Home News Andhra Pradesh బాధాకృష్ణ రోదన అంతా ఇంతా కాదయా!

బాధాకృష్ణ రోదన అంతా ఇంతా కాదయా!

 
సర్పాలు నెలకోసారి కుబుసం విడిచి మత్తు వదుల్చుకుంటాయట!  అలాగే ఆంధ్రజ్యోతి సంపాదకుడు వేమూరి రాధాకృష్ణ కూడా వారానికోసారి “కొత్త పలుకు” పేరుతో వారం రోజులపాటు కడుపులో దాచుకున్న కాలకూటవిషాన్ని కక్కేసి ఫ్రెష్ అప్ అవుతుంటాడు.  తాను కక్కిన గరళాన్ని తన పాఠకులు సరళంగా తీసుకుని మెదడులో భద్రపరచుకుంటారని  దురాశకు లోనవుతుంటారు.    ఆ క్రమంలోనే ఈరోజు కూడా తన చెత్తను పాఠకులమీద కుమ్మరించాడు.  
 
యధావిధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన తనయుడు జగన్ కు పోలికలు తెచ్చాడు.  పనిలోపనిగా తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ శైలికి కూడా ముడిపెట్టాడు.    వైఎస్ ప్రతిరోజూ స్వయంగా ప్రజల విజ్ఞప్తులను స్వీకరించేవారట.  ఆ రకంగా జగన్, కేసీఆర్ చేయకపోగా అసలు ప్రజలతో మాట్లాడరట….
 
ఒకప్పుడు మనం దూరప్రాంతంలో ఉన్న మనవాళ్లతో మాట్లాడాలంటే ఎక్కడో ఉన్న టెలిఫోన్ బూత్ కు వెళ్లి క్యూలో నిలబడి మనవంతు వచ్చేవరకు ఎదురుచూస్తూ కూర్చునేవాళ్ళం.  మరి నేటి పరిస్థితి ఎలా ఉన్నది?  బాత్ రూమ్ లో కూర్చుని ప్రపంచంలో ఉన్న మనవాళ్లందరితోనూ క్షణాల్లో మాట్లాడుతున్నాము.  పెరుగుతున్న సాంకేతికత మనిషి శ్రమను తగ్గిస్తున్నది.  సామాన్య ప్రజలు ఎవరైనా తమకు పౌరసేవలు, సంక్షేమ పధకాలు క్రమం తప్పకుండా అందుతున్నాయా లేదా అని చూస్తారు తప్ప ప్రతిరోజూ మంత్రులను, ముఖ్యమంత్రులను కలవాలని కోరుకోరు.   కేసీఆర్ ప్రజలు ఎవ్వరితో మాట్లాడకపోయినా, రెండోసారి ఆయన మొదటిసారి కన్నా అఖండమైన మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.  జగన్ ఎలాంటి సంక్షేమ పధకాన్ని ప్రకటించినా, ఇరవైనాలుగు గంటలు గడవకముందే సదరు పధకం లబ్ధిదారులకు చేరుతున్నది.  రాధాకృష్ణ యజమాని చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినపుడు ప్రతిరోజూ ప్రజలను కలిసారా?  పైగా ఎవరైనా సమస్యలతో తనవద్దకు వచ్చినపుడు “తోకలు కోస్తా…కత్తిరిస్తా…అసలు మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రానిచ్చారు?”  అని హుంకరించేవారు.  రాధాకృష్ణ మర్చిపోయినా, జనం మర్చిపోరు.
 
ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు ఇతర వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టినా జగన్మోహన్‌ రెడ్డిలో చలనం ఉండదు. రైతులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రావడం లేదు”  అంటూ ఏడుస్తున్నాడు రాధాకృష్ణ.  ఆ ఆందోళన ఎలాంటిదో ఎవరికి తెలియదు?  కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంతమంది తమ స్థలాల ధరలు కుంగిపోవడంతో “పెయిడ్ ఆర్టిస్టులతో” చేస్తున్న కృత్రిమ విన్యాసాలు తప్ప అవి ఆందోళనలా?    ఇరవైతొమ్మిది గ్రామాలలోని అయిదు లక్షల జనాభాలో కేవలం రెండు గ్రామాల్లో గుడారాలు వేసుకుని దానిలో ఓ యాభై మంది కూర్చుంటే అవి ఆందోళనలు అవుతాయా బాధాకృష్ణా? 
 
ఇక ఎప్పటిలాగే రాజధాని మార్పు కేవలం చంద్రబాబు మీద, ఒక సామాజికవర్గం మీద కోపంతోనే అంటూ మరో బుస కొట్టాడు రాధాకృష్ణ.  మరి ఆనాడు చంద్రబాబు చేసింది ఏమిటి?  నూజివీడులో రాజధాని అని ఒకసారి, గుంటూరులో అని ఒకసారి రకరకాలుగా లీకులు ఇచ్చి, తన బినామీలను మాత్రం అమరావతిలో వందలాది ఎకరాలను కొనేట్లు చేసి, వారు కొన్న తరువాత అమరావతిని రాజధాని అని ప్రకటించలేదా?   రాజధాని నిర్మాణానికి దొనకొండ అనువైన ప్రాంతం అని   శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చిన తరువాత కూడా దాన్ని చెత్తబుట్టలో పడేసి,  తన భృత్యుడు నారాయణతో ఒక కమిటీని వేసి అమరావతిని నిర్ణయించలేదా?  ఇది ముందుగా అనుకున్నది కాదా?  మొత్తానికి రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలకోసం కాకుండా తన కులానికి అన్యాయం జరిగింది అని గుండెలు బాదుకోవడం పాత్రికేయ వృత్తిలో ఉన్నవారికి తగునా?  అది వ్యభిచారం కన్నా హీనం కాదా?  
 

Also Read కాపు కులం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తుందా?

 
ఇక అమరావతి మార్పు  తెలంగాణకు వరప్రసాదంగా మారిందని,  ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తరుగుతుండగా, హైదరాబాలో పెరుగుతున్నదని  మరో బాధ పాపం!  అమరావతి, ఆంధ్రాలతో సంబంధం లేకుండా గత నలభై ఏళ్లుగా హైద్రాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతూనే ఉన్నది.   నోట్లరద్దు నేపథ్యంలో దేశం మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించినా, హైద్రాబాద్ లో బాగానే ఉన్నది.   ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అయినా, అమరావతి ప్రాంతంలో ధరలు తగ్గాయేమో కానీ, కర్నూల్, విశాఖ ప్రాంతాల్లో పెరగలేదా?  అంటే అమరావతిని రాజధాని చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా?  
 
ఇక రాజధాని మార్పు అనేది కేసీఆర్ ఇచ్చిన సలహా అని మరొక చెత్త ఆరోపణ!  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉంటె కేసీయార్ కు నష్టమా?  విశాఖలో పెడితే ఆయనకు లాభమా?  ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఆంధ్రాలోనూ, తెలంగాణలోనూ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కేసీఆర్ కు ఆంధ్రాలో ఏమైనా ఆస్తులు ఉన్నాయా?  ఆంధ్రాలో ఎక్కడైనా కేసీఆర్ ఓ వంద గజాల స్థలం కొన్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?  అమరావతి రాజధాని అనగానే, ఆ కార్యక్రమానికి వెళ్లి కేసీఆర్ ఆశీస్సులు అందించలేదా?   అవసరమైతే  సాయం చేస్తామని ప్రకటించలేదా?  రాధాకృష్ణ ఏడుస్తున్నట్లు అమరావతి మహానగరం కావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుంది?  అది జరిగే పనేనా?  విశాఖపట్నం ఇప్పటికే మహానగరం కాదా?  రాజధాని ఏర్పాటుతో హైద్రాబాద్ ను మించిపోయే మహానగరంగా విశాఖ పరిణమించదా?
 
రోజూ చచ్చేవాడి కోసం ఏడుపు ఎందుకు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే జీవచ్ఛవం అయ్యింది. ఘనత వహించిన జగన్మోహన్‌ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రానికి పెట్టుబడులు రావుగాక రావు! మూడు రాజధానుల విషయం అలా ఉంచితే ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందదు. అభివృద్ధి చేయడానికి అవకాశమున్న అమరావతిపై ముఖ్యమంత్రికి మొహం మొత్తింది. చేసేది ఏముంది – అనుభవించడమే!“…
 
ఇవీ పరమనీచ నికృష్ట కులగజ్జి దుర్మదాంధుడు రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెడుతున్న శాపనార్ధాలు!  ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవం అయిందట!  చంద్రబాబు పాలనలో ఏవో లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్రం వెలిగిపోయినట్లు…ఇక జగన్ పాలనలో పెట్టుబడులు రావంటే రావని పిల్లిశాపాలు పెట్టడానికి తెగించాడు.  మూడు రాజధానుల్లో ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందదు అని తన మనసులోని మాటను కక్కేస్తున్నాడు.  జగన్ ను ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తూ అనుభవించండి అంటూ శోకాలు పెడుతున్నాడు!  
 

Also Read – మూడు రాజధానుల ప్రతిపాదన ఎవరికొంప కూల్చబోతోంది?

 
అలాగే జనసేన – భాజపా పొత్తు మీద కూడా కొంత విషం కక్కాడు రాధాకృష్ణ.  తెలుగుదేశం తో పొత్తు లేకుండా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసిపి నెత్తిన పాలుపోసినట్లే అవుతుందని మొత్తుకుంటున్నాడు.  
 
అయినా పరపతి, విశ్వసనీయత కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎవరితో కలిసినా, విడిపోయినా, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ పరిస్థితులలో ప్రజలే తమ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకోవడానికై ఉద్యుక్తులు కావడం ఒక్కటే మార్గం. రాజకీయ ప్రత్యర్థులను లం..కొడుకు, దొంగముండా కొడుకు అని బహిరంగంగా తిట్టగలుగుతున్న నాయకులను ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు గర్వపడండి అప్పటిదాకా!”  అంటూ మరో విషగుళికను ప్రజల మీద ప్రయోగించాడు రాధాకృష్ణ.  రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టమని ఎవరూ చెప్పరు కానీ, రాజకీయాల్లో బూతులకు, దౌర్జన్యాలకు,   హత్యారాజకీయాలకు మారుపేరైన తెలుగుదేశాన్ని వదిలి వైసిపి ఎమ్మెల్యేకు నీతులు చెప్పడమే ఆశ్చర్యం.  తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని అధికారమదంతో సాక్షాత్తూ ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టుబట్టుకుని ఈడ్చుకెళ్ళిన హృదయవిదారకమైన దృశ్యం రాధాకృష్ణ మరచిపోయినత తేలికగా జనం మరచిపోరుగదా!  
 
 
Ilapavuluri Murali Mohan Raoఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు  

Recent Posts

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

క్రేన్ ఘ‌ట‌న‌పై శంక‌ర్ షాకింగ్ ట్వీట్‌!

`ఇండియ‌న్‌-2` సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా 150 అడుగుల ఎత్తునుంచి లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ‌టంతో ఘోర ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు సిబ్బంది అక్క‌డిక‌క్క‌డే మృతి...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

Featured Posts

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...

ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రికి ప్రధాన శత్రువు ఎవరు?

కారణాలు ఏవైనా కావచ్చు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వుండవచ్చు. అవి కాస్తా పక్కన బెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రతి పక్షాలు...