Home News Andhra Pradesh వైసీపీ అంతర్మథనం! దొరకని పరిష్కారాలు?

వైసీపీ అంతర్మథనం! దొరకని పరిష్కారాలు?

గురువారమే శాసన మండలికి మంగళం పాడుతూ శాసన సభ తీర్మానం చేస్తుందని భావింప బడినా వైసిపి అధిష్టాన వర్గం ఎంత అంతర్మథనం సాగించినా పరిష్కారాలు కానరానందున సోమవారానికి నిర్ణయం వాయిదా పడింది. శాసన సభ సోమవారానికి వాయిదా పడటంతో శాసన మండలి భవిష్యత్తు కూడా సస్పెన్స్ లో వుంది. శాసన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ఇలాంటి సభ మనకు అవసరమా?” అని చేసిన ప్రకటన పర్యవసానం ఏలా వుంటుందో ఆయన తత్వం ఎరిగిన వారు సులభంగా అర్థం చేసుకోగలరు. వైసిపి ప్రభుత్వానికి చెంది శాసన మండలి కథ కంచికి పోయినట్లే.

అయితే ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలపై భిన్న మైన వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి వర్గాల నుండి ఎట్టి సంకేతాలు వెలువడ లేదు. కాని శాసన సభ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినా కేంద్రం పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు శాసన మండలి ఉనికిలో వుంటుందని టిడిపి నేత ఎనమల రామ కృష్ణుడు చెబుతున్నారు. ఇతర న్యాయ నిపుణులు కూడా అదే అభిప్రాయం చెబుతున్నారు. అంటే ఈ కర్మకాండ అంతా ముగియడానికి సంవత్సరం లోపు పట్ట వచ్చు.అటు ఇటుగా అంతకు లోపు జరగ వచ్చు.

గతంలో ఎన్టీఆర్ 1983 లో శాసన మండలిని రద్దు చేసి కేంద్రానికి పంపితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పక్కన బెట్టారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో రెండవ మారు శాసన సభ తీర్మానం చేసి పంపితే కేంద్రం అంగీకరించిందని చెబుతున్నారు.ఇప్పుడు కేంద్రలోని బిజెపి ప్రభుత్వం సాచివేత వైఖరి అవలంభించితే అంత వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలిని భరించాలసినదే. లేదా తాను గిరి గీసుకున్న పార్టీ ఫిరాయింపులకు చెల్లు చీటి ఇచ్చి మండలిలోని టిడిపి సభ్యులను కొనుగోలు చేయవలసి వుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.ఇందులో ఎంత వరకు విజయం సాధిస్తారో పక్కన బెడితే అదే సమయంలో అప్రతిష్ట మూట గట్టుకోవలసి వుంటుంది. ఇంతకు మించి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరో మార్గం లేదు. అదైనా మున్ముందు మండలికి వెళ్లే బిల్లులకు ఉపకరించుతుంది. గాని సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లుల కోసం ఎంత లేదన్నా మూడు మాసాలు ఆగవలసిదే. ఒక వేళ చట్ట సభలను ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకు వచ్చి ముందుకు వెళ్లాలన్నా సెలక్ట్ కమిటీ పరిశీలనలో వున్న బిల్లులను రద్దు చేసుకొని ఆర్డినెన్స్ తీసుకు రావడం ఎంత వరకు కుదురు తుందో. ఆలా వీలు కాదని కొందరు చెబుతున్నారు.

Current strength in the AP Council

ఇదిలా వుండగా మండలిలో ఏది ఏమైనా 2021 కల్లా 27 స్థానాలు ఖాళీ అవుతాయని అప్పటికి ఇవన్నీ వైసిపి ఖాతాలో పడతాయని చెబుతున్న పూర్వరంగంలో మండలి రద్దయ్యే పక్షంలో పదవులు ఆశించే వైసిపి నేతలు వెంటనే స్పందించక పోవచ్చు. గాని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరంతా బరి తెగించి పోరాడే అవకాశాలు తక్కువగా వుంటాయి. చాప కింద నీరులాగా అసంతృప్తి వ్యాపించే అవకాశమూ లేక పోలేదు. ఇది ఒక రకంగా స్వయం హననం లాంటిదే. ఇవన్నీ అటుంచి ముఖ్యమంత్రి ముందు మరో రెండు సవాళ్లు వున్నాయి. రాష్ట్రంలోని బిజెపి నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనను నిఖచ్చిగా వ్యతిరేకిస్తున్నారు. తుదకు ఉత్తరాంధ్రకు చెందిన బిజెపి నేత అమరావతి రైతుల పక్షాన మాట్లాడారు. పైగా పులి మీద పుట్ర లాగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరూ కలసి రాజధాని తరలింపుపై ఉద్యమం సాగిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రభావం రాష్ట్ర స్థాయి వరకే పరిమితమౌతుందా? లేక కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా పని చేస్తే మండలి రద్దు బిల్లు ఏదో ఒక వంక పెట్టి పెండింగ్ పెడితే ముఖ్యమంత్రికి మండలి నిద్ర లేని రాత్రులను మిగల్చక తప్పదు. ఇక మిగిలిందల్లా పార్టీ ఫిరాయింపులే.

రాజకీయంగా ఎదురయ్యే అవరోధాలు అటుంచి న్యాయ పరమైన చిక్కులూ తప్పేట్టు లేదు. శాసన సభలో గురువారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజ్యాంగంలో రాజధాని అనే మాట లేదని ముఖ్యమంత్రి ఎచ్చట కూర్చొని పని చేస్తే అదే రాజధాని అని చెప్పారు. ఈ మాటల వెనుక ఎంతో గూఢార్థముంది. మూడు రాజధానుల చట్టాలు పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ పట్నం తరలించి తను విశాఖ మకాం మార్చి పరిపాలన సాగించ వచ్చనే ధ్వని ఇందులో వుంది. అయితే ఈ విధానానికి గురువారం రోజునే హైకోర్టు గండి కొట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదన చట్టం కాలేదు కాబట్టి రాజధాని రైతులు ఇతరులు వేసిన కేసులను ఫిబ్రవరి 26 తేదీకి వాయిదా వేస్తూ ఈ లోపు అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను తరలించితే తిరిగి తీసుకు వచ్చే అధికారం తమకుందని అందుకు వ్యయమయ్యే నిధులు అధికారుల నుండి వసూలు చేస్తామని గట్టి హెచ్చరికలు చేసింది. ఇది కూడా మండలి పరిణామాలు లాగా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ గా భావించ వచ్చు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ సుమూహూర్తాన ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చారో ఏమో గాని మూడు రాజధానుల అమలుకు గల అన్ని దారులు మూసుకు పోతున్నాయి.

కొసమెరుపుగా ఒక అంశమేమంటే శాసన మండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి చేరలేదని ఈ అంశంలో టిడిపి చేస్తున్న ప్రచారం అంతా వట్టిదేననే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరో విశేషమేమంటే కొందరు ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇవ్వలేదని ఏకంగా గవర్నర్ చేత ఆర్డినెన్స్ ఇప్పించి వుంటే ఈ రాద్ధాంతమంతా వుండేది కాదని వాదిస్తున్నారట. ఇందుకు ప్రత్యర్థులు కొందరు ఒక వేళ గవర్నర్ ఆర్డినెన్స్ ను కేంద్రానికి పంపితే చిక్కువచ్చేదని గుర్తు చేస్తున్నారట. మరి సోమవారానికి ఎన్ని మలుపులు తిరుగుతుందో.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013

Previous articleDisco Raja Movie Success Meet
Next articleNabha Natesh

Recent Posts

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...