Home News Andhra Pradesh మూడు రాజధానుల ఆంధ్ర ప్రదేశ్ పయనమెటు?

మూడు రాజధానుల ఆంధ్ర ప్రదేశ్ పయనమెటు?

దురదృష్టం కొద్దీ చారిత్రకంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏకత్వంలో భిన్నత్వంగా మూడు ప్రాంతాలుగా విభజింప బడ్డారు. చిర కాలంగా పాలకులు చేసిన తప్పిదంతో ప్రాంతీయ అసమానతలకు కొదవ లేదు. రాయలసీమ ఎడారిని తలపిస్తుంది. వర్షపాతం తక్కువ. ఉత్తరాంధ్ర తుఫానులకు నిలయం. వరదలు వచ్చినా సముద్రం పాలౌతోంది. కాని సాగుకు నీటి లభ్యత లేదు. ఇతర రాష్ట్రాల్లో నిర్మాణంలో వున్న భవంతులు కూలి పోతే మృతి చెందే వారు సీమ ఉత్తరాంధ్ర వలస కూలీలుగా వుంటారు. రాజకీయ పక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవడానికి అవసరమైనంత ఇంధనం పుష్కలంగా వుంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ అంశంలో అధికార పక్షానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలకు తీవ్రమైన వైరుధ్యముంది. పరిపాలన వికేంద్రీకృత చేస్తే అభివృద్ధి కూడా వికేంద్రీకృతమౌతుందని అధికార పక్షం వాదిస్తోంది. పరిపాలన వికేంద్రీకృతం చేయకుండానే అభివృద్ధి వికేంద్రీకృతం చేయ వచ్చని మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాభి వృద్ధి దెబ్బ తింటుందని అన్ని ప్రతి పక్షాలు వాదిస్తున్నాయి.

అయితే ఇంతవరకు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోనే రాజధానుల అంశం నలుగుతుండగా తాజాగా అయాచితంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ముగ్గులోనికి తీసుకు రాబడ్ఢారు.మూడు రాజధానుల ప్రతిపాదనతో ఆంధ్ర ప్రదేశ్ లోని మూడు ప్రాంతాల ప్రజలు ఎంత వరకు అభివృద్ధి చెందుతారో పక్కన పెడితే ఇంతకు ముందే వున్న ప్రాంతీయ ద్వేషాలు మరింత కార్చిచ్చులాగా తయారైనవి. తుదకు రాయలసీమలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ క్రమేణా బల పడుతోంది. కోస్తా వారి వలన మోసపోయామని ఇంత వరకు భావిస్తుండిన సీమలో ఈ వివాదం మరింత అగ్గి రగలేసింది.

2014 లో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో నెలకొని వుండిన చారిత్రక నేపథ్యం గల శ్రీ బాగ్ ఒడంబడిక సెంట్ మెంట్ ను చంద్రబాబు నాయుడు పరిగణన లోనికి తీసుకొని హైకోర్టు సీమ ప్రాంతంలో నెలకొల్పి తను ఊహించి నట్లు ఎంతటి అద్భుత మైన అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి వున్నా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మూడు రాజధానుల ప్రతి పాదన తెర మీదకు తెచ్చి వుండే వారు కాదేమో. ఆలాంటి అవకాశం లభించి వుండేది కాదు. అంతేకాదు 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తమ పార్టీ ఎన్నికల ప్రణాళికగా బహిర్గతం చేసి వున్నా రాష్ట్రంలో ఈ అనిశ్చిత పరిస్థితి ఏర్పడేది కాదు.

ఏది ఏమైతేనేం మహిళల రోదనలు పోలీసు లాఠీ ఛార్జీ రక్త సిక్త గాయాలతో రాజధాని ప్రాంత ప్రజల పరుగులు ఉరుకులు మధ్య శాసన సభ మూడు రాజధానుల ప్రతిపాదనకు చెందిన బిల్లులను ఆమోదించింది. మంగళవారం సాయంత్రానికి హైడ్రామా మధ్య శాసన మండలి శాసన సభ ఆమోదించిన బిల్లులను పరిగణనలోకి తీసుకొంది. ఎందుకంటే శాసన మండలిలో తెలుగు దేశం పార్టీకి మెజారిటీ వున్నందున రూలు 71 కింద టిడిపి నోటీసు ఇచ్చి తొలి దశలోనే సభలో బిల్లులను అడ్డుకోవాలని చూచినా తుదకు ఛైర్మన్ అనుమతించడంతో సభలో బిల్లులు ప్రవేశ పెట్టబడ్డాయి. మున్ముందు టిడిపి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని గాని లేక తిరస్కరించే విధానం ఏదైనా చేపట్ట వచ్చు. ఏది ఏమైనా ఈ దశలో మూడు రాజధానుల ప్రతిపాదన అమలుకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే దీని పరిణామాలు మాత్రం తీవ్రంగా వుంటాయి.

మూడు రాజధానుల ప్రతిపాదనలో రాయలసీమ కు హైకోర్టు ఇవ్వ బడింది. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానులు తప్ప ఇప్పటి వరకు శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలని ఉద్యమాలు చేసిన వారిలో ఎక్కువ మంది హైకోర్టుతో తృప్తి పడేట్టులేదు. పరిపాలనలో కూడా సమాన భాగస్వామ్యం కావాలనే డిమాండ్ విన్పిస్తున్నారు. మరి కొన్ని వర్గాలు రాజధాని ఇస్తారా? లేక ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా? అనే వాదనలు విన్పించు తున్నాయి.

ఇక కోస్తా ప్రాంతంలో కృష్ణ గుంటూరు జిల్లాలోని వైసిపి నాయకులు ఎంత గుంభనంగా వున్నా లోలోన ఎదురీద వలసి వుంటుందని మథన పడుతున్నారు. ఇందుకు మంగళ గిరి ఎమ్మెల్యే శాసన సభలో చేసిన ప్రసంగం ఈ ప్రాంత వైసిపి నాయకుల మనో భావాలను దర్పణం పడుతోంది. ఈ ప్రభావం ఈ రెండు జిల్లాల్లోనే కాకుండా చుట్టువున్న మరికొన్ని జిల్లాల్లో తీవ్రంగా వుంటుంది. విశాఖ రాజధాని దూరం అనే అంశంపై మంత్రులు ఇస్తున్న వివరణ ఆచరణలో ఏ మాత్రం ఉపయోగ పడదు. ప్రస్తుతం కేవలం ప్రత్యర్థుల నోళ్లు మూయించడానికి పనికి వస్తుంది. తమ ప్రాంతం నుండి రాజధాని తరలింప బడిందనే భావన సగటు మనిషిలో వుండి తీరు తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికలు ముంగిట పెట్టుకొని ఇంత సాహసానికి ఏలా ఎందుకు తలపడ్డారో భవిష్యత్తు తేల్చవలసినదే.

అయితే మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో తీసుకు వచ్చే మార్పులు బట్టి ప్రజల అసంతృప్తిని నివారించ గలదు.ఇదిలా వుండగా రాయలసీమకు హైకోర్టు తరలింపుకు న్యాయపరమైన చిక్కులు వున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అయితే ఈ పాటికే రాష్ట్ర బిజెపి రాయలసీమకు హైకోర్టు నినాదం ఇచ్చివున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ గండం గడచి గట్టెక్క గలదు.ఇందులో మరో ట్విస్ట్ వుంది. పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తువలన రాజధాని మార్పు అంశంలో కేంద్రం నుండి కొంత ఇబ్బంది వుంటుందేమో. బిజెపి నేత నరసింహారావు రాజధాని అంశంలో కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేదని చెబుతుండగా ఢిల్లీ వెళుతున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో వుంచేందుకు బిజెపి మద్దతు ఇచ్చే ప్రాతిపదికననే తమ పొత్తు వుంటుందని ప్రకటించారు. ఈ సమయంలో ఈ పరిణామం కీలక మైనదిగా వుంది. మూడు రాజధానుల అంశంలో తెలుగు దేశం వ్యతిరేకత కన్నా మున్ముందు బిజెపి పవన్ కళ్యాణ్ నుండి ఎక్కువ వుంటుందేమో.

ఇవన్నీ రాజకీయ పార్టీలు మూడు రాజధానుల ప్రతిపాదనకు చెందిన అంశాలైతే చంద్రబాబు నాయుడు హయాంలో పడిన ప్రాంతీయ ద్వేషాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై వెల్లు వెత్తన పరస్పర ఆరోపణలు తుదకు దూషణల దశకు చేరింది. ఏకత్వంలో భిన్నత్వం కలిగిన తెలుగు ప్రజలకు ఈ పరిణామం ఏమాత్రం మంచిది కాదు. ఇంతకు మునుపు ఒక దఫా రాష్ట్రం రెండు ముక్కలైంది. భవిష్యత్తులో ఆలాంటి ప్రమాదానికి బీజాలు పడటమే ఆందోళన కరమైన అంశం

వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

దిల్ రాజు భారీ న‌ష్టాల్ని చ‌విచూస్తున్నారా?

సినీ ఇండ‌స్ట్రీని క‌రోనా వైర‌స్ చావు దెబ్బ‌తీసింది. దీని కార‌ణంగా మార్చి 25న రిలీజ్‌కావాల్సిన చిత్రాల‌న్నీ వాయిదా ప‌డిన విష‌యం తెలిసందే. అందులో దిల్ రాజు నిర్మించిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `వి` కూడా...

మియా ఖ‌లీఫా అంటూ ఆట‌ప‌ట్టిస్తున్ననెటిజ‌న్స్‌!

సోష‌ల్‌మీడియా ప్ర‌భావం పెరిగిపోయిన ద‌గ్గ‌రి నుంచి హీరోల కంటే హీరోయిన్‌లే అత్య‌ధికంగా నెటిజ‌న్స్‌ని ఆక‌ర్షించ‌డం కోసం నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటున్నారు. త‌మ క్రేజ్‌ని పెంచుకోవ‌డానికి హాట్ హాట్ హాట్...

మ‌ణిర‌త్నంకే ప్ర‌పోజ్ చేసింది!

ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంకే ఓ హీరోయిన్ ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. భార‌తీయ సినీ తెర‌పై మ‌ణిర‌త్నంది చెర‌గ‌ని సంత‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చిన చిత్రాల్నీ ఆణిముత్యాలే. జాతీయ స‌మ‌గ్ర‌త‌రి చాటిచెప్పిన ఆయ‌న...

ఎవ‌రీ మాస్కు వీరుడు!

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండం చేస్తున్న వేళ ఇది. దీని కార‌ణంగా దేశాన్ని కాపాడ‌టం కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ మ‌హ‌మ్మ‌రిని త‌రిమేయాలంటే లాక్ డౌన్ ఒక్క‌టే మార్గం అని న‌మ్మి 21...

యువీని బ్యాన్ చేయ‌మంటున్నారా?

ప్ర‌భాస్ ఫ్యాన్స్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు హీరోలాగే కూల్ అనుకున్నారంతా, కానీ తాజాగా వారిలోనూ అస‌హ‌నం మొద‌లైంది. దానికి కార‌ణం యువీ క్రియేష‌న్స్ నిర్మాత‌లే అని తెలిసింది. యువీలో ప్ర‌భాస్ `మిర్చి`. సాహో...

CCC నిధిపై తెరాస స‌ర్కార్ క‌ర్చీఫ్‌!

క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌ద‌రు చారిటీ సంస్థ‌ను రిజిస్ట‌ర్ చేయ‌క‌పోయినా మెగాస్టార్ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్...

బ‌న్నీ- సుకుమార్ మూవీ టైటిల్ ఇదేనా?

అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌లో వున్న బ‌న్నీ త‌న నెక్ట్స్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో...

లాక్‌డౌన్‌కి తూట్లు పొడిచిన యూవీ క్రియేష‌న్స్

లాక్ డౌన్ తో జ‌నజీవ‌నం స్థంబించిపోయింది. ఎక్క‌డి వాళ్లు అక్క‌డే గ‌ప్ చుప్. డాక్ట‌ర్లు..ఆరోగ్య శాఖ సూచ‌న‌లు పాటిస్తూ అంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. దాదాపు సెల‌బ్రిటీలంతా అవేర్ నెస్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నంచేస్తున్నారు. సినీ...

కొడుకు క్వారంటైన్‌లో ఉంటే వెట‌ర‌న్‌ న‌టి వేషాలేమిటి?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని చుట్ట‌బెట్టేస్తోంది. భార‌త్ ప‌రిస్థితి కొంత ఓకే కానీ పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య‌..మృతుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. ప్ర‌భుత్వం ఎంత ప‌టిష్టంగా...

లాక్ డౌన్ పొడిగిస్తే RRR లాకైన‌ట్టేనా?

ప్ర‌స్తుత లాక్ డౌన్ తో మాకు ప‌నిలేద‌న్న‌ట్లుగానే మాట్లాడారు అగ్ర నిర్మాత‌...ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దాన‌య్య. ఎట్టి ప‌రిస్థితిల్లో 2021 జ‌న‌వ‌రి 8న పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం...