Home News Andhra Pradesh రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు

అమరావతి రాజధాని రైతుల ఆందోళన బుధవారంతో 63 రోజులకు చేరుకున్నది. అయినా వారిలో ఉద్యమ స్పూర్తి ఏ మాత్రం సడల లేదు. మహిళలే మొత్తం ఉద్యమం మోస్తున్నారు.

ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా మరో సమస్యకు తెర లేచింది. రాజధాని గ్రామాల ప్రజల్లో చీలిక తెచ్చేందుకు కావచ్చు. లేదా ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ కార్యక్రమం కింద కావచ్చు. రాజధానికి ఇచ్చిన భూముల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రివిన్యూ అధికారులు సర్వేకు ఉపక్రమించారు. దీనితో ఇంత వరకు రాజధాని కోసం వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించుతుండిన మహిళలు రివిన్యూ అధికారులను అడ్డుకోవడంతో మరింతగా ఉద్రిక్తత నెలకొంది. ఇది శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తుందేమో. అధికారుల విధులకు అడ్డు తగిలారని అరెస్టుల పర్వం మున్ముందు మొదలు కావచ్చు.

ఇదిలా వుండగా తన ఆదేశాలను పాటించలేదని శాసన మండలి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని గవర్నర్ కు మండలి చైర్మన్ షరీఫ్ మెమోరాండం ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన తెలపడం సరికొత్త మలుపు. రాజకీయ నాయకులులాగా మండలి కార్యదర్శి నిబంధనల ప్రకారం వ్యవహరించారని ఆయనపై ఒత్తిడి తేవడం సరికాదని మండలి కార్యదర్శికి అండగా వుంటామనివీరు ప్రకటన చేశారు.పైగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి ఫిర్యాదు చేశారు. ఇంత వరకు వైసిపి టిడిపి పార్టీల మధ్య నడుస్తుండిన పోరులో సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు జోక్యం చేసుకోవడం సరి కొత్త మలుపు.

రోజు రోజుకు ఉధృతం అవుతున్న రాజధాని వివాదం నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్ర ప్రకాశం జిల్లాలో బుధవారం ప్రారంభించారు. తొలి రోజు బాగానే జనం వచ్చారు. గత అయిదు ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అధికారంలో వుండి అధికారులు తరలించే జనంను ఉద్దేశించి ప్రసంగించే వారు. జనం వారంతట వారు వచ్చిన సభలు లేవు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిదు ఏళ్లు ప్రజల మధ్య గడిపి నందున ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పార్టీ పరంగా సభలు సమావేశాలు నిర్వహణకు శ్రీ కారం చుట్టారు. వాస్తవంలో చంద్రబాబు నాయుడు 45 రోజుల్లో అన్ని జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనలో ప్రజల స్పందన ఏలా వుంటుందో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతి పాదనతో వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ వాదం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పర్యటనలో వివిధ జిల్లాలో ప్రజల స్పందన ఏలా వుంటుందో బహిర్గతమైతే రాజధాని వివాదం గురించి ప్రజల నాడి అవగతం చేసుకోగలం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటన పెట్టుకోవడం కూడా ఒక విధంగా మంచిదే అవుతుందేమో. అయితే అదే సమయంలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా ఏర్పడే ప్రమాదం లేక పోలేదు.

Recent Posts

ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కు దేవీకి బంప‌ర్ ఆఫ‌ర్!

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. త‌న‌దైన సంగీతంతో హుషారెత్తించే సంగీతం దేవీ సొంతం. తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా క్రేజ్‌ని సొంతం చేసుకున్న దేవి గ‌త కొంత కాలంగా తెలుగులో త‌న ప‌ట్టుని...

ఇద్ద‌రు క్రాక్‌లు త‌న‌తో ట‌చ్‌లో వున్నార‌ట‌!

క‌రోనా వైర‌స్‌ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని విధించిన విష‌యం తెలిసిందే. సామాన్యుల నుంచి స్టార్ వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఇంట్లో వుండి కాల‌క్షేపం చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే త్రిష...

అంద‌రిది ఓ దారైతే వ‌ర్మ‌ది మ‌రోదారి!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా జ‌నం భ‌యంతో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎక్క‌డి జ‌నం అక్క‌డే.. వీఐపీ లేదు, స్టార్ సెల‌బ్రిటీ లేదు..సామాన్యుడు...

కుల‌వృత్తిలో `కేజీఎఫ్` మ్యూజిక్ డైరెక్ట‌ర్‌!

`కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. క‌న్న‌డ చిత్రాల్లోనే స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన ఈ...

ఇంటికొచ్చి ఇస్తా అన్న ఆ — ఎక్కడ?

కోవిడ్-19 విజృంభనతో దేశం మొత్తం లాక్ డౌన్ అయిపోయింది. ఈ సమయంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిత్యావసరాలు, అలాగే రేషన్ వంటి వాటిని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్...

ఆ మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ముగినట్టేనా?

దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కోటలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. మూస సిద్ధాంతాలతో మసకబారుతున్నాయి. మచ్చలేని ప్రజా నాయకులుగా వెలిగిన వారు.. పలుమార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు.. ఇప్పుడు ఆర్థిక స్థోమత లేక...

సబ్బం హరి ఆ పని చేయడం వల్లే జగన్‌ దూరం పెట్టారా?

మంచి మాటకారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ సబ్బం హరి మాటలు.. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు మంచి సరుకుగా, జగన్‌పై విమర్శలు సంధించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. సమయం, సందర్బం అంటూ ఏదీ...

హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో...

పుట్టిన రోజు లేదు .. పెళ్లీ కూడా వాయిదా!

ప్ర‌పంచం క‌రోనా వైర‌స్ కార‌ణంగా అల్ల క‌ల్లోలం అవుతోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా మ‌ర‌ణాలే. దేశం క‌రోనా కార‌ణంగా భ‌యంతో కంపించిపోతోంది. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మైన కార్య‌క్రమాల‌న్నింటినీ జ‌నం వాయిదా వేసుకుంటున్నారు. కొన్నింటిని...

`ఉప్పెన‌`కు క‌త్తెరేస్తున్న ద‌ర్శ‌కుడు!

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `ఉప్పెన‌`. మైత్రీ మూవీమేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం...

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...