Home ఆంధ్ర & తెలంగాణ కేటిఆర్, లగడపాటి చీకటి స్నేహం... నష్టం ఎవరికి?

కేటిఆర్, లగడపాటి చీకటి స్నేహం… నష్టం ఎవరికి?

లగడపాటి రాజగోపాల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన సమైక్యవాదం పేరుతో చేసిన చిలిపి చేష్టలు. వీర సమైక్యవాదిగా ప్రాచుర్యం పొందేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేసి అభాసుపాలయ్యారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలుగుతల్లి పేరుతో తిక్క తిక్క ప్రకటనలు చేసి తెలంగాణవాదులను రెచ్చగొట్టారు. ఆయన మాటలు శృతి మించడంతో ఓయూ జెఎసి నేత రాజారాం యాదవ్, మరికొందరు ప్రెస్ క్లబ్ వద్ద లగడపాటిపై దాడికి చేసిన పరిస్థితి ఉంది. అంతేకాదు నిమ్స్ లో చికిత్స పేరుతో లగడపాటి పరిగెత్తిన తీరు తెలంగాణవాదులు ఇంకా మరచిపోలేకపోతున్నారు. ఆంధ్రా కసబ్ అని కూడా లగడపాటిని పోల్చారు. ఇక పార్లమెంటులో లగడపాటి పెప్పర్ స్రే సీన్ హైలెట్. తుదకు ఆయన చేసిన చిల్లర పనుల వల్ల పూర్తిగా అభాసుపాలైపోయి రాజకీయ సన్యాసం పుచ్చుకుని ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. 

మరి కేటిఆర్ గురించి కూడా తెలుసుకుందాం. ఉద్యమ నేత కేసిఆర్ కొడుకుగా ఉద్యమ రంగంలోకి దిగారు. సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్ హవా ఉన్నప్పటికీ స్వల్ప ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ మళ్లీ గెలుస్తూనే ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఐటి, పరిశ్రమలు, చేనేత మంత్రిగా ఉన్నారు. మంత్రిగా సిరిసిల్లలో దళితులపై దాడులు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇసుకమాఫియా, డ్రగ్ మాఫియా లో కేటిఆర్ భాగస్వామ్యం ఉందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక 2018 ఎన్నికల తర్వాత కేటిఆర్ కు రెండు దారులు ఉన్నట్లు చెబుతున్నారు. అందులో ఒకటి టిఆర్ఎస్ ఓడిపోతే కేటిఆర్ లగడపాటి మాదిరిగానే రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే 2019 లోక్ సభ ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ ఆయన సిఎం పీఠమెక్కే చాన్స్ కూడా ఉంది. ఈ రెండు దారుల్లో ఆయన ఎటువైపు నడుస్తారన్నది డిసెంబరు 11వ తేదీన తేలనుంది.

ఇదిలా ఉంటే పచ్చి సమైక్యవాదిగా ఉన్న లగడపాటికి, కరుడుగట్టిన తెలంగాణ వాది అయిన కేటిఆర్ కు మధ్య చీకటి స్నేహం ఉందా? ఉద్యమ సమయంలో ఒకరినొకరు ఘోరంగా తిట్టుకున్నారు. టివిల ముందు ఒకరిపై ఒకరు గలీజు భాషలో ధూషించుకున్నారు. ఈ ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాలుగా జనాల మనసులో ముద్ర పడిపోయింది. మరి ఇలంటి వారు స్నేహం చేస్తారా అన్న అనుమానాలు రావొచ్చు. కానీ వీరిద్దరూ గడిచిన నాలుగేళ్లలో మంచి స్నేహమే నడిపారని తెలుస్తోంది. ఒకసారి లగడపాటి ప్రగతి భవన్ కు వచ్చి కేసిఆర్ ను కలిశారు. పూలబొకే ఇచ్చి కేసిఆర్ తో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ సమయంలో కేసిఆర్ ఆఫీసు నుంచి ఆ ఫొటోలు మీడియాకు ఇచ్చారు. ఇక లగడపాటి సర్వే సంస్థ నడుపుతారు. ఆయన చాలాసార్లు సర్వేలు చేశారు. లగడపాటి సర్వేలు ప్రజా నాడికి దగ్గరగా ఉంటాయన్న ప్రచారం సాగింది.

ఉద్యమ కాలంలో బద్ధ శత్రువులైనా తదుపరి కాలంలో లడపాటి, కేటిఆర్ స్నేహితులయ్యారు. ఏకంగా కేటిళఆర్ 27 స్థానాల్లో సర్వే చేయాలని కేటిఆర్ సహాయం కోరడం, వెంటనే 35 సీట్లలో లగడపాటి సర్వేలు చేసి కేటిఆర్ కు పంపించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ సర్వేల్లో టిఆర్ఎస్ కు ప్రజా నాడి వ్యతిరేకంగా ఉన్నట్లు లగడపాటి మాట్లాడారు. దానికి కేటిఆర్ లడగపాటిని ఫలితాల రోజు చూసుకుందామంటూ సవాల్ చేయడం జరిగిపోయాయి. ముందు లగడపాటి సర్వేలో టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని, తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత సీన్ మారిపోయిందని లగడపాటి చెప్పారు. తమకు వ్యతిరేకంగా లగడపాటి సర్వే ఫలితాలు ఉన్నాయని తేలగానే కేటిఆర్, కేసిఆర్, హరీష్ రావు, వినోద్ రావు అంతా లగడపాటి మీద దుమ్మెత్తిపోశారు. లగడపాటి చంద్రబాబు ఏజెంట్ అని, బాబు వత్తిడితోనే లగడపాటి సర్వే రిపోర్టు లు తప్పుగా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. లగడపాటి చిలుక జోస్యం ఎవరూ నమ్మొద్దన్నారు.

కేటిఆర్ కు ఆయనే దొరికిండా ?

నిజంగా సిఎం తనయుడు, కాబోయే సిఎం గా చెప్పబడుతున్న కేటిఆర్ సర్వేలు చేయించుకోవాలంటే లగడపాటే దొరికిండా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలోకానీ, జాతీయ స్థాయిలో కానీ నమ్మకమైన సర్వే సంస్థలే లేవా అని జనాల్లో చర్చ వస్తున్నది. తెలంగాణకు వ్యతిరేకంగా విషపు చర్యలకు దిగిన లగడపాటే దొరికిండా అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు కేసిఆర్ తమ సర్వేల్లో వంద సీట్లు 102 సీట్లు 110 సీట్లు అని చెబుతుంటే మరి కేటిఆర్ మాత్రం తెలంగాణ వ్యతిరేకి అయిన లగడపాటి సాయం కోరడమేంటని ప్రశ్నిస్తున్నారు. పైగా లగడపాటి తెలంగాణకు కానీ, కేసిఆర్ ఫ్యామిలీకి కానీ ఎప్పటికైనా వైరిభావంతో ఉన్న మనిషిగానే చూడాలి తప్ప ఆయనను సర్వే చేయించి పెట్టు అని అగడితే ఇప్పుడు లేని వివాదాన్ని రాజేశాడు కదా అని ఒక తెలంగాణవాది ప్రశ్నించారు. ఓడిపోయి అభాసుపాలై రాజకీయ సన్యాసం తీసుకున్న వ్యక్తితో కేటిఆర్ స్నేహం చేసి సిఎం తనయుడిగా ఉన్న స్థాయిని దిగజార్చుకున్నట్లు కాదా అని ఆయన కామెంట్ చేశారు. ఈ వివాదంలో ప్రజా నేతగా ఉన్న కేటిఆర్ కు, సన్యాసం పుచ్చుకున్న లగడపాటికి తేడా లేకుండాపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.

ఏది ఏమైనా ఇప్పుడు లగడపాటి సర్వేల పేరుతో రేపిన చిచ్చు నేల మీదున్న లగడపాటికి నష్టం కంటే.. కుర్చీ మీదున్న కేటిఆర్ కే నష్టం అని మాత్రం తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం మరో 48 గంటల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...