Home News Andhra Pradesh జనసైనికులకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే !

జనసైనికులకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే !

రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిర్లక్ష్యం చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీయే.  ఆవిర్భావం నుండి జనసేనను ఇదే సమస్య వెంటాడుతూ ఉంది.  జనంలో ఆదరణ ఉన్న మూడవ పెద్ద పొలిటికల్ పార్టీ అయినా కూడా మీడియా మాత్రం దూరం పాటిస్తూనే ఉంది.  పార్టీ తరపున ఏ కార్యక్రమం జరిగినా టీవీ ఛానెళ్లు లేదా పత్రికలు పెద్దగా కవర్ చేయవు.  స్వయంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయటికొచ్చి మాట్లాడితే ఛానెళ్లలో ఏదో నిమిషం కవరేజ్, పత్రికల్లో ఏదో ఒక మూల చిన్న వార్త అంతే.  ఈ సమస్య పార్టీ జనంలోకి వెళ్లడానికి పెద్ద అవరోధంలా మారింది.  

రాష్ట్ర మీడియా వ్యవస్థ మొత్తం మొదటి రెండు ప్రధాన పార్టీల మధ్య చీలిపోయి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను మొదట్లోనే గుర్తించిన పవన్, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని పార్టీని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.  ఆమేరకు ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ లాంటి ఫ్లాట్ ఫామ్స్ మీద పనిచేయడం మొదలుపెట్టారు.  అప్పటివరకు షోషల్ మీడియాలో పవన్ సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టిన ఫ్యాన్స్ ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నారు.  ఎవరికి వారు స్వచ్చంధంగా పార్టీ సిద్దాంతాల్ని, పార్టీ కార్యకలాపాల్ని ప్రచారం చేసే భాద్యతను భుజాలకెత్తుకున్నారు. 
 
అధినాయకత్వం నుండి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండానే అనతి కాలంలోనే సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చకు వచ్చిన అంశాల జాబితాలో జనసేన పార్టీని నిలబెట్టారు.  పార్టీకి సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా జనసైనికుల సామాజిక మాధ్యమాల అకౌంట్ల నుండే బయటి ప్రపంచానికి తెలిసేదంటే వారి పనితీరు ఎంత విశేషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  వైకాపా, టీడీపీలు సోషల్ మీడియా ప్రచారం కోసం పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తే జనసేనకు మాత్రం ఆ అవసరం లేకుండా పోయింది.  కారణం పార్టీ తరపున నిర్వహించే ఇతర కార్యకలాపాలతో పాటు ప్రచారం అనే భాద్యతను కూడా జనసైనికులు స్వఛ్ఛందంగానే నిర్వహించారు.  
 
సాధారణ రోజుల్లో పవన్ బయట తిరుగుతున్న సమయంలోనే సీత కన్నేసిన మీడియా సంస్థలు ఈ లాక్ డౌన్ తరుణంలో పార్టీని పూర్తిగా విస్మరించాయి.  దీంతో జనసైనికులు మరింత అప్రమత్తమయ్యారు.  తమ నాయకుడు బయట కనిపించకపోయినా తమ పార్టీ నిర్ణయాలు, కార్యకలాపాలు టీవీ ఛానెళ్ళలో, వార్తా పత్రికల్లో వినిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా ప్రతిధ్వనించేలా చేయాలని డిసైడ్ అయ్యారు.  పార్టీ నుండి అధికారికంగా ఏ విషయం బయటికొచ్చినా దాన్ని బయటకి తీసుకొస్తూ కరెంట్ ఇష్యూల మీద పార్టీ స్టాండ్ ఏమిటో జనానికి చెబుతున్నారు.  
 
అధికార పార్టీ నిర్ణయాలను, విధానాలను, పని తీరును పార్టీ ఐడియాలజీని దృష్టిలో పెట్టుకుని విశ్లేషిస్తూ లోపాల్ని ఎత్తి చూపుతున్నారు.  అంతేకాదు అన్ని జిల్లాలోని శ్రేణులు ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే ఒకరినొకరు సమన్వయ పరుచుకుంటూ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రజల ముందుంచుతున్నారు. పార్టీ నాయకులు సైతం ఈ మాధ్యమాల ద్వారానే శ్రేణులతో అనుసంధానమవుతున్నారు.  మొత్తం మీద ఈ లాక్ డౌన్ తమ నాయకుడి చేతులు కట్టేసినా జనసైనికులు మాత్రం పార్టీ ఉనికిని సోషల్ మీడియా ద్వారా చాటుతూనే ఉన్నారు.    

Telugu Latest

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రాజకీయాలు ?  

'అయినను పోయి రావలె హస్తినకు' అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో  త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.  ఈ చిత్రం కోసం  నేటి భిన్నమైన రాజకీయ ...

జగన్ ఈ సారైనా సక్సెస్ అవుతాడా ? 

  జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదనేది  వైసీపీ నాయకులే చెబుతున్న మాట.  టీడీపీ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయడమే తప్పు...

బోల్డ్ పాత్ర కోసం ఈషా రెబ్బా.. ?

 తెలుగు సినిమాల్లో  తెలుగు అమ్మాయిలకి పెద్దగా అవకాశాలు రావు అని నానుడి ఉంది.  అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆడపాదడపా ఛాన్స్ లు అందుకంటూ  తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే  స్టార్...

రచ్చ పీక్స్..  బాబు త్వరగా  మేల్కొంటే మంచింది !  

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రస్తుతం మౌనం దాల్చారు. నేతలు కొట్లాడుకుంటున్నా.. మాటల దాడులు చేసుకుంటున్నా తనకేమీ పట్టన్నట్టుగా  బాబు సైలెంట్ గా ఉండడం ఏమిటా అని తెలుగు తమ్ముళ్ళు తెగ ఫీల్...

బాబు హయాంలో బ్లాక్‌లో అయినా దొరికేది.. జగన్ వచ్చాక అసలు దొరకట్లేదు

కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది.  రీచ్ నుండి లోడైన ఇసుక ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం...

గుడిలో సీక్రెట్ గా న‌య‌న్-విఘ్నేష్ పెళ్లి?

న‌య‌న‌తార‌-విఘ్నేష్ శివ‌న్ పెళ్లిపై సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు కొత్తేం కాదు. ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటారా? లేదా? అన్న‌ది తెలియుదుగానీ సోష‌ల్ మీడియా మాత్రం ఆ ఇద్ద‌రికీ చాలాసార్లు పెళ్లి చేసింది. పిల్ల‌లు కూడా...

ఆర్జీవీ వ‌ర‌ల్డ్‌లో 8 పీఎం టుడే క్లైమాక్స్

వివాదాస్ప‌ద దర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వివాదంతో ఉచిత‌ ప్ర‌చారం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇక ఇటీవ‌లి కాలంలో వేడెక్కించే క‌వ్వించే సినిమాల‌తో ప్ర‌చారం...

అఖిల ప్రియ చూపు క‌మ‌లం వైపా?

టీడీపీ నేత‌లు అఖిల ప్రియ‌- ఏ.వి సుబ్బారెడ్డిల వ్య‌వ‌హారం ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా మ‌రోసారి సంచ‌ల‌నమ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. సుబ్బారెడ్డిని చంప‌డానికి అఖిల ప్రియ కోటి రూపాయాలు సుపారీ ఇచ్చింద‌ని సుబ్బారెడ్డి ఆరోప‌ణ‌తో సీన్...

నిధుల్లేవ్.. పథకాల్లేవ్.. పేదలకు మిగిలింది కన్నీరే 

ప్రస్తుతం భారతదేశ ఆర్థిక స్థితి బాగా దెబ్బతిందని కేంద్రం పదే పదే అంటోంది తప్ప పూర్తిగా చితికిపోయిన పేదల గురించి, అసలు బ్రతుకే లేకుండా పోయిన వలస కూలీల గురించి మాట్లాడటం లేదు. ...

ఫేస్‌బుక్‌లో నంబ‌ర్ వ‌న్ సౌత్‌ హీరో అత‌డే

సోష‌ల్ మీడియా యుగం ఇది. అక్క‌డ ఎంత‌గా ఫాలోవ‌ర్స్ ఉంటే అంత‌గా పాపులారిటీ ఉన్న‌ట్టు. ఫేస్ బుక్ - ఇన్ స్టా- ట్విట్ట‌ర్ మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం స్టార్లు ఎంత‌గానో త‌పిస్తున్నారు. ఇక...

English Latest

Mahesh Babu’s sister to come up with something exciting

Manjula is a noted name in the industry as she has acted, directed and also produced films in Telugu cinema. Off late, she has...

Sridevi’s family out of Corona scare

A few days back, Janhvi Kapoor's maid tested positive and created a stutter in her apartment and she was left to stay at home...

TTD files case on star hero’s father

The Tirumala temple will soon be opened for the public in the days to come and even before this, it has created a new...

Who is AP Tollywood’s Bhageeratha?

Everyone is aware that Bhageeratha performed thousands of years of penace to bring river Ganga from heaven to earth. He overcame many obstacles even...

Shocker: PAK PM hit, Foreign Minister raped her

Cynthia D.Ritchie, popular American bloggers and Pakistan explorer made sensational allegations against the then Pakistan Prime Minister Yousaf Raza Gilani and health minister Makhdoom...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show