Home TR Lounge Health & Fitness క‌రోనా విష‌యంలో ఇవి తెలుసుకోక‌పోతే... ఇక అంతే సంగ‌తులు?

క‌రోనా విష‌యంలో ఇవి తెలుసుకోక‌పోతే… ఇక అంతే సంగ‌తులు?

ఒక‌ప్పుడు మ‌న దేశం మీద‌కి ఉగ్ర‌దాడి ఉందంటే ప్ర‌భుత్వం అల‌ర్ట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ర‌క ర‌కాల జ‌బ్బులు వేరే దేశాల నుంచి మ‌న దేశాల‌కు వ‌చ్చే ప్ర‌మాదాలు ఎక్కువ‌యిపోయాయి. దీంతో ఈ విష‌యాల పైన కూడా ప్ర‌భుత్వం ఎంతో బాధ్య‌త‌తో అల‌ర్ట్‌గా ఉండాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కొన్ని జ‌బ్బుల పేర్లు విన‌డానికి కూడా విచిత్రంగా ఉంటున్నాయి. ఇక ప్ర‌స్తుతం దేశ‌మంతా హ‌డ‌లిపోయే కొత్త వైర‌స్ ఒక‌టి వ‌చ్చింది. దాని గురించి గ‌త ప‌ది రోజుల నుంచి చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక ఆ వైర‌సే క‌రోనా వైర‌స్‌. ఇది అంద‌రిని క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అత్యంత వేగంగా వ్యాపిస్తోంద‌ట‌. ఈ వైర‌స్ సోకిన త‌ర్వాత వంద‌మంది చ‌నిపోగా… ఒక్క‌రోజులోనే ఏకంగా 50 మంది చ‌నిపోయార‌ని స‌మాచారం. దీన్ని వైర‌స్ వ్యాప్తి వేగం ఎలా ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చ‌ప్ప‌క్క‌ర్లేదు.

ప్ర‌స్తుతం ఈ వైరస్ మ‌న భార‌త‌దేశంలోకి ప్రవేశించింది… దేశంలో ప్రస్తుతం ఒకరికి కరోనా వచ్చినట్లు కన్‌ఫామ్ అయ్యింది. మరొకరికి కూడా వచ్చినట్లుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప్రకటనలతో… కేంద్ర ప్రభుత్వంతోపాటూ… అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ చాలా అలర్ట్ అయ్యాయి. అన్ని ఎయిర్‌పోర్టుల్లో థెర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఐతే… ఈ వ్యాధి వచ్చిన రోగి తుమ్మినా, దగ్గినా పక్కవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం చాలానే ఉంద‌ట‌. అలాగే… రోగి వాడిన వస్తువులపై వైరస్ ఉంటుంది కాబట్టి… ఆ వస్తువుల్ని కూడా టచ్ చేసినా చాలు వైరస్ సోకే ప్రమాదం చాలానే ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక దీని బారి నుంచి ఎలా త‌ప్పించుకోవాలంటే…ప్రతీ ఒక్కరి ముందూ ఉన్న సమస్య. ప్రధానంగా ముక్కూ, నోటి ద్వారానే వైరస్ బాడీలోకి వెళ్తోంది కాబట్టి… ముందుగా ముక్కు, నోటికి మాస్కులు కచ్చితంగా ధరించాలి. అలాగే… బయట ప్రయాణించాక… ఇంటికి వచ్చి సబ్బుతో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానం చెయ్యడం చాలా బెటర్. అంతేకాదు వీలైనంత వ‌ర‌కు ఎక్కువ మంది జ‌న‌తాకిడి ఉన్న రద్దీ ప్రదేశాలకు వెళ్లకపోవడం బెటర్. అంతేకాదు… ఎవరైనా తుమ్మినా, దగ్గినా… వారికి కనీసం రెండు మీటర్ల దూరంలో ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి మొహమాటం ప‌డ్డామా ఇంక అంతే సంగ‌తులు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే… ఆ వైరస్ సోకితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఎంతైన ఉంది.

కరోనా వైరస్ సోకిన తర్వాత… 2 వారాల వ‌ర‌కు ఈ వ్యాధి గురించి మ‌నం గుర్తించ‌లేము. అప్పటివరకూ ఈ వైరస్ బాడీలో ప్రవేశించి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పటివరకూ కరోనా వైరస్‌ని తగ్గించేందుకు వైధ్యులు చేసిన ఏ ప్రయత్నాలూ ఫలించలేదు. పైగా రోగుల సంఖ్య రోజు రోజుకి మ‌రింత రెట్టింపయ్యింది.

ఈ వైరస్‌కి తగిన మందు (వ్యాక్సిన్) తయారీకి కనీసం ఏడాది పట్టొచ్చని తెలుస్తోంది. అప్పటికైనా మందు తయారవుతుంది అన్న గ్యారెంటీ కూడా లేదంటున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ఒక వ్యక్తికి వస్తే… ఆ వ్యక్తి నుంచీ మరో 3 లేదా 4గురు వ్యక్తులకు వ‌చ్చే ప్ర‌మాదం ఎంతైన ఉంది.దీని పైన కేంద్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… ఇండియా ఈ వైరస్‌ని అడ్డుకోగలదన్న నమ్మకం దేశ ప్రజల్లో తక్కువగా ఉంది. చాలా మంది ఈ వైరస్ దేశంలో ఎక్కువగానే వ్యాపిస్తుందని నమ్ముతున్నారు.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

బ‌న్నీ స్టెప్పుల‌కు బాలీవుడ్ బుట్ట‌బొమ్మ కూడా ఫిదా!

బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ దిషా ప‌టాని. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ‌..` పాట‌కు ఫిదా అయిపోయింది. ఈ పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌కు దిషా మెస్మ‌రైజ్...

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్...

మధ్య తరగతి వారే దేశానికి సాయం చేయాలా?

కరోనా కోసం ఎవరికి తోచినంత వారు మానవతా ధృక్పథంతో సాయం చేయాలని కోరుతూ... ప్రధాని నుంచి స్థానిక అధికారుల వరకూ ప్రతి రోజూ విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్, పీఎంఆర్ఎఫ్ అంటూ రోజూ...

ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు...

కరోనా విపత్తులోనూ కుళ్లు రాజకీయాలు మానుకోలేదు!

చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పుతోందా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.....

వీసారే సెటైర్లు కేసీఆర్‌ మీదేనా..!

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.....

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...