Home Entertainment Bollywood కుర్ర‌హీరోల‌ను వ‌ద‌ల‌నంటున్న ముదురు హీరోయిన్‌

కుర్ర‌హీరోల‌ను వ‌ద‌ల‌నంటున్న ముదురు హీరోయిన్‌

‘నా వయసు పెరిగే కొద్దీ నా కంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేస్తాను. పెద్ద వయసువారు చిన్న వయసు వారితో రొమాన్స్ చేయలేరు అన్న అభిప్రాయాన్ని మారుస్తాను. ప్రేమలో పడటానికి వయసుతో సంబంధం లేదు. కావాలంటే ప్రియాంక చోప్రాను చూడండి. తన కంటే పదేళ్లు చిన్న వయసున్న కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను కూడా నాకంటే పదేళ్లు పెద్దవాడైన సైఫ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందులో తప్పు లేదు. అయితే అలాంటి సినిమాలు తీయకూడదు అనుకుంటున్న నిర్మాతల ఆలోచనా విధానంలో మార్పు రావాలి’ అని అంటోంది కరీనా కపూర్. కరీనా కు బాలీవుడ్‌లో ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పెళ్లై, ఓ పిల్లాడికి తల్లైనా కూడా ఓ కుర్ర హీరోయిన్‌కి వచ్చే అవకాశాల కంటే ఎక్కువ ఛాన్సెస్ కరీనాకు వస్తున్నాయి. అయితే ఇక నుంచి తన కంటే చిన్న వయసున్న కుర్ర హీరోలతో రొమాంటిక్, సెక్సీ సన్నివేశాల్లో నటించాలని అనుకుంటున్నట్లు కరీనా చెప్పింది . తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ప్రియాంక చోప్రానే అని అంది .

కరీనా కపూర్‌కి ప్రస్తుతం నలభై ఏళ్లు. ఈమె అక్షయ్ లాంటి హీరోలతో సినిమా చేస్తే ఓకే. కానీ అర్జున్‌ కపూర్‌తో(కీ అండ్‌ కా), సుమీట్‌ వ్యాస్‌ (వీరే డీ వెడ్డింగ్‌) చిత్రాలు చేసింది. ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ…
“ఇటువంటి చిత్రాలు, కథలు, సన్నివేశాలు ఉండడం వెనుక రచయితలు, దర్శకులు, స్టూడియోస్‌, నిర్మాతలు ఉన్నారు. వారంతా ప్రస్తుతం మార్పు కోరుకున్నారు. ప్రియాంక చోప్రా తనకంటే చిన్న వయస్సు ఉన్న నిక్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. నేను, నా కంటే ఎక్కువ వయస్సు ఉన్న సైఫ్‌ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇదే ఈ దర్శక నిర్మాతలకు స్ఫూర్తి. నా వయసు వాళ్లు యువ హీరోలతో రొమాన్స్‌ చేయడంలో తప్పేముంది? ఈ మార్పు మంచిదే. ఈ మార్పు నా మనసులో నుంచి వచ్చింది కాదు. అది నిర్మాతలు కావాలని కోరుకున్నదే” అని చెప్పింది.

అక్షయ్ కుమార్‌తో కరీనా కపూర్ నటించిన ‘గుడ్ న్యూస్’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె ఆమిర్ ఖాన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. దీంతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ సినిమాలోనూ నటించనున్నారు.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...

రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో...

నీ విరాళం వద్దుపో..!? చిత్తూరు జిల్లాలో రాజకీయాల పర్యవసానం!

ఇప్పుడు జరుగుతోంది ఎన్నికలు కాదు, గెలుపు ఓటముల ఆరాటం కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య సిబ్బంది.. పోలీసులు ఇలా ప్రతి ఒక్కరు చేస్తోన్న పోరాటం. ఈ పోరాటంలో ప్రభుత్వానికి...

పాపం బాబు! విరాళం ఇచ్చినా విలువ లేకుండా పోయే?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా అదో వివాదాస్పదమే అయిపోతోంది. చివరికి కరోనా కట్టడికి ప్రభుత్వానికి తన వంతుగా ఆయన ఇచ్చిన రూ.10లక్షల సాయంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనేమో తెలంగాణలో...

గాయ‌ని స‌్మిత‌ ఆస్ట్రాల‌జీ వివాదం కాదుక‌ద‌!

మంచి చెబితే చెడు జ‌రిగే రోజులివి. జ‌నానికి మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ విష‌యంలో ఆచి తూచి వ్యంహ‌రించాల్సి వుంటుంది. మ‌న‌కు తెలుసుక‌దా అని జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా చెబితే అది మొద‌టికే మోసం...