Home News Andhra Pradesh సంకట స్థితిలో ఆంధ్రప్రదేశ్ అధికారులు

సంకట స్థితిలో ఆంధ్రప్రదేశ్ అధికారులు

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల పరిస్థితి. ప్రభుత్వం చెప్పినట్లు వినాలా లేక రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలా అన్నది వారికి సంకటంగా మారిపోయింది. ఏ దిశగా చర్యలు తీసుకున్నా రాజకీయంగా, పాలనా పరంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు వారికి.

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి పెద్ద వార్ నడుస్తోంది. ఈ వార్‌లో ఇప్పుడు అధికారులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల ఆధారంగా చిత్తూరు, గుంటూరు జిల్లా కలెక్టర్లను, గుంటూరు రూరల్, తిరుపతి అర్బన్ ఎస్పీలను బదిలీ చేయాలని ఆదేశించింది. మరో ఇద్దరు సీఐలతో పాటు మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇక్కడే ఉన్నతాధికారులకు చిక్కు వచ్చి పడింది. నార్మల్‌గా అయితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే వారేమో.. కానీ ఇక్కడ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో అధికారులపై చర్యలు తీసుకుంటే.. ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది అనే అనుమానాలతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పైగా ప్రభుత్వ తీరు చూసిన తర్వాత అలాంటి అవకాశాలు కూడా లేవనే తెలుస్తోంది. ఆరు వారాల తర్వాత గానీ, అంతకన్నా ముందు గానీ మరి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ తిరిగి ప్రారంభమైనప్పుడు అయినా ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరిపారు. ఆ తర్వాత.. ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ లేఖ తదితర అంశాలపై గవర్నర్‌‌ను కలిసి చర్చించారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మద్య వార్ అంత త్వరగా ముగిసేలా లేదు. మరి చిలికి చిలికి ఈ వివాదం ఎక్కడిదాాకా వెళ్తుందో.. ప్రభుత్వ అధికారులకు ఏం తంటాలు తెచ్చిపెడుతుందో అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Featured Posts

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

All cardholders will get ration

Lambasting TDP party for playing cheap politics during the tough time of COVID 19 pandemic, Minister's for Civil Supplies Kodali Venkateswara Rao (Nani) emphasized...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ప‌వ‌న్ – క్రిష్ సినిమాకు టైటిల్ ఫిక్స‌యిన‌ట్టేనా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ కెమెరా ముందుకొచ్చారు. జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా గ‌డిపేసిన ప‌వ‌న్ మ‌రోసారి అభిమానులు కోరిక మేర‌కు మ‌ళ్లీ ఫేస్‌కి మేక‌ప్ వేసుకున్నారు. బాలీవుడ్ హిట్...

ప్చ్‌..! లాక్ డౌన్ ఎత్తేసినా ఆ డ‌జ‌ను రిలీజ్ డౌటే!

లాక్ డౌన్ పంచ్ కి థియేట‌ర్లు బంద్ అవ్వ‌డంతో సినిమాల రిలీజ్ ల‌న్నీ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లానే వినోద‌ప‌రిశ్ర‌మ అల్ల‌క‌ల్లోలం అయ్యింది. ప్ర‌స్తుతం మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ...

గ‌ప్ చుప్‌: ప‌వ‌ర్ స్టార్ మూవీలో క‌రోనా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచిన సంగ‌తి తెలిసిందే. వ‌కీల్ సాబ్ (పీ.ఎస్.పీ.కే 26) .. పీ.ఎస్.పీ.కే 27 చిత్రాలు సెట్స్...

స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే...

బ‌న్నీకి `బాహుబ‌లి 2` రిలీజ్ డేట్ కావాల‌ట‌!

అల్లు అర్జున్ `ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతిని సెంటిమెంట్‌గా భావించిన బ‌న్నీ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో చేస్తున్న‌ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి...

మ‌ల‌యాళ హీరో మోహ‌న్‌లాల్‌పై మ‌రో రూమ‌ర్‌?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఇప్ప‌టికే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాల్లో విళ‌య‌తాండ‌వ చేస్తోంది. ఇట‌లీ, స్పెయిన్ ఇప్ప‌టికే దీని కార‌ణంగా భారీ మూల్యాన్ని చెల్లించాయి. అధిక సంఖ్య‌లో ఈ రెండు దేశాల్లోనే క‌రోనా...

దిల్‌రాజుకు నాగ‌చైత‌న్య షాక్ ఇచ్చాడా?

దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత అక్కినేని నాగ‌చైత‌న్య‌తో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఈ సినిమా ద్వారా కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయాల‌నుకున్నారు. దీని కోసం బాలీవుడ్...

ఆల్ట్ బాలాజీని మ‌రిపించి `ఆహా` అనిపిస్తార‌ట‌!

అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్‌, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు ధీటుగా అల్లు అర‌వింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు మేజ‌ర్...

చిరంజీవి సార‌థ్యం.. బాల‌య్య సాయ‌మా?

క‌రోనా క‌ల్లోలం ప్ర‌జ‌ల్ని.. చిరుద్యోగుల్ని.. సినీకార్మికుల జీవితాల్ని అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. నిత్యావ‌స‌రాల‌కు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాం. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సినీకార్మికుల కోసం ఏర్పాటు...

సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి...