Home News Andhra Pradesh లోకేష్ వ్యూహకర్తలు ఏమి ఆలోచిస్తున్నారు?

లోకేష్ వ్యూహకర్తలు ఏమి ఆలోచిస్తున్నారు?

గత పది సంవత్సరాలుగా చంద్రబాబు లేకుంటే లోకేష్ మీడియా ముందుకొచ్చి తమ కుటుంబానికి చెందిన ఆస్తులు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ ఆస్తుల ప్రకటన మీద సోషల్ మీడియాలో కానీ బయట జనాల్లో కానీ సెటైర్లు పడుతున్నాయి. ఆస్తులు ప్రకటించడం, పారదర్శకంగా ఉండటం రాజకీయాల్లో  మేలు చేయాలి కానీ ఇలా నవ్వులపాలు కాకూడదు.

1999వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎన్నికలను ఎదుర్కొంటున్న సమయం. మధ్యతరగతిలో చదువుకున్న వారిలో చంద్రబాబు అంటే ఒక క్రేజ్. ఎందుకంటే ఒక యువ ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన, పనికి ఆహార పథకం, జన్మ భూమి లాంటి కొన్ని వినూత్న కార్యక్రమాలతో అప్పటి వరకు రాజకీయ నాయకులు అంటే ఉన్న ఇమేజ్కి భిన్నంగా తనని తను ప్రాజెక్ట్ చేసుకోగలిగారు. చంద్రబాబు అప్పట్లో తటస్థులు అని అనేక మంది విద్యావంతులను,రిటైర్డ్ అధికారులను, పారిశ్రామికవేత్తలను తెలుగుదేశం తరుపున రాజకీయ రంగప్రవేశం చేయించి గెలిపించడమే కాకుండా తనను తాను ఒక నవతరం నాయకుడిగా ఆవిష్కరించుకున్న ఎన్నికలివి.

ఇవన్నీ ఒకప్పటి కబుర్లు. కాలం మారింది, జనాలు రాజకీయ నాయకులు చేసే పనుల మీద వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం అర్థం చేసుకునే స్థాయికి వచ్చేశారు. అది సోషల్ మీడియా వల్ల కావచ్చు 24 గంటలు ప్రసారమయ్యే న్యూస్ చానెల్స్ వల్ల కావచ్చు మొత్తానికి జనాలకి రాజకీయాల మీద ఒక అవగాహన రాజకీయ నాయకుల మీద ఒక అభిప్రాయం కలగడం మొదలైంది.

అయినప్పటికీ లోకేష్ ఇంకా పాతకాలంలో పనిచేసిన పద్ధతులనే ఇప్పటికీ అనుసరించడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆస్తుల ప్రకటన వల్ల జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు నా కుటుంబానికి అన్నీ అప్పులే అని ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు సానుభూతితో ఓట్లు వేస్తారా లేదా ఓ వెయ్యి కోట్లని  ప్రకటిస్తే లోకేష్ చంద్రబాబు అవినీతి చేశారని ఓట్లు వేయడం మానేస్తారా? 

చంద్రబాబు లోకేష్ ఇద్దరూ రాజకీయాల్లో ఉండి శాసనసభకు శాసనమండలికి పోటీ చేసేటప్పుడు వారి ఆస్తులు ఎప్పుడో ప్రకటించారు. మరి ఇప్పుడు ప్రకటించే ఆస్తులు వాటికంటే భిన్నంగా ఏముంటాయి?? ఒకవేళ ఎవరైనా వీరి ఆస్తులు గురుంచి తెలుసుకోవాలంటే ఎన్నికల అఫిడవిట్ చూస్తే సరిపోతుంది. అఫిడవిట్లో పోటీ చేసే అభ్యర్థి కాకుండా తన కుటుంబం ఆస్తులను ప్రకటించాలి. అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు ఇంట్లో ఉన్న ఐదు మంది కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు లోకేష్, చంద్రబాబు అఫిడవిట్లో కచ్చితంగా ఉంటాయి, అవి  పబ్లిక్ డొమైన్లో దొరుకుతాయి. మరి ఈ ప్రకటన కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో తెలుగుదేశం వ్యూహకర్త లు కొంచెం ఆలోచించాల్సిన అవసరం వుంది. లోకేష్ ఏదో కొన్ని ఆస్తులు చదవడం మర్నాడు టీవీలో వీటి మీద చర్చలు పెట్టి రంధ్రాన్వేషణ చేయడం అవసరమా? 

90వ దశకంలో చంద్రబాబు ఆ కాలానికి తగినట్టు కొన్ని వినూత్నమైన ఆలోచన చేసి ప్రజలకు దగ్గరయినట్టు లోకేష్ సలహాదారులు కూడా  వినూత్నమైన ఆలోచనలు చేసి లోకేష్ ని ఈ కాలానికి సూట్ అయ్యే ఒక నాయకుడిగా ఆవిష్కరించాలి తప్ప ఇలాంటి పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలతో  నవ్వులపాలయ్యేటట్టు చేయకూడదు. రాజకీయాల్లో ప్రతి దానికి ఒక టైమింగ్ అంటూ ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు వేలానికి వస్తున్నా టిడిపి నాయకుల ఆస్తుల మధ్య లోకేష్ చేత తన ఆస్తుల ప్రకటన చేయించిన వ్యూహకర్తల టైమింగ్ గురించి ఏం చెప్పాలి?  ఈ ఐటీ దాడులు కాకుండా రాష్ట్రంలో టిడిపి అనేక అంశాల మీద పోరాటం చేస్తోంది. ఆ పోరాటాల మీద లోకేష్ చేత ట్విట్టర్ లో స్పందింప చేసి ఆస్తుల ప్రకటన అనే ఒక ప్రజా శ్రేయస్సు లేని అంశాన్ని నేరుగా లోకేష్ చేత చెప్పించడం ఏమి వ్యూహం అనుకోవాలి. ఈ ఆస్తులేదో ట్విట్టర్లో ప్రకటించి జరుగుతున్న పోరాటాల్లో  ప్రత్యక్షంగా పాల్గొనాలని సలహా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...