Home News Andhra Pradesh బజారు కెక్కనున్న ఎమ్మెల్యే యంపిల నేరాల బతుకు

బజారు కెక్కనున్న ఎమ్మెల్యే యంపిల నేరాల బతుకు

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు నేర చరిత్ర గల తమ ప్రజాప్రతినిధులు వివరాలు తమ వెబ్సైట్ ల్లో పొందు పర్చాలని సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలను సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ అంశానికొస్తే వైసిపి పార్టీ తరఫున ఎన్నికైన వారు ఎక్కువ మంది వున్నారు.

చాలా కాలంగా ఈ దేశంలో చట్ట సభలను నేరస్తులు ఆక్రమించు కున్నారు. పార్లమెంటులో 2004 లో నేర చరిత గలవారు 24 శాతం వుంటే 2019కి శాతానికి పెరిగారు. స్వాతంత్య్రోద్యమ నాటి స్ఫూర్తి మ్యూజియంలో వస్తువుగా మిగిలి పోయింది. డబ్బు కండ బలంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కాంట్రాక్టర్లు పారిశ్రామిక వేత్తలుగా వుంటూ పన్నులు ఎగ్గైట్టే ఎగవేతదారులు ఆర్థిక నేరస్తులు హత్య అత్యాచారాల్లో ఆరితేరిన వారు ఎమ్మెల్యేలుగా పార్లమెంటు సభ్యులుగా ఎన్నికౌతున్నారు. అద్రుష్టం కొద్దీ వీరిపై కేసులు నమోదు అవుతున్నా ఏళ్ల తరబడి విచారణలో సాగలాగ బడి తుదకు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు.

తొలుత ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ 2014 లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన సందర్భంలో తను అధికారంలోనికి వస్తే ఆర్థిక నేరాలు తీవ్ర మైన క్రిమినల్ నేరాలు చేసిన వారి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ఆరు మాసాల్లో తీర్ఫులు వచ్చేట్టు చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఏమైంది అందరికి తెలుసు.

అద్రుష్టం కొద్దీ సుప్రీంకోర్టు తాజాగా దేశంలోని రాజకీయ పార్టీలు దిమ్మదిరిగే విధంగా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రజా ప్రతినిధుల నేర చరిత్ర తమతమ వెబ్ సైట్ లలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసి నేర చరిత్ర గల ఎమ్మెల్యేల పార్లమెంటు సభ్యుల్లో ప్రకంపనలు సృష్టించింది. అంతే కాదు ఆయా పార్టీల నాయకత్వాలు నేర చరిత్ర గల వారికి ఎందుకు టికెట్లు ఇచ్చారో కూడా తమ వెబ్ సైట్ ల్లో వివరాలు పొందు పర్చాలని పార్టీల అధిష్టాన వర్గాలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశం మొత్తం మీద పరిశీలించితే బిజెపి ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది నేరస్తులు వుండి ఇందుకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్ర ప్రదేశ్ కు వస్తే వైసిపి అగ్రస్థానంలో వుంది. 151 ఎమ్మెల్యేలతో 86 మందిపై కేసులు నమోదై వున్నాయి. ఈ అంశం ఈ పాటికే రాష్ట్రంలో వివాదాంశంగా నడుస్తోంది. టిడిపి కి చెంది15 మంది ఎమ్మెల్యేలపై కేసులు వున్నాయి. తక్కువ మంది ఎమ్మెల్యేలు కాబట్టి కేసులు తక్కువగానే వున్నాయి.
కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద 38 కేసులు వుండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒక కేసు నమోదు అయివుంది.

Recent Posts

కమల్‌కు లైకా ఆర్డర్ పాస్ చేస్తోందా?

`ఇండియ‌న్ 2` షూటింగ్ సంద‌ర్భంగా ఏర్ప‌డిన ప్ర‌మాదం చిలికి చిలికి క‌మ‌ల్ - లైకా మ‌ధ్య ఈగో వార్‌గా మారుతున్నట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం చెన్నైలోని ఓ స్టూడియో లో వేసిన...

సందీప్ వంగ‌కు ప్ర‌భాస్ షాకిచ్చిన‌ట్టేనా?

`అర్జున్‌రెడ్డి`తో టాలీవుడ్‌కు ఓ గేమ్ ఛేంజ‌ర్ లాంటి చిత్రాన్ని అందించి సంచ‌ల‌నం సృష్టించాడు సందీప్ వంగ. ఈ సినిమా త‌రువాత ప్ర‌తి స్టార్ హీరోకి ద‌గ్గ‌ర‌య్యారు. `అర్జున్‌రెడ్డి` టేకింగ్, మేకింగ్ ప్ర‌తీ హీరోనీ...

విశాఖ టిడిపి నేతలు ద్రోహులైతే మరి కోస్తా వైసీపీ నేతలు?

రాష్ట్రంలో ప్రాంతీయ వాదం వెర్రిముండ తలలాగా పిచ్చెక్కిపోతోంది. భావోద్వేగాలపై రాజకీయం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ప్రాంతీయ అసమానతలు నివారించాలని ముందుగా పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నది. అందుకు ప్రాతిపదికగా మూడు రాజధానుల ప్రతి పాదన...

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

వెంకీ స్టోరీ మాస్ రాజా ద‌గ్గ‌రికి!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోతే వెంట‌నే మ‌రో హీరో ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఇండ‌స్ట్రీలో వెరీ కామ‌న్‌. అలా చేతులు మారిన క‌థ‌లు కొంత మందికి బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని,...

మ‌హేష్‌కు బాలీవుడ్ ఆఫ‌ర్‌?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీతో క‌లిసి యుఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే. వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టి మైత్రీ మూవీమేక‌ర్స్‌కి ఓ భారీ ఫ్యామిలీ...

బాల‌య్య కోసం రీమిక్స్ సాంగ్‌!

బాల‌కృష్ణ కెరీర్ ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఏమీ బాగాలేదు. తండ్రి బ‌యోపిక్ అంటూ హ‌డావిడి చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పేరు మాట అటుంచితే ఎన్టీఆర్ బ‌యోపిక్ భారీ నష్టాల‌ని తెచ్చిపెట్టింది. దీని త‌రువాత చేసిన...

క్రిష్ క్రేజీ హీరోయిన్‌ని ఫిక్స్ చేశాడు!

రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో వేగం పెంచారు. దిల్ రాజుతో క‌లిసి బోనీ క‌పూర్ నిర్మిస్తున్న బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ...

మ‌హేష్ అతిథి పాత్ర‌కు సై అనేసిన‌ట్టేనా?

చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌క్స‌లైట్ నేప‌థ్యాన్ని, దేవా దాయ శాఖ‌లో జ‌రిగిన ఓ కుంభ‌కోణాన్ని కొర‌టాల శివ...

ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా...

Featured Posts

ఢిల్లీ విశాఖ నగరాల్లో బలిపశువులైన పోలీసు యంత్రాంగం

పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో ఏ మాత్రం స్లిప్ అయినా నష్టపోయేది పోలీసులే వెనుక వుండి నడిపించిన అధికార పార్టీల నేతలు సేఫ్ గా వుంటారు. తుదకు న్యాయస్థానాల ముందు పోలీసులు...

జగన్ ప్రభుత్వానికి రాయిటర్స్ నేర్పిన పాఠం

తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మీడియాకు ఒక రాజకీయ మరియు వ్యాపార ఎజెండా ఉంది. ఈ రెండు కారణాలే కాకుండా 2000 దశకం తర్వాత నుండి కులం కూడా...

మీడియాను నియంత్రించాలా?

ఒక రాజకీయ విశ్లేషకుడిగా,  రచయితగా,  ప్రజాస్వామ్య ప్రేమికుడిగా మీడియాను నియంత్రించాలనుకునే ఆలోచనలను నేను తిరస్కరిస్తాను.  మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఆలంబన.  మీడియా అనేది మత్తేభాలలాంటి  ప్రభుత్వ దుర్విధానాలను అదుపులో ఉంచే పదునైన అంకుశం. ...