Home News Andhra Pradesh వైసీపీ సలహాదారులకి ముందు చూపు కొరవడిందా?

వైసీపీ సలహాదారులకి ముందు చూపు కొరవడిందా?

అత్యుత్సాహమో లేక అనుభవ రాహిత్యమో ఏమో గాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఏడెనిమిది నెలల పరిపాలన రహదారిలో పయనంలా కాకుండా కీకారణ్యంలో ముళ్ల పొదలల్లో పయనించినట్లుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల ప్రతిపాదన కూడా ప్రస్తుతం త్రిశంకుస్వర్గం చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొమ్ములు తిరిగిన పలువురు సలహా దారులున్నారు. అయినా ఈ పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేక పోయారంటే నమ్మ శక్యం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అతి సామాన్యులు కూడా శాసన మండలిలో చర్చ జరిగిన రోజు టిడిపికి మెజారిటీ వుందని ఫలితాలను ముందుగానే ఊహించారు.

ఇప్పుడే కాదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ మద్దెల దరువు కొన సాగుతోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి వెల్లువెత్తిందని ప్రత్యేక కమిటీ వేసి నిగ్గుతేల్చారు. తీరా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకారమే చెల్లింపులు జరిగాయని చట్ట సభలో ప్రకటించి ప్రభుత్వ పరువు తీసింది. అదే విధంగా విద్యుత్ కొను గోళ్లలో అవినీతి అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. తీరా కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని ఒప్పందాలు రద్దు చేసితే మున్ముందు పెట్టుబడులు రావని అడ్డం తిరిగింది. టిడిపి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు చేయ లేక పోయింది. ఎవరో ఏదో మాట్లాడారని నినాదాలు చేశారని మాత్రం పలు కేసులు నమోదు చేశారు. ఇది టిడిపి నేతలకు మరింత ఊపు లభించి తప్పులు జరిగి వుంటే కేసులు పెట్టండని సవాల్ చేస్తున్నారు.

తుదకు హైకోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి నిలిపి వేసిన పాత బకాయిలు విద్యుత్ సంస్థలకు వెంటనే చెల్లించాలని ఆదేశించింది.పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టే అంశంలో శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం చవి చూచిన అనుభవం ఏమైందో తెలియదు. హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడెనిమిది నెలల కాలంలో హైకోర్టులో పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడ వలసి వచ్చింది.

ఏ పార్టీ అయినా కొత్తగా అధికారంలోనికి వచ్చినపుడు దాని ప్రాధాన్యతలు విధిగా వుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. తప్పు కాదు కూడా. అయితే అవి అమలు జరిపే సందర్భంలో న్యాయ పరమైన అంశాలతో పాటు భౌతిక పరిస్థితులు విధిగా పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రధానంగా ప్రజాభిప్రాయం పరిగణన అవసరం. కాని ఎందుకో గాని వైసిపి ప్రభుత్వంలో అది కొర వడింది. ఉదాహరణకు అన్న క్యాంటీన్లు. టిడిపి హయాంలో లక్షలాది మంది ప్రధానంగా అసంఘటిత భవన రిక్షా కార్మికులను ఈ పథకం ఎంతో ఆదుకొన్నది. ప్రభుత్వం మార్పు చెందగానే ఈ పథకానికి ఫుల్ స్తాప్ పెట్టారు. వాస్తవంలో అన్న క్యాంటీన్లు ద్వారా లబ్ధి పొందిన వారంతా చంద్రబాబు నాయుడుకు ఓటు వేసి వుంటే వైసిపికి శాసన సభలో 151 స్తానాలు లభించేవి కావు. కాకుంటే వైయస్సార్ క్యాంటీన్లు అని నిర్వహించి వుంటే మైలేజి వచ్చేది. అదే విధంగా రైతు రుణ మాఫీ. ఈ లబ్ది పొందిన వారంతా టిడిపికి ఓటు వేశారని భావించ లేము. రైతు బరోసా ద్వారా ఎంత మంది రైతుల మనసు గెలుచు కున్నారో రైతు రుణ మాఫీ రైతుల నుండి ఇంచుమించు వ్యతిరేకత తెచ్చుకున్నారు.

అదే విధంగా అమరావతి రాజధాని రైతులందరూ తెలుగు దేశం కు ఓటు వేసి వుంటే మంగళ గిరి తాడి కొండ నియోజకవర్గాల్లోనే కాకుండా కృష్ణ గుంటూరు జిల్లాలో వైసిపి అభ్యర్థులు గెలు పొందే వారు కారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తున్నదేమేనని పిస్తోంది.అంతెందుకు? శాసన మండలిలో టిడిపికి అత్యధిక స్థాయిలో మెజారిటీ వుందని అందరికి తెలుసు. అయినా అంత మూర్ఖంగా వ్యవహరించారంటే రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వారు ఆశ్చర్య పోతున్నారు. ముందుగా పథకం ప్రకారం తెలుగు దేశం పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు మనోధైర్యం దెబ్బ తీసి రాజధాని మార్పుకు ఉపక్రమించి వుంటే వైసిపి ప్రభుత్వానికి ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు.అమరావతి లాంటి భారీ పథకం అమలు జరిగిందంటే ఎక్కడా తప్పులు సంభవించవని చెప్ప లేము. తొలి నుండి కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసిపి ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంలో ఏం జరిగిందో పక్కన బెడితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ప్రచార అస్త్రంగా మిగుల్చుకొంది. తప్ప భూకుంభ కోణానికి పాల్పడిన వారిని కోర్టు మెట్లెక్కించ లేక పోయింది. చట్టాల చట్రంలో బంధించ లేక పోయింది. దీనితో టిడిపి నేతలు మరింత ఆత్మ విశ్వాసంతో చెలరేగి పోయి శాసన మండలిలో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఇందులో మరో కోణం వుంది. రాష్ట్రంలో వున్న అన్ని ప్రతి పక్షాలను ఈ అంశంపై ఏకం చేసింది. కనీసం కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిని కూడా దూరం చేసుకోవడం కొస మెరుపు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. వెనక్కి రాలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన త్రిశంకుస్వర్గంలో వుంది.దీని పరిణామమేమంటే మండలిని రద్దు చేయడం. రాజధానిని మార్పుచేసే సర్వాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వున్నట్లే మండలిని రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో ఆమోదించితే దానికి నూకలు చెల్లినట్లే. కాని ఇదంతా వెనువెంటనే జరగడం కుదరక పోవచ్చు. మూడు రాజధానుల ఏర్పాటు మరి కొంత సమయం పడుతుంది.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013

Recent Posts

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...