Home Andhra Pradesh Amaravathi టీడీపీ నేత‌ల కామెడీ: `తెలీదు, అడ‌గ‌లేదు, చెప్ప‌లేదు`

టీడీపీ నేత‌ల కామెడీ: `తెలీదు, అడ‌గ‌లేదు, చెప్ప‌లేదు`

అదుర్స్ సినిమాలో ఓ కామెడీ స‌న్నివేశం ఉంటుంది. ఎన్టీఆర్‌తో మూడే మూడు ముక్క‌లు మాట్లాడించే సీన్ అది. విల‌న్ రివాల్వ‌ర్ గురి పెట్టినప్పుడు కూడా `తెలీదు, గుర్తులేదు, మ‌ర్చిపోయా..`అంటూ మూడు ముక్క‌లే మాట్లాడ‌తాడు. అధికార తెలుగుదేశం పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ల ప‌రిస్థితి ఇప్పుడు దీనికి మించి కామెడీని పండిస్తోంది.

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో.. చంద్ర‌బాబు నాయుడు త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటూంటే బిక్క‌మొహాలు వేయ‌డం త‌ప్ప మ‌రేమీ చేయ‌లేక‌పోతున్నారు. అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారిపోయారు. అదేంట‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే `తెలియ‌దు, అడ‌గ‌లేదు, చెప్ప‌లేదు..` అని మూడు ముక్క‌ల్లోనే బ‌దులిస్తున్నారు.

తమ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు త‌న పార్టీలోనే చేరుతున్నార‌నే విష‌యం ఇప్ప‌టిదాకా త‌న‌కు తెలియ‌దని దాట‌వేస్తున్నారు. ఫ‌లానా వ్య‌క్తి పార్టీలో చేరుతున్నార‌నే స‌మాచారం త‌న‌కు లేద‌ని, త‌న‌ను ఎవ‌రూ అడ‌గ‌లేద‌ని, పార్టీ నాయ‌కులూ ముందుగా త‌న‌కు చెప్ప‌లేద‌ని నిట్టూరుస్తున్నారు. క‌ర్నూలు జిల్లాలో ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి ఇలాంటి సంక‌ట స్థితినే ఎదుర్కొంటున్నారు.

క‌ర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మ‌ధ్య‌ ఉన్న రాజ‌కీయ‌ వైరం ఎలాంటిదో ప్ర‌జ‌ల‌కు తెలుసు. రాజ‌కీయంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ‌చ్చారు. జిల్లా రాజ‌కీయాల‌పై ఆధిప‌త్యాన్ని సాధించ‌డానికి నిర్విరామంగా శ్ర‌మించారు. ఓ ర‌కంగా చెప్పాలంటే జీవిత‌కాల పోరాటం చేశారు. ఒక్కోసారి ఒక్కో కుటుంబానికి ఆధిప‌త్యం ద‌క్కుతూ వ‌చ్చింది. రాష్ట్ర విభ‌జ‌న వ‌ర‌కూ ప‌ర‌స్ప‌రం పైచేయి కోసం పావులు క‌దిపిన కుటుంబాలే అవి.

విభ‌జ‌న త‌రువాత ఆ అప‌వాదును కాంగ్రెస్ భ‌రించాల్సి వ‌చ్చింది. దీనితో- కోట్ల కుటుంబం ఒక్క‌సారిగా లూప్‌లైన్‌లో ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న చోటు చేసుకున్న అనంత‌రం తొలి అయిదేళ్లూ కోట్ల కుటుంబం స్త‌బ్దుగానే ఉంది. ఇక ఎన్నిక‌లు ముంచుకొస్తుండ‌టంతో రాజ‌కీయంగా ఉనికిని చాటుకోవాల్సిన అవ‌స‌రం ఆ కుటుంబానికి ఉంది. అందుకే- తెలుగుదేశం వైపు ఆయ‌న చూపులు సారించారు. ఇక్క‌డ తెలుగుదేశం పార్టీకి కోట్ల కుటుంబం అండ కావాల్సిందే.

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహ‌న్ రెడ్డి (క‌ర్నూలు), బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి (శ్రీ‌శైలం), భూమా అఖిల‌ప్రియ (ఆళ్ల‌గ‌డ్డ‌), మ‌ణిగాంధీ (కోడుమూరు), నంద్యాల ఉప ఎన్నికను పక్కన పెడితే 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో టీడీపీ గెలుచుకున్నవి మూడే.

జిల్లాలో ఉన్న రెండు లోక్‌స‌భ స్థానాలు క‌ర్నూలు, నంద్యాల‌లోనూ టీడీపీ ఘోరంగా ఓట‌మి పాలైంది. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వారిలో ఒకరు మంత్రి కూడా. ఇద్దరు ఎంపీలనూ టీడీపీ ఆకర్షించగలిగింది.

జిల్లాలో బ‌ల‌హీనంగా ఉన్న పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కేఈ కుటుంబం స‌త్తా చాల‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ్ర‌హించారు. అందుకే ద‌శాబ్దాలుగా పార్టీకి సేవ‌లందిస్తున్న కేఈ కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి బ‌ద్ధ విరోధి కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవ‌డానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక్క‌డ కామెడీ ఏమిటంటే కోట్ల‌ను పార్టీలో చేర్చుకుంటున్న‌ట్లు కేఈ కుటుంబానికి మాట మాత్రంగా కూడా చెప్ప‌లేదు. క‌నీస స‌మాచారమూ ఇవ్వ‌లేదు.

ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. వ‌య‌స్సు మీద ప‌డింది. త‌న కోసం కాక‌పోయినా, వార‌సుల కోస‌మైనా ఆయ‌న తెలుగుదేశంలోనే కొన‌సాగాల్సిన అవ‌స‌రం కేఈ కృష్ణ‌మూర్తికి ఉంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటాన‌ని విలేక‌రుల స‌మావేశంలో కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన కేఈ అన్నంత‌ప‌నీ చేశారా? లేదే. టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.

ఇలా రాజ‌కీయ ప్రత్య‌ర్థుల‌ను పార్టీలో చేర్చుకుని సొంత నాయ‌కుల‌కే షాక్ ఇవ్వ‌డం చంద్ర‌బాబు కొత్తేమీ కాదు. గ‌తంలో అనంత‌పురం జిల్లాలోనూ చంద్ర‌బాబు ఇదే పాచిక విసిరారు. జేసీ దివాక‌ర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్న‌ట్లు అదే జిల్లాకు చెందిన ప‌రిటాల కుటుంబానికి ముంద‌స్తుగా ఎలాంటి ఇన్ఫ‌ర్మేష‌నూ లేదు. నంద్యాల‌లో భూమా కుటుంబం, జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఆదినారాయ‌ణ రెడ్డి చేరికలు కూడా ఇదే త‌ర‌హాలో కొన‌సాగాయి.

చంద్ర‌గిరిలో గ‌ల్లా అరుణ కుమారి, ఆయ‌న కుమారుడు గ‌ల్లా జ‌య‌దేవ్‌ను పార్టీలో తీసుకుంటున్నార‌నే ముందస్తు స‌మాచారం చిత్తూరు జిల్లా టీడీపీ నాయ‌కుల‌కు లేదు. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టుగా మెడ‌లో ప‌సుపు కండువా క‌ప్పేశారు చంద్ర‌బాబు. టీడీపీ నేత‌లు ప‌డుతున్న ఈ దుస్థితిని చూస్తోంటే.. అదుర్స్ సినిమాలోని కామెడీ స‌న్నివేశాలే గుర్తుకొస్తున్నాయి.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...