Home Andhra Pradesh Amaravathi ఓటుకునోటు : చంద్రబాబుకు సంబంధమే లేదట...జనాలేమన్నా పిచ్చోళ్ళా ?

ఓటుకునోటు : చంద్రబాబుకు సంబంధమే లేదట…జనాలేమన్నా పిచ్చోళ్ళా ?

తాజాగా స్టేట్మెంట్ విన్నవారందరిలోను విస్మయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ,  తెలంగాణాలో ఓటుకునోటు కేసులో వీడియో టేపులతో అడ్డంగా దొరికిన తర్వాత రేవంత్ రెడ్డిపై జరుగుతున్న ఐటి దాడులకు టిడిపికి సంబంధమే లేదని తేల్చేశారు. అసలు ఓటుకునోటు కేసుకు, టిడిపికి సంబంధం ఏంటని చంద్రబాబు వేసిన ప్రశ్నకు ఎంపిలెవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఓటుకునోటు కేసుకు తనకు కూడా సంబంధం ఏమీ లేదని కానీ ఆ కేసుకు, టిడిపికి, ఆ కేసుకు తనకు లింక్ పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు అనగానే ఎంపిలకు ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.

ఇక్కడ చరిత్రను ఒకసారి చూద్దాం. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా వేం నరేందర్ రెడ్డిని పోటీలోకి దింపింది. నిజానికి టిడిపి అభ్యర్ధి గెలిచే అవకాశమే లేదన్న విషయం అందరికీ తెలుసు. అయినా పోటీలోకి చంద్రబాబు అభ్యర్ధి ఎందుకు దింపారో అర్ధం కాలేదు. అయితే, 2015, జూన్ 8వ తేదీన హఠాత్తుగా ఓ విషయం బయటపడింది. తెలంగాణాలో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేయటంలో అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రూ 50 లక్షలతో పట్టుబడ్డారు. తర్వాత కొద్ది సేపటికే డబ్బులు ఇస్తున్న వీడియో టేపులు కూడా వెలుగుచూశాయి. దాంతో ఆ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సరే, తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే.

ఓటుకునోటు కేసులో పట్టుబడిన టిడిపి ఎంఎల్ఏలు రేవంత్, సండ్ర వెంకటవీరయ్య అండ్ కో కేవలం తెరమీద కనబడుతున్న పాత్రలు మాత్రమే. ఎంఎల్ఏల కొనుగోలులో తెరవెనుక సూత్రదారి చంద్రబాబే అన్న విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. ఆ కేసు విచారణ జరిగితే తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న భయంతోనే కేసు విచారణ జరక్కుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు కోర్టుల్లో స్టే తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే మళ్ళీ ఇంతకాలానికి డొంక కదులుతోంది. అందుకే ఎన్నికల సభల్లో కెసియార్ మాట్లాడుతూ, ఓటుకునోటు కేసులో చంద్రబాబు దొరికిన దొంగన్నారు. బ్రీఫ్ డ్ మీ అంటూ ఆడియోటేపుల్లో దొరికిన దొంగ చంద్రబాబు అంటూ విరుచుకుపడుతున్నారు.  ఇది..అందరికీ తెలిసిన విషయాలు.

కానీ విచిత్రంగా టిడిపిపి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఓటుకునోటు కేసుతో తనకు సంబంధమే లేదని చెప్పటంతో నేతలందరికీ మతిపోయింది. ఆ కేసును అనవసరంగా టిడిపికి ముడిపెడుతున్నారంటూ అమాయకంగా చంద్రబాబు చెప్పటంతో ఏం చెప్పాలో ఎంపిలకు అర్ధం కాలేదు. స్టీఫెన్ సన్ తో ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు తనది కాదని కానీ తనదే అనికాని ఇంత వరకు బహిరంగంగా చెప్పుకోలేని దౌర్భాగ్యస్ధితిలో చంద్రబాబున్నారు. అటువంటిది ఆ కేసుకు తనకు, పార్టీకి ఏమిటి సంబంధమని అడిగితే నమ్మటానికి జనాలేమన్నా పిచ్చోళ్ళా ?

Recent Posts

కన్నా లక్ష్మీనారాయణను తప్పించేందుకే ఆ ఎత్తుగడ!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైకాపా కోవర్టు అన్న వార్తలు వచ్చాయి. త్వరలో కన్నా బీజేపీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు అని కూడా టాక్ వినబడింది. కానీ...

ఇండ‌స్ట్రీకి పెద్ద‌న్నగా మెగాస్టార్ చిరంజీవి!

ఇండ‌స్ట్రీలో ఏం జ‌రిగినా ఆ పంచాయితీ దాస‌రి వున్న కాలంలో ఆయ‌న ఇంటికి చేరాల్పిందే. అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీకి ఆయ‌న పెద్ద‌న్న‌గా వ్య‌వ‌హ‌రించేవారు. ఎలాంటి స‌మ‌స్య‌నైనా న‌యాన్నో భ‌యాన్నో ప‌రిష్క‌రించేవారు. దాస‌రి మాట అన్నారంటే...

క‌మ‌ల్‌హాస‌న్‌పై త‌ప్పుడు ప్ర‌చారం!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం అల్లాడిపోతోంది. రోజు రోజుకీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండ‌టంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వ‌చ్చిన వారిని చెక్ చేస్తున్న కార్పెరేష‌న్ సిబ్బంది పాజిటివ్...

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...