Home Andhra Pradesh Amaravathi జోకులేస్తున్న చంద్రబాబు

జోకులేస్తున్న చంద్రబాబు

అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదన్నారు. అధికారపార్టీ ఎంఎల్ఏలు అధికారులపై దాడులు చేసినపుడు దగ్గరుండి తానే పంచాయితీలు చేశారు. చివరకు అధికారులదే తప్పంటూ ప్రజా ప్రతినిధులను వెనకేసుకొచ్చారు. ప్రతిపక్ష నేతల్లో కొందరు  హత్యకు గురైనపుడు ఎంత గోల జరిగినా కనీసం స్పందిచ లేదు. అంతెందుకు సర్వ వ్యవస్ధలను ఏదేళ్ళల్లో  గబ్బు పట్టించేశారు.

చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినపుడు కూడా అవహేళన చేశారు. అలాంటి చంద్రబాబునాయుడు ఇపుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ఆందోళన పడుతున్నారు. ప్రతిపక్షంపై అధికారపక్షం దాడులు చేస్తున్నా, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నా పట్టించుకోరా ? అంటూ మండిపోతున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు చలో ఆత్మకూరు అంటూ నినాదం ఇచ్చారు. చలో ఆత్మకూరు అంటే వైసిపి బాధితులను అందరినీ ఒకచోట చేరుస్తారట.  ఆత్మకూరు గ్రామాన్ని వదిలేసిన టిడిపి కార్యకర్తలను తిరిగా గ్రామంలోకి తీసుకెళతారట. నిజంగా చంద్రబాబు పిలుపు పెద్ద జోక్ లాగ తయారైంది. తాను అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష వైసిపిని గుర్తించటానికి కూడా ఇష్టపడలేదు. జగన్ ను అసలు ప్రతిపక్ష నేతగానే తాము గుర్తించమన్నట్లుగా వ్యవహరించారు.

అలాంటి చంద్రబాబు ఇపుడు కథలు మాట్లాడుతున్నారు. నిజానికి చంద్రబాబు ఆరోపిస్తున్నంతగా రాష్ట్రంలో  టిడిపి నేతలపై దాడులు జరగలేదు. ఎక్కడైనా జరిగినా అవి వ్యక్తిగత కక్షలతో జరిగినవే.  జగన్ నూరు రోజుల పాలన ఓవరాలుగా తీసుకుంటే బాగానే ఉందనే చెప్పాలి. దాన్నే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. నేతలు టిడిపిని వదిలేయకుండా కాపాడుకునేందుకే చంద్రబాబు నానా గోల చేస్తున్నారు.

 

Recent Posts

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

బిగ్ న్యూస్‌: ప్ర‌భాస్ 21వ సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది!

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం 20 సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్నియువీ క్రియేష‌న్స్‌తో క‌లిసి గోపీకృష్ణ మూవీస్ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తోంది. `సాహో` ఆశించిన...

నాగ‌శౌర్య సినిమాపై అది పుకారేన‌ట‌!

నాగ‌శౌర్య హీరోగా శ్రీ‌నివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఇటీవ‌ల ఓ చిత్రాన్ని ప్రారంభించారు. కొంత భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే తాజాగా నాగ‌శౌర్య న‌టించిన...

వీడియోటాక్‌: విశ్వ‌క్‌సేన్ హిట్టుకొట్టేలా వున్నాడే!

`ఫ‌ల‌క్‌నుమా దాస్‌` చిత్రంతో హంగామా చేసిన విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం `హిట్‌`. కొత్త త‌ర‌హా పోలీస్ క‌థ‌తో ఈ చిత్రం రూపొందిన‌ట్టు తెలుస్తోంది. శైలేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. రుహానీశ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది....

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...