Home Andhra Pradesh Amaravathi తెలుగోడా - ఆపక్కనుంటావా? - ఈ పక్కనుంటావా?

తెలుగోడా – ఆపక్కనుంటావా? – ఈ పక్కనుంటావా?

“విశ్వసనీయత కోల్పోతున్న మీడియా, దిగజారుతున్న విలువలు,” అని ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం. “రాజధాని గుండె పగిలింది” అంటూ ఒక తెలుగు పత్రికలో ప్రత్యేక కథనం. “రాజధాని అక్రమాలపై సిట్” అంటూ మరో పత్రిక. ఇళ్ళ స్థలాల కోసం “అస్సైన్డ్” భూములు గుంజుకుంటున్న వైనం పై “రాత్రికి రాత్రే దున్నేశారు” అంటూ ఒక పంటపొలం ధ్వంసం చేసిన తీరు ఇంకో పత్రికలో ప్రత్యేక కథనం.

ఈ కథనాలపై సోషల్ మీడియాలో పోస్టుల వైరల్ అవుతాయి. ఎవరి రాజకీయ విధానం మేరకు వారు ఈ వార్తలపై, ప్రత్యేక కథనాలపై పోస్టుల యుద్ధం చేస్తారు. ఈ క్రమంలో తప్పు ఎక్కడ జరుగుతోంది, నిజమేది, అబద్దమేది, సరిదిద్దాల్సిందేది అనే అంశాలు మర్చిపోతాం. అయినా మీడియాలో వార్తలు చూసేటప్పుడు, సమాజంలో జరుగుతున్న సంఘటనలు తెలుసుకునేటప్పుడు మనం ఎటువైపు అన్నదానిపైనే ఆ సంఘటలను, వాటిపై వార్తలు అర్ధం అవుతాయి.

అధికార యంత్రంగా (బ్యూరోక్రసీ) ప్రజలను ఎప్పుడో వదిలేసింది. అధికారులు ప్రజలకు జవాబుదారిగా ఉండడం వదిలేసి ప్రజలపై పెత్తనం చేసే పాలకులుగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళకు “టార్గెట్ రీచ్” అవడమే ప్రధానం. అందుకోసం అధికారులు ఏమైనా చేస్తారు? ఏమీ చేయకుండా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఇళ్ళస్థలాలు. ఈ “టార్గెట్” లో అగ్రభాగాన ఏ జిల్లా ఉంటుందో, ఏ అధికారి ఉంటారో అన్నదే ప్రశ్న. అందుకోసమే కనిపించిన భూమి ఈ “టార్గెట్” వలలో చిక్కుకుంటోంది. అందుకే బడుగు జీవుల అస్సైన్డ్ భూములు స్వాహా అవుతున్నాయి.

ఇప్పుడు రైతులు, రైతు కూలీలు, వారి సమస్యలే మీడియా ఎజెండాగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం హర్షించతగ్గదే అయినా ఇలాంటి వార్తలు మీడియా మర్చిపోయి ఎన్నో యేళ్ళయింది. ఇప్పుడు కూడా కేవలం రాజకీయమే ఈ అంశాలను మీడియాకు ఎజెండాగా తెచ్చాయి.

మీడియా విశ్వసనీయతపై ఆంగ్లపత్రికలోని వ్యాసంలో ఆవేదన కనిపించింది. అయితే మీడియా ఒక “బాధ్యత”గా కాకుండా “మేలిమి వ్యాపారం”గా మారినప్పుడు విలువలెలా ఉంటాయి? వ్యాపారంలో “లాభ నష్టాలే” కానీ బాధ్యతలు ఎక్కడ ఉంటాయి? వ్యాపారంలో రాజకీయం జోడించినప్పుడు ఇక విశ్వసనీయత ఎలా ఉంటుంది? అన్నవి ప్రశ్నలే.

“రాజధాని గుండె పగిలింది” అంటేఎన్ని పేజీలు రాసినా, ఎన్ని రోజులు రాసినా అవి “రాజధాని” సమస్యలే కానీ ప్రజల సమస్యలుగా మారతాయా? “రైతుల గుండె పగిలింది”, “దిక్కుతోచని కౌలు రైతులు”, “పస్తులుంటున్న, వలసలు వెళుతున్న రైతు కూలీలు” అనే వార్తలు ఈ ప్రాంతంనుండి భూసమీకరణ సమయంలో వినిపించలేదేం? “రాత్రికి రాత్రే దున్నేసిన పొలాలు” అప్పట్లో ఇక్కడ కనిపించలేదేం! పొలంలో కరెంటు మోటార్లు రిపేర్ చేస్తూ బతికే బడుగుజీవి ఏమయ్యాడో అనే కథనాలేవి? ట్రాక్టరు డ్రైవర్ ఏమయ్యాడు? పాలేరు ఏమయ్యాడు? వాళ్ళ కుటుంబాలు ఏమయ్యాయి? వాళ్ళకు గుండెలు ఉండవా? అవి పగలవా? ఈ ప్రశ్నలే కదా విశ్వసనీయత నిలిపేది?

వాస్తవానికి ఈ ప్రాంత “రైతులు” ఇక్కడ భూములు అమ్ముకొని పల్నాడు వైపు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, కంభం వైపు భూములు కొని వ్యవసాయం మొదలు పెట్టారు. ఇక్కడ కౌలు రైతులు తెనాలి వైపు తరలి వెళ్ళారు. వారితో పాటు రైతు కూలీలు, ట్రాక్టరు డ్రైవర్లు, పాలేర్లు తెనాలి, దుగ్గిరాల వైపు వెళ్ళారు.

ఆ గుండెలు ఆగవు. ఆ చేతులు ఆగవు. మట్టికి ఆ మనుషులకు విడదీయరాని బంధం ఉంటుంది. అందుకే ఆ గుండెలు మట్టిని వెతుక్కుంటూ మరో చోటికి వెళ్ళాయి.

Gopi Dara

Snippet from Eenadu
Snippet from Sakshi

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...

రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో...

నీ విరాళం వద్దుపో..!? చిత్తూరు జిల్లాలో రాజకీయాల పర్యవసానం!

ఇప్పుడు జరుగుతోంది ఎన్నికలు కాదు, గెలుపు ఓటముల ఆరాటం కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య సిబ్బంది.. పోలీసులు ఇలా ప్రతి ఒక్కరు చేస్తోన్న పోరాటం. ఈ పోరాటంలో ప్రభుత్వానికి...

పాపం బాబు! విరాళం ఇచ్చినా విలువ లేకుండా పోయే?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా అదో వివాదాస్పదమే అయిపోతోంది. చివరికి కరోనా కట్టడికి ప్రభుత్వానికి తన వంతుగా ఆయన ఇచ్చిన రూ.10లక్షల సాయంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనేమో తెలంగాణలో...

గాయ‌ని స‌్మిత‌ ఆస్ట్రాల‌జీ వివాదం కాదుక‌ద‌!

మంచి చెబితే చెడు జ‌రిగే రోజులివి. జ‌నానికి మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ విష‌యంలో ఆచి తూచి వ్యంహ‌రించాల్సి వుంటుంది. మ‌న‌కు తెలుసుక‌దా అని జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా చెబితే అది మొద‌టికే మోసం...