fbpx
Home Cinema కామెడీతో కేక : 'జుమాంజీ - ది నెక్ట్స్ లెవెల్' తెలుగు ట్రైలర్ రివ్యూ!

కామెడీతో కేక : ‘జుమాంజీ – ది నెక్ట్స్ లెవెల్’ తెలుగు ట్రైలర్ రివ్యూ!

కామెడీతో కేక : ‘జుమాంజీ – ది నెక్ట్స్ ది లెవెల్’ తెలుగు ట్రైలర్ రివ్యూ!

హాలీవుడ్ ‘జుమాంజీ- ది నెక్ట్స్ ది లెవెల్’ తెలుగు డబ్బింగ్ ట్రైలర్ వచ్చేసింది! అత్యంత ఫన్నీగా, వెంటనే మూవీ చూడాలన్పించేలా వుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ కామెడీ 2017 లో వచ్చిన ‘జుమాంజీ – వెల్కం టు ది జంగిల్’ కి సీక్వెల్. యాక్షన్ స్టార్ డ్వేన్ జాన్సన్ తో ఇది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద హిట్టయ్యింది. ఒరిజినల్ గా 1995 లో ‘జుమాంజీ’ నిర్మించారు. 1981 లో ఇదే పేరుతో వచ్చిన పాపులర్ నవల దీనికాథారం. జో జాన్సన్ దర్శకుడు. రాబిన్ విలియమ్స్ హీరో. ఇందులో ఇద్దరు పిల్లలు మ్యాజిక్ బోర్డ్ గేమ్ ఆడతారు. గేమ్ ఆడుతూ అందులో దశాబ్దాలుగా బందీగా వున్న ఒక దుష్టుడ్ని విడుదలచేసి ప్రమాదంలో చిక్కుకుంటారు. తిరిగి వాడ్ని బంధించాలంటే గేమ్ ని పూర్తి చేయాలి…ఇదీ కథ. ఈ ఫాంటసీ అడ్వెంచర్ అప్పట్లో పెద్ద హిట్టయ్యింది.

దీన్ని 2015 లో సోనీ సంస్థ రీమేక్ చేయాలనుకుని భారీ ఎత్తున విమర్శలనెదుర్కొంది. దీంతో 2016 రీమేక్ ప్రయత్నం విరమించుకుని, సీక్వెల్ ప్రకటించింది. 2017 లో ‘జుమాంజీ’ సీక్వెల్ గా ‘జుమాంజీ – వెల్కం టు ది జంగిల్’ ని విడుదల చేసింది. దీనికి జేక్ కాస్డాన్ దర్శకుడు, డ్వేన్ జాన్సన్ హీరో, ఇందులో నల్గురు టీనేజర్స్ మ్యాజిక్ వీడియో గేమ్ ఆడుతూంటే, ఆ గేమ్ వాళ్ళని తనలోకి లాగేసుకుంటుంది. బయటపడాలంటే గేమ్ పూర్తి చేయాలి…ఇదీ కథ. ఇదీ మన తెలుగు డబ్బింగ్ సహా పెద్ద హిట్టయ్యింది.

‘జుమాంజీ’ ఫ్రాంచైజ్ ప్రపంచ వ్యాప్తంగా ఇంత హిట్టవడానికి కారణం ఇవి బాలల్ని కూడా బాగా ఆకర్షించి, అలరించి, ఫుల్ రేంజిలో ఆనందింప జేయడమే. పెద్దలతో సహా పిల్లల్ని ఆకర్షించే సినిమాలు హాలీవుడ్ నుంచే వస్తాయి. తెలుగులో చచ్చినా రావు. స్టార్స్ కి లేనిపోని పెద్ద పెద్ద ఇమేజులు, ఇగోలు. ‘సాహో’ లాంటి వాటితో సెలబ్రేషన్స్.

ఇప్పుడు రెండో సీక్వెల్ ‘జుమాంజీ- ది నెక్ట్స్ ది లెవెల్’ తిరిగి జేక్ కాస్డాన్ దర్శకత్వంలో, డ్వేన్ జాన్సన్ హీరోగా రాబోతోంది. దీని తెలుగు ట్రైలర్ చూస్తే, తెలుగు సినిమాలు బలాదూర్ అనేలా వుంది. గత సీక్వెల్ కి మించి టైటిల్ కి తగ్గట్టే నెక్స్ట్ లెవెల్ గా వుంది. ఇందులో మిత్రులు తప్పిపోయిన తమ మిత్రుడి కోసం మళ్ళీ గేమ్ లోకి వస్తారు. ఈసారి గేమ్ దిమ్మదిరిగేలా మారిపోయి వుంటుంది. తమ అవతారాలే వింతవింతగా మారిపోతాయి. ఐయాం సారీ నేను తోసుకొచ్చేశాను, నువ్వు కాదు అతను  తోసుకొచ్చాడు, నీకేమైనా మైండ్ దొబ్బిందా, దీని సిగదరగా, నీ మొహం చెత్తగా పెట్టకురోయ్, అసలిదేంటి, నీ బలాలు బలహీనతలు, భావనలు తీవ్రంగా వుంటాయా, నేనొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను – జుమాంజీ అంటే ఎవరు, అతను బార్బరా వాళ్ళ అబ్బాయా… వంటి ఫన్నీ డైలాగులతో అష్ట కష్టాలూ పడుతూంటారు హీరోలు, హీరోయిన్. వింత వింత జీవులు వెంటాడతాయి, మీదపడతాయి. ఎడారుల్లోంచి మంచు పర్వతాల దాకా పరుగోపరుగు!

నటుల కామెడీ స్కిల్స్ బాగా నవ్విస్తాయి… గ్రాఫిక్స్, మ్యూజిక్ సూపర్ క్లాస్. ట్రైలర్ సూపర్ హిట్. కానీ ఈ పైసావసూల్ మెగా ఎంటర్ టైనర్ ని బిగ్ స్క్రీన్ మీద తెలుగులో చూడాలంటే, డిసెంబర్ 13 దాకా ఆగాల్సిందే!

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ