fbpx
Home Podcast రాజకీయాలపై మనసు విప్పి మాట్లాడిన జెసి దివాకర్ రెడ్డి (ఇంటర్వ్యూ ఆడియో )

రాజకీయాలపై మనసు విప్పి మాట్లాడిన జెసి దివాకర్ రెడ్డి (ఇంటర్వ్యూ ఆడియో )

జెసి దివాకర్ రెడ్డి ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ఎందుకంటే ఏపీ రాజకీయాలలో ఆయనో సంచలనం. ఏ మాటనైనా నిర్మొహమాటంగా చెప్పటం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న ఆయన 2014లో టిడిపిలో చేరి అనంతపురం ఎంపీగా గెలిచారు. జెసి దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన స్టైల్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. టిడిపి అవిశ్వాసం పెడితే దానిలో పాల్గొననని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి ఈ మధ్య చర్చనీయాంశమయ్యారు జెసి దివాకర్ రెడ్డి. తాజా రాజకీయ పరిణామాలపై జెసి దివాకర్ రెడ్డి తెలుగురాజ్యం ప్రతినిధి గణపతితో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… తెలుగు రాజ్యంతో జెసి చేసిన సంభాషణను మీరూ వినండి.

ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచన లేదని ప్రజాస్వామ్యంలో విలువలు తగ్గిపోయాయన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందన్నారు. ఈ దేశంలో సీఎం, పీఎంలే ముఖ్యులయ్యారని వారే రాజులుగా, మహారాజులుగా వెలుగుతున్నారని విమర్శించారు. అమెరికాలోని అధ్యక్ష తరహా విధానం రావాలని ఆయన అన్నారు. సీఎం, పీఎం తప్ప మిగిలిన వారంతా ఆటబొమ్మలయ్యారని జెసి దివాకర్ రెడ్డి విమర్శించారు.

తమ కుటుంబానికి నీడనిచ్చింది  కాంగ్రెసేనని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ద్రోహం చేసిందని ఆయన దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కు 10 నుంచి 15 సీట్లు వస్తాయోమో కానీ అతనికి కులాన్ని అంటగట్టే అవకాశం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అరిగిపోయిన రికార్డు  అని ఎద్దేవా చేశారు. తన నాన్న పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారని జెసి విమర్శించారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్నాడని, నేనెప్పుడు అతనిని ఎంకరేజ్ చేయనని జెసి తెలిపారు.

 చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తారని జెసి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలున్నా వ్యవసాయానికి చంద్రబాబు బాగా ప్రాధాన్యత  ఇస్తున్నారని అందుకే ప్రజలు చంద్రబాబును గుర్తించగలిగారని జెసి అన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు టిడిపి మంచి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జగన్ రెడ్డి పేరుతో రాజకీయం చేయాలని చూస్తున్నారని అది పనికిరాదని జెసి అన్నారు. ఇంకా ఆయన తన మాటల్లో చెప్పిన ఇంటర్వ్యూ విషయాలను ఆడియో టేపులో (పాడ్ కాస్టు) మీరే వినండి

తెలుగురాజ్యం ప్రత్యేకం

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్ళారు ? వేగంగా మారిపోతున్న పరిణామాలు

చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ  రాజకీయం కూడా...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

బెట్టింగ్ రాయళ్ళు నిండా ముణగటం ఖాయమేనా ?

చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు...

‘సాహో’ఫైట్‌ లో కారు ఎలా నుజ్జైందో చూడండి! (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా...

లారెన్స్ బాగా హర్ట్ అయ్యాడు, అక్షయ్ సినిమాకి బై

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’.తమిళ, తెలుగు భాషల్లో హిట్ అయిన ‘కాంచన’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ద్వారా రాఘవ లారెన్స్...

‘మహర్షి’సక్సెస్ మీట్ : నటుడు, ఆర్జే హేమంత్‌ కారు ప్రమాదం

మే 18వ తేదీ శనివారం రాత్రి విజయవాడలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. అభిమానుల కోలహలం, నటీనటుల మధ్య మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి...

సెక్స్ కంటెంట్ పై బ్యాన్ పెడితే ఇంకా రెచ్చిపోతారంటోంది

అడల్ట్ కంటెంట్ కు అడ్డాగా మారిన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తన మాటలు కూడా అదే స్దాయిలో ఉండేలా చూసుకుంటుంది. అడల్ట్ సీన్స్ కు హైయిస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఆమె సినిమాలు...

మహేష్ అయితేనేం…నేను తగ్గను, అంత ఇవ్వాల్సిందే

మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి అన్ని సెంటర్లలోనూ కలెక్షన్స్ లో కుమ్మేస్తోంది. దాంతో అందరి దృష్టీ మహేష్ చేయబోయే తదుపరి చిత్రంపై ఉంది. ఇప్పటికే మహేష్ ...అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయటానికి...

రాజశేఖర్ కు కోపం వచ్చినా, కంట్రోలు చేసుకుని ఓకే

‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌ తాజాగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. నాని నిర్మించిన అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి...

సంచలనం : ఇద్దరిపైనా లుకౌట్ నోటీసుల జారీ

తెలంగాణా సైబర్ క్రైం పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న టివి9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలు దేశం వదిలి పారిపోకుండా ముందుజాగ్రత్తగా లుకౌట్ నోటీసులు...

19 సాయంత్రం కోసం ఎదురుచూస్తున్నారా ?

దేశవ్యాప్తంగా జనాలందరూ 19వ తేదీ అంటే శనివారం సాయంత్రం 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల కోసం ఎందుకు ఎదురుచూస్తున్నట్లు ? ఎందుకంటే, ఎగ్జిట్ పోల్స్...

రీ పోలింగ్ పై కోర్టుకెక్కిన టిడిపి..చంద్రబాబులో  టెన్షన్ ?

రాష్ట్ర చరిత్రలో ఇంత వరకూ జరగని విచిత్రానికి తెలుగుదేశంపార్టీ పాల్పడింది.  రీ పోలింగ్ కు ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఆదేశాలపై టిడిపి కోర్టును ఆశ్రయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు...
 Nate Gerry Jersey