Home Andhra Pradesh Amaravathi కొడుక్కి టిక్కెట్టు నో..జెసికి చంద్రబాబు షాక్

కొడుక్కి టిక్కెట్టు నో..జెసికి చంద్రబాబు షాక్

అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డికి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే జెసినే చేయాలని లేకపోతే వేరొకరికి టిక్కెట్టు కేటాయిస్తానని జెసికే స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన కొడుకు జెసి పవన్ రెడ్డికి అనంతపురం ఎంపిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జెసి ఎప్పటి నుండో కోరుతున్నారు. తాను రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్లు చెప్పిన జేసి తన స్ధానంలో కొడుకు పవన్ రెడ్డి పోటీ చేస్తారని తనంతట తానుగా ప్రకటించేశారు.

కొడుకు అభ్యర్ధిత్వంపై జెసి ఏకపక్షంగా చేసిన ప్రకటనపై అప్పట్లో చంద్రబాబు మండిపడ్డారు. తర్వాత చంద్రబాబు, జేసి మధ్య భేటీలో కొడుకు పోటీపై చంద్రబాబు ఆమోదం తీసుకున్నట్లు సమాచారం. దాంతో అందరూ అనంతపురం టిడిపి ఎంపి టిక్కెట్టు జేసి పవన్ కే అనుకున్నారు. అయితే, అనూహ్యంగా పరిస్ధితులు మారిపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పవన పై చంద్రబాబుకు పార్టీ నేతల నుండే విపరీతమైన ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా పవన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.  

పార్టీలోని ఎంఎల్ఏలు, నేతలతో పవన్ కు సరైన సఖ్యత లేదని, ఎవరిని కూడా కలుపుకునిపోయే మనస్తత్వం లేదని ఫిర్యాదులు అందినాయట. నియోజకవర్గంలో  ఎప్పుడు పర్యటించినా ఎంఎల్ఏలను, నేతలను డామినేట్ చేసే మనస్తత్వంతోనే పవన్ వ్యవహరిస్తున్నారట.  పవన్ మనస్తత్వాన్ని దగ్గర నుండి చూసిన తర్వాత ఎంఎల్ఏలు, నేతలు కూడా జేసి కొడుకుతో కలవటానికి ఇష్టపడటం లేదని సమాచారం. పైగా పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని దివాకర్ రెడ్డి పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఎంఎల్ఏలకు జెసికి ఏమాత్రం పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.  దానికి తగ్గట్లే కొడుకు వ్యవహారం కూడా నడుస్తోందని నేతలు మండిపడుతున్నారట.

పవన్ వ్యవహారశైలి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న ఎంఎల్ఏల్లో ఎవరికీ టిక్కెట్లు దక్కవని చెప్పకనే చెబుతున్నట్లుందని అందరూ అనుమానిస్తున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా పవన్ కు వ్యతిరేకంగా ఎంఎల్ఏలు, నేతలు ఏకమవుతున్నారు. పవన్ అభ్యర్ధి అయితే పార్టీ గెలవదని కూడా స్పష్టంగా చంద్రబాబుకు చెప్పారట. దాంతో చంద్రబాబు పునరాలోచించి ఎంపితో ఇదే విషయాన్ని చెప్పారని పార్టీ వర్గాలంటున్నాయి.  పోటీ చేస్తే జేసి దివాకర్ రెడ్డే  చేయాలని లేకపోతే వేరే నేతకు టిక్కెట్టిచ్చి పోటీ చేయిస్తానని చంద్రబాబు చెప్పేశారట.  చంద్రబాబు నిర్ణయంతో జెసి ఏమి  చేస్తారో ? పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.

 

 

 

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...

లాక్ డౌన్ లో హీరోని అప్ప‌డిగిన హీరోయిన్!

ఎంకి చావు సుబ్బికొచ్చిన‌ట్టుగా ఉంది మ‌రి. ప్ర‌పంచం దేశాలు లాక్ డౌన్ సీన్ తో తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. దీంతో అన్ని బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా వినోద ప‌రిశ్ర‌మ‌లు ఖ‌తం...

RRR రిలీజ్ పై దాన‌య్య కాన్ఫిడెన్స్ ఏంట‌బ్బా!

లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇండియాస్ మోస్ట్  అవైటెడ్ మూవీ RRR రిలీజ్ పై నీలి నీడ‌లు క‌మ్ముకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా తాత్కలికంగా షూటింగ్ లు అన్నీ బంద్...

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...