Home Politics కరణంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు

కరణంతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు

చంద్రబాబునాయుడు దగ్గర కరణం బలరామ్ మాట చెల్లుబాటవుతుందా అన్న సందేహాలు జిల్లాలో బాగా చక్కర్లు కొడుతున్నాయ్.  లేకపోతే కరణంతో కొత్త తలనొప్పులు మొదలవుతాయా అన్న విషయంపైన కూడా పార్టీలో చర్చ మొదలైంది. తాజా రాజకీయ పరిణామాల్లో కరణం చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో కర్చీఫ్ వేశారు.  చాలా కాలంగా కరణం ఏమి చెప్పినా చంద్రబాబు దగ్గర చెల్లుబాటు కావటం లేదు. సొంత నియోజకవర్గం అద్దంకిలోనే కరణం మాట ఎవరూ వినటం లేదు. మొత్తం ప్రయారిటీ అంతా ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ దే కావటంతో పార్టీ నేతలు, ఉన్నతాధికారులు కూడా గొట్టిపాటి మాటకే విలువిస్తున్నారు. దాంతో కరణం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా జరిగారు.

జిల్లాలోనే సీనియర్ నేత అయిన కరణంకు నిజంగా పార్టీలో పరిస్ధితులకు ఎదురీదుతున్నారు. సీనియర్ నేతల్లో చాలామంది కరణంతో పెద్దగా మాట్లాడటం లేదు. దాంతో జిల్లాలోని అధికారులు కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కరణం పార్టీలో ఇమడలేని పరిస్ధితుల్లోనే నెట్టుకొస్తున్నారు. దాంతో ఏదో ఓ రోజు కరణం టిడిపి నుండి బయటకు వెళ్ళిపోవటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపధ్యంలోనే చీరాల ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ టిడిపికి రాజీనామా చేశారు. దాన్ని కరణం అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

గొట్టిపాటి ఉన్నంత వరకూ తనకు అద్దంకిలో చంద్రబాబు టికెట్ ఇవ్వరని కరణంకు అర్ధమైపోయింది. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితుల్లో కరణం అవస్తలు పడుతున్నారు. ఇటువంటి పరిస్ధితుల్లోనే ఆమంచి పార్టీని వీడటంతో చీరల నియోజకవర్గంపై కరణం కన్నేశారు. అందుకే చంద్రబాబు టికెటిస్తే చీరాలలో పోటీ చేయటానికి తాను రెడీ అంటూ ముందుగా ఓ ప్రకటన పడేశారు. చంద్రబాబు టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది వేరే విషయం. అద్దంకిలో టికెట్ సాధ్యం కానపుడు చీరాలలో అయినా టికెట్ ఇవ్వకపోతారా అన్నది కరణం ఆశగా కనిపిస్తోంది. మరి కరణం ఆశను చంద్రబాబు ఎంత వరకూ నెరవేరుస్తారో చూడాల్సిందే.

 

 

అత్యంత ప్రజాధారణ

తెలుగురాజ్యం ప్రత్యేకం

తాజా వార్తలు

పవన్ హీరోయిన్ పై ఛీటింగ్ కేసు

అమీషా పటేల్ గుర్తుందా.. అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన “బద్రి”, మహేష్ బాబుకు జతగా నాని సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్.   గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ...

బోయపాటి కు బాలయ్య 2 కండీషన్స్..ఒప్పుకుంటేనే సినిమా

సినిమా హిట్ అయితే తదుపరి సినిమాకు ఎన్ని డిమాండ్స్ చేసినా సెలంట్ గా భరిస్తారు నిర్మాత, హీరో. ఎందుకంటే తమకు ఆ రేంజి హిట్ ఇస్తాడనే నమ్మకంతో. అదే ప్లాఫ్ అయితే సీన్...

తల్లికి దాహం తీర్చలేదు గాని పినతల్లికి పట్టు చీరనా?

  (వి. శంకరయ్య)   అన్న దాత సుఖీభవ తంతు ఇలాగే వుంది.        రైతు రుణ మాఫీపథకం దిక్కు మొక్కు లేకుండా పడి వుంది. రెండు కంతులు ఎపుడు ఇస్తారని రైతులు ఎదురు చూస్తుంటే దానిని పట్టించుకోకుండా ‘అన్న...

రిలీజ్ కాకముందే రచ్చ వద్దని వారించిన మోహన్ బాబు

లక్ష్మీస్  ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుంచీ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా గురించే చ‌ర్చ న‌డుస్తోందనటంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికికి ఎన్టీఆర్ క‌థానాయకుడు విడుద‌లైన‌పుడు కూడా ఇంత‌గా చ‌ర్చ...

‘యన్‌టిఆర్‌ – మహానాయకుడు’ ట్రైలర్

‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు, మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మహానాయకుడు వచ్చేసాడు.  నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్‌’....

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు కోటి వ్యూస్..వెనక సీక్రెట్ ఇదే

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం...

రకుల్ రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

సిని పరిశ్రమలో లెక్కలు క్రేజ్ ని బట్టే ఉంటాయి. హిట్ పడితే ఓవర్ నైట్ లో రెమ్యునేషన్ రెట్టింపు అవుతుంది. ప్లాఫ్ వస్తే ..అడ్వాన్స్ లు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయమంటారు. అంతా...

రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన: గల్లీ బాయ్ (మూవీ రివ్యూ)

16.2.19 రివ్యూ స్లమ్ డాగ్ కళా విజయం!  ‘గల్లీబాయ్’ దర్శకత్వం : జోయా అఖ్తర్  తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు  రచన : జాయా...

తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ అమ్మాయి

 హైదరాబాద్ లో దారుణం జరిగింది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ లో ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25)   శనివారం ఆత్మహత్య కు పాల్పడింది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న...

జవాన్ల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు 

ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుదని...