Home News Andhra Pradesh నా ప్రాణాలకు రక్షణ లేదు... బాంబు పేల్చిన ఎన్నికల కమిషనర్!

నా ప్రాణాలకు రక్షణ లేదు… బాంబు పేల్చిన ఎన్నికల కమిషనర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాంబు పేల్చారు.. తన ప్రాణాలకు రక్షణ లేదని.. కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖకు భారీ లేఖ రాశారు. హైదరాబాదులో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా పరిస్థితులు మారిపోయాయి. ఏకంగా సీఎం జగన్ మోహన్ ఎన్నకల కమిషనర్ రమేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ నేతలంతా రమేష్‌పై విరుచుకు పడ్డారు. ఎన్నికల వాయిదాపై సుప్రీంను ఆశ్రయించారు. ఎన్నికల వాయిదాను సమర్థిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ రమేష్ కేంద్ర హోం శాఖకు ఐదు పేజీల లేఖ రాయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద రమేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

లేఖలో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఎన్నికల తర్వాత కూడా తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను హైదరాబాద్‌లో ఉంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు తాను రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపానని రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి హింసకు తావులేకుండా గట్టి భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినా ఎన్నికల్లో హింస జరిగిందని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలను ప్రస్తావించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మీద దాడులు జరిగినట్టు వివరించారు. అలాగే, స్థానిక సంస్థల్లో 2014లో ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి, ఇప్పుడు ఎన్ని అయ్యాయనే వివరాలను సైతం ప్రస్తావించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో ఏకగ్రీవాలపై కూడా రమేష్ కుమార్ లేఖలో రాయడం గమనార్హం.

మరి ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా కేంద్రానికి ఆయన లేఖ రాయడంపై ఎలా స్పందిస్తుందో.. ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...