Home Kollywood టాప్ ప్రొడ్యూసర్ చేతికి `సైరా` తమిళ రైట్స్

టాప్ ప్రొడ్యూసర్ చేతికి `సైరా` తమిళ రైట్స్

`సైరా` తమిళ రిలీజ్ కు ఇక ఢోకా లేదు

చ‌రిత్ర మ‌ర‌చిపోయిన వీరుడి క‌థ‌ను చిరంజీవి `సైరా న‌ర‌సింహారెడ్డి`గా వెండితెర‌పై భారీ ఎత్తున ఆవిష్క‌రిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేంద‌ర్ రెడ్డి దర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ ను సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్ బి చౌదరి రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయటంతో తమిళనాట మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమా తమిళ రైట్స్ కు మంచి పోటీ ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆర్ బి చౌదరి మంచి క్రేజ్ రేటుకు ఈ సినిమాని తీసుకున్నట్లు సమాచారం. దాంతో తమిళనాట ఓ రేంజిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మరో ప్రక్క చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తైంది. బాహుబలి, సాహో లాంటి సినిమాల హక్కులను కూడా ‘సైరా’ బ్రేక్ చేసిందని వినపడుతోంది. ‘సైరా’ ప్రీరిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీ రికార్డుగా చెబుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి విష‌యంలో భారీ పోటీ నెల‌కొంది. దీంతో నిర్మాత‌లు ఫ్యాన్సీ రేటు రెండు రాష్ట్రాల థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను అమ్మార‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. బాహుబ‌లి మిన‌హా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి అని స‌మాచారం.

అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సుదీప్.. లాంటి ముఖ్యమైన నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి…. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related Posts

ఎస్పీ బాలు.. పాట బతికినంతకాలం.. పాటలోనే వుంటారు.!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మావాడు.. అని తమిళ సినీ ప్రేక్షకులు.. కాదు, మావాడు.. అని తెలుగు సినీ ప్రేమికులు.. మధ్యలో, 'మావాడు కూడా..' అని బాలీవుడ్.. ఇలా దాదాపుగా అన్ని సినీ పరిశ్రమలూ ఆయన్ని...

పాపం సాయి పల్లవి కవరింగ్ వర్కవుట్ అవ్వట్లేదాయె

హీరోయిన్ సాయి పల్లవి, 'భోళా శంకర్' సినిమాలో నటించాల్సి వుంది.. అదీ, మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో. కానీ, ఆ సినిమాకి ఆమె 'నో' చెప్పింది. మామూలుగా అయితే, ఇలాంటి విషయాల్లో హీరోలు...

ప్రవచనాలెందుకు సామ్.. చైతూపై స్పష్టత ఇచ్చేయొచ్చుగా.?

'గుడికి వచ్చి.. ఏం మాటలివి.? బుద్ధి వుందా.?' అంటూ మీడియా ప్రతినిథిపై గుస్సా అయ్యింది ఇటీవల హీరోయిన్ సమంత. సమంత పేరు పక్కన అక్కినేని ఇంకా అలాగే వుందా.? లేదంటే, అక్కినేని 'ఔట్'...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News