Home Andhra Pradesh Amaravathi చిన్నల్లుడుకే మద్దతిచ్చిన బాలకృష్ణ..చంద్రబాబుకు షాక్

చిన్నల్లుడుకే మద్దతిచ్చిన బాలకృష్ణ..చంద్రబాబుకు షాక్

పార్టీ నేతల మధ్య ఇపుడిదే చర్చ జరుగుతోంది. లేకపోతే టికెట్ ఇచ్చేది లేదని చెప్పేసిన తర్వాత మళ్ళీ అదే అభ్యర్ధికి చంద్రబాబు పిలిచి టికెట్ ఇచ్చేటప్పటికి తెరవెనుక బావమరది బాలయ్య జోక్యంతోనే సాధ్యమయ్యిందనే విషయం బయటకు పొక్కింది. దాంతో తెరవెనుక అసలేం జరిగిందనే విషయాలు మెల్లిగా బయటకు వస్తున్నాయ్. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రకాశం జిల్లాలో కదిరి నియోజకవర్గం సిట్టింగ్ ఎంఎల్ఏ కదిరి బాబురావు. కదిరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడున్న విషయం అందరకీ తెలిసిందే.

పోయిన ఎన్నికల్లో గానీ అంతకుముందు ఎన్నికల్లో గానీ కేవలం బాలకృష్ణ వల్లే కదిరికి టికెట్ వచ్చింది. రాబోయే ఎన్నికల్లో కదిరికి టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు నిరాకరించారు. సర్వేల్లో కదిరిపై బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, పోటీ చేయించినా  ఓడిపోతారంటూ టికెట్ ఇవ్వటానికి నిరాకరించారు. దాంతో కదిరి వెళ్ళి బాలకృష్ణ నెత్తిన కూర్చున్నారు. కదిరికి టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో లేని చంద్రబాబు కాంగ్రెస్ సీనియర్ నేత ఉగ్రనరసింహారెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు.

ఇద్దరినీ సమీక్షకు పిలిపించి కదిరికి టికెట్ ఇచ్చేది లేదని చెప్పటంతో పాటు పోటీకి రెడీ అవమంటూ ఉగ్రకు చెప్పేశారు. దాంతో ఒళ్ళుమండిపోయిన కదిరి బాలకృష్ణతో మాట్లాడారు. వెంటనే  బాలయ్య జోక్యం చేసుకున్నారు. నియోజకవర్గంలో పరిస్ధితిని బాలయ్యకు వివరించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే బాలయ్య చంద్రబాబు మాటను ఏమాత్రం పట్టించుకోలేదు. తన మిత్రుడికి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు.

పనిలో పనిగా చిన్నల్లుడు శ్రీ భరత్ కు కూడా ఎంపిగా టికెట్ ఇవ్వాల్సిందేనంటూ హుకూం  జారీ చేశారని అంటున్నారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచక చివరకు కదిరి బాబురావుకు కనిగిరిలో టికెట్ ఖాయం చేశారు. ముందు భరత్ కు ఎంపిగా టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు చివరలో మొండిచెయ్యి చూపించారు. కానీ బాలయ్య జోక్యంతో ఇపుడు భరత్ కు టికెట్ ఇవ్వక తప్పటం లేదట. ఏం చేస్తాం చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత.

 

Telugu Latest

గ‌త 24 గంట‌ల్లో.. ఇండియాలో క‌రోనా ప‌రిస్థితి ఇదే..!

భారత్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతూనే ఉన్నాయి. ప్ర‌భుత్వ, అధికార‌ యంత్రాంగాలు, అన్ని ర‌కాలుగా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా, దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి బ్రేక్ ప‌డ‌డంలేదు. ఇక గ‌త...

జ‌గ‌న్ కి వ్య‌తిరేకంగా కాపులు..సాధ్య‌మేనా?

కాపుల ఆశాజ్యోతి, కాపు ఉద్య‌మ‌నాయకుడు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం అనూహ్యంగా కాపు ఉద్య‌మ‌నాయ‌కుడిగా త‌ప్పుకుంటు న్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ద‌శాబ్ధాల క్రితం వంగ‌వీటి రంగ త‌ర్వాత మ‌ళ్లీ కాపు అనే...

ప్లాస్మా దానంపై రాజ‌మౌళి స్ఫూర్తి నింపే పిలుపు

కోవిడ్-19 తో పోరాడి వైరస్ భయాన్ని జ‌యించి విజయవంతంగా బయటపడిన వ్యక్తులు దానం చేసిన రక్త ప్లాస్మా వైరస్ సోకిన ఇతర రోగుల చికిత్సలో గేమ్ ‌ఛేంజర్ ‌గా మారింది. ఆ మేర‌కు...

ప్రియాంక చోప్రా‌ బ్ర‌ద‌ర్ ప్రేమ‌లో అల్ల‌రోడి హీరోయిన్

ప్రియాంక చోప్రా నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుని అమెరికా ప‌య‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హాలీవుడ్ లో స్థిర‌ప‌డేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌ల‌తో పీసీ బిజీగా ఉంది. అక్క‌డ వ‌రుస సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ...

విజ‌యేంద్రుడి స్క్రిప్టు.. కంగ‌న ద‌ర్శ‌క‌త్వం

రచయిత విజయేంద్ర ప్రసాద్ క్రేజు అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. బాలీవుడ్‌లో ఆయ‌న ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ. ముఖ్యంగా బాహుబలి స‌క్సెస్ తర్వాత అత‌డికి క్ష‌ణం తీరిక లేని...

English Latest

Revanth: KCR looting Nizam Khajana

Congress firebrand leader Revanth Reddy is known for his sensational comments against Telangana CM KCR and his family members, daughter Kavitha, nephew Harish Rao,...

Surya to turn a baddie in his OTT debut

Mani Ratnam is producing a web series that has been titled Navarasa. The series will have nine episodes and will be directed by nine...

Can RGV dare KCR and Jagan?

Maverick director Ram Gopal Varma is known for his daring and dashing attitude. Though he is known for his insane acts, no one has...

What did YV.Subba Reddy give to Union Minister

Everyone is aware that former AP CM Chandra Babu Naidu failed to get things from the Union Government asking them the right favours at...

Letter Head giving shock to Jagan

YSRCP which sent show cause notice to its MP Raghurama Krishnam Raju is getting shocks as the matter reached the Delhi High Court. The...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show