Home News Andhra Pradesh క్షేత్రస్థాయిలో అంతా రివర్స్! వైసిపి నేతల్లో భయాందోళనలు!

క్షేత్రస్థాయిలో అంతా రివర్స్! వైసిపి నేతల్లో భయాందోళనలు!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవ రత్నాలు లాభం కన్నా అపకారం ఎక్కువగా జరుగుతోందని క్షేత్రస్థాయిలో వైసిపి నేతలు మథన పడుతున్నారు. ఫించన్లు రేషన్ కార్డులు రద్దు బల వంతపు భూసేకరణ మున్ముందు తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని భయ పడుతున్నారు. కాని ఒక్కరూ నోరు విప్పే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదంగా సాగుతుంటే మంత్రులు కూడా నోరు విప్పలేదంటే ఇక తాము చేయ గలిగిందేమీ లేదని ఎమ్మెల్యేలు సమాధాన పడుతున్నట్లు ప్రచారంలో వుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందు పెట్టుకొని ఏక బిగిన దాదాపు ఆరేడు లక్షల ఫించన్లు రద్దు చేయడం ఇరవై లక్షల రేషన్ కార్డులు రద్దు కావడం వైసిపి నేతలకు మింగుడు పడటం లేదు.  టిడిపి నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫించన్లు రేషన్ కార్డులు రద్దు బాగా ఉపయోగ పడుతుందనే మహదానందంలో వున్నారు. మగ్గాలు ఆటోలు స్వంతంగా గల వారికే ఆర్థిక సాయం అందింది. వారితో పోల్చుకుంటే అద్దెకు పని చేసే వారు ఎన్నో రెట్లు అధికంగా వున్నారు. ప్రస్తుతం వారంతా గుర్రుగా వున్నారు.

ఫించన్లు అంశానికొస్తే మరీ మెట్ట ప్రాంతాల్లో పది ఎకరాలుగల రైతు కుటుంబం ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కుటుంబం లోని వారు కూలీ పనులకు పోతే గాని కుటుంబ పోషణ కష్టంగా వుంటుంది. కొన్ని కుటుంబాల్లో పల్లం పొలం మూడు ఎకరాలు వున్నా సాగునీటి వసతి లేనపుడు లేదా బోరు బావిలో నీరు లేనపుడు లేదా చెరువు మరమ్మతులు లేకుండా నీరు నిల్వ లేనపుడు మూడు ఎకరాల భూమి ఎందుకూ పనికి రాదు. ఈలాంటి కుటుంబాలకు చెందిన ముదుసులకు ఫించన్లు కోత పెట్టారు. రేషన్ కార్డులు రద్దు చేశారు . పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవడం సాధ్యమైనంత వరకు అనర్హత కింద సంఖ్య బాగా తగ్గించాలనే ఆదేశాలు వుండటం కూడా ఇందుకు తోడైంది

టిడిపి హయాంలో జన్మ భూమి కమిటీల్లాగా వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం స్థానిక వైసిపి నేతల చేతుల్లో వుండటంతో టిడిపి సానుభూతి పరులు అనే దాని కన్నా మొన్నటి ఎన్నికల్లో వైసిపికి వ్యతిరేకంగా పని చేసిన కుటుంబాలకు చెంది ఏ చిన్న మైనస్ పాయింట్ వున్నా కోత పెట్టారు. దీనికి తోడు మరో అంశం వుంది. . కుటుంబం ఆర్థికంగా పదిలంగా వున్నా ముసలి తలిదండ్రులను కుమారులు సరిగా చూచుకోక పోవడం సర్వసాధారణంగా వుంది. అయితే ఇంతవరకు ఆ ఇంటికి చెందిన ముసలి వాళ్లకు ఫించన్ వచ్చేది. ఫించన్లు కోసం ముసలి వాళ్లకు అంతో ఇంతో దాహం పోసే వారు. ప్రస్తుతం ఈలాంటి చాల మందికి ఫించన్లు రద్దు చేశారు. ఇప్పటికే కొంత మందిని ఇళ్ల నుండి వెళ్ల గొట్టారు. గ్రామాల్లో ఫించన్లు తొలగించిన వారి గోడు వర్ణనాతీతంగా వుండటమేగాక నమ్మి మోసపోయి ఓటు వేశామనే రోదన భాషకు అందకుండా వుంది. టిడిపి హయాంలో ఇంత ఖచ్చితంగా చూడ లేదని అటు ఇటుగా వెసులుబాటు వుండేదని ప్రస్తుతం రూల్ల కర్ర పెట్టి కొలుస్తున్నట్లు చేయడంతో ఒకటి ఇచ్చి రెండు లాగుకున్న చందంగా వుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

అయితే టిడిపి నేతలు ఒక పక్క ఫించన్లు కోత పెట్టిన వారికి సానుభూతి తెలుపుతూ లోలోన ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం మరో ధోరణి కనిపిస్తోంది. నియోజకవర్గాల స్థాయిలోనే కాకుండా మండల సచివాలయ లెవల్ లో కూడా మునుపటి లాగా ప్రతి పక్ష ప్రతినిధులను దగ్గరకు రానీయడం లేదు. వైసిపి నేతలు చెబితే తప్ప పనులు జరగడం లేదు. ఈ పరిస్థితి ప్రజలు కూడా అర్థం చేసుకొని అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగు తున్నారు. ఈ పరిస్థితి మున్ముందు వైసిపి కి తీవ్ర ప్రతిబంధకం కావచ్చు. అధికార యంత్రాంగం మొత్తంగా వైసిపి నేతల చేతుల్లోకి పోయింది

Recent Posts

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని...

Featured Posts

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...