వాటి యజమానుల పేర్లు ఆధారంగా అన్ని వేళ్ళూ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. అనేకమంది పారిశ్రామిక వేత్తలు, చిన్నా చితకా వ్యాపార వేత్తలు, పెట్టుబడి దారులు, హవాలా ఏజెంట్లు, బ్రోకర్లు ఇలా అనేకమందితో పాటు చంద్రబాబు వద్ద 1995 నుండి 2019 వరకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఇంట్లో కూడా అధికారులు సోదా చేశారు. అందుకే చంద్రబాబుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావుపై దాడి జరగడంతో అంతకు ముందు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు పునఃశ్చరణ చేసుకోవాల్సి వస్తోంది.

బీజేపీతో పొత్తు తెంచుకున్న తర్వాత “ధర్మ పోరాట దీక్ష” పేరుతో రాష్ట్రంలో పలు ప్రాంతాలతో పాటు దేశరాజధానిలో కూడా నిర్వహించిన అనేక సభల్లో చంద్రబాబు ఒక మాట చెప్పేవారు. బీజేపీ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, ఏదో ఒక సాకుతో తనను అరెస్టు చేసి జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందని అనేవారు. అంతే కాదు, ఒకవేళ తనను అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే ప్రజలంతా తన చుట్టూ వలయంలా నిలబడి తనను కాపాడుకోవాలని వేడుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోకి సిబిఐ అధికారులు రాకుండా “సాధారణ సమ్మతి”ని రద్దు చేస్తూ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో ఆయన విడిపోయిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి సిబిఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చింది. బీజేపీ ఎందుకు తనను అరెస్టు చేస్తుందో చంద్రబాబుకు ముందే తెలుసు. తాను చేస్తున్న ఆర్ధిక లావాదేవీల గురించి వాటి వల్ల కలిగే ప్రతికూల పరిస్థితుల గురించి తెలియకుండానే చంద్రబాబు ఇంత సాహసం చేసి ఉండరు. కాకపోతే వ్యవస్థలను “మేనేజ్” చేయడం అలవాటు కాబట్టి, హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు బహిరంగంగా విందులు ఇవ్వగలడు కాబట్టి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని మొదట ఊహించలేదు. బీజేపీతో విడిపోయిన తర్వాత, తనకంటే మొండివాడు, తనకంటే ఎక్కువగా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన నరేంద్ర మోడీ అంటే చంద్రబాబుకు కొంతమేర భయం వేసింది. అందుకే సిబిఐని రాష్ట్రంలో అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. తనను అరెస్టు చేస్తే వలయంలా నిలబడి కాపాడుకోండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిణామాల క్రమంలోనే ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు, సోదాలు ఆ తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటన చూడవలసి వస్తోంది. అధికారులు దాదాపు రూ 6 వేలకోట్లకు పైగా హవాలా రూపంలో దేశాలు తిరిగి మళ్ళి విదేశీ పెట్టుబడుల రూపంలో ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిందని, ఇదంతా 2015 నుండి 2019 మార్చి వరకూ జరిగిందని తెలుస్తోంది. అయినా దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుణ్ణి అని, అనుభవశాలిని అని, సమర్ధుణ్ణి, ముందుచూపు ఉన్న వ్యక్తిని అని చెప్పుకునే చంద్రబాబు తనవద్ద దాదాపు రెండు దశాబ్దాలపాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని అలా ఎలా వదిలేయగలిగారు? ఆయన దగ్గర డైరీలు, నోటుపుస్తకాలు ఉంటాయని, ఈమెయిలు, వాట్సాప్ సందేశాలు ఉంటాయని, అవి ఎప్పటికైనా, ఎవరికైనా దొరుకుతాయని, అవి దొరికితే తన బండారం బయటపడుతుందని గ్రహించలేక పోయారా?

Written by Aditya for Telugurajyam.com

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...

సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి...

సాగ‌ర‌క‌న్య అందాలు చూడ‌త‌ర‌మా!

లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఊహించ‌ని భ‌యాన‌క వాతావ‌ర‌ణంలోకి నెట్టివేయ‌బ‌డింది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. ఈ కార‌ణంగా సెల‌డ్రిటీలు, సినీతార‌లు, సామాన్యులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బాలీవుడ్ హాట్ గాళ్...