Home TR Lounge Special Articles జమలాపురంలో శ్రీ వెంకటేశ్వరస్వామి చ‌రిత్ర ఏంటంటే?

జమలాపురంలో శ్రీ వెంకటేశ్వరస్వామి చ‌రిత్ర ఏంటంటే?

వెంక‌టేశ్వ‌ర‌స్వామి అన‌గానే ముందు మ‌న‌కు గుర్తు వచ్చేది తిరుమ‌ల తిరుప‌తి దేవాల‌యం. భ‌గ‌వంతుడు భ‌క్తుల కోరిక మేర‌కు అన్ని చోట్లా ఉంటాడు అని చెప్పుకుంటారు. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం. ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్న‌ కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. దాంతో ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ మ‌న పూర్వీకులు చెబుతుంటారు.

స్ధల పురాణం ప్రకారం జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో కూర్చుని త‌ప‌స్సు చేసేవారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ. శ్రీరాముడు భార్య, తమ్ముడితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి రాముడిమీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకు రావటానికి చాలా ప్రయత్నించాడు. తండ్రి ఆజ్ఞ పాలించాలనే శ్రీరాముడి దృఢ సంకల్పంతో, చేసేదిలేక వెనుతిరిగిన జాబాలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో తీర్ధయాత్రలు సేవిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి సూచీగిరి మీద తపస్సు చేసుకున్నాడని చెబుతారు.

అయితే ఈ సూచీగిరి మీద రెండు గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో ఆయ‌నే స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు. శ్రీహరి వెలిసిన గుహ కనుక అది వైకుంఠ గుహ అయింది. దశరధ మహారాజు ఆస్ధానంలోని జాబాలి మహర్షి ఏమిటి, వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చెయ్యటం ఏమిటి వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు కదా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? వెంకటేశ్వరస్వామి కృతయుగంలోనే వెలిశాడనీ, శ్రీరామచంద్రుడు నారాయణాచలములోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నాడని వరాహ పురాణ కధనం ఒకటి ఉంది.

ద్వాపర యుగంలో అర్జనుడు పాశుపతాస్త్రంకోసం ఈ సూచీగిరికి తూర్పున వున్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు అర్జనుని శక్తి సామర్ధ్యాలు పరీక్షించాలని మూకాసురుణ్ణి వరాహ రూపంలో పంపించటం, మూకాసురుడి మీద అర్జనుడూ, శివుడూ వేసిన బాణాలు ఒకేసారి తగలటంతో వారిద్దరి మధ్యా జరిగిన వాగ్వివాదంలో అప్పుడు శివుడు అర్జనుణ్ణి మెచ్చుకుని పాశుపతం అనుగ్రహించాడు. బాణాలు తగిలి మూకాసురుడు అదృశ్యుడైన చోటే శ్రీ వెంకటేశ్వరస్వామి వెలసిన గుహ అంటారు. పార్వతీ పరమేశ్వరులు వున్న ప్రదేశం కైలాస గుహ అని ఒక కధనం. జాబాలి మహర్షి తపోదీక్షతో ప్రసిధ్ధమైన ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన అనేకమంది అనేక విధాల శాప విముక్తులయ్యారనే కధలు కూడా అనేక‌మున్నాయి. అయితే కాల ప్రభావంవల్ల ఈ తీర్ధం ప్రస్తుతం అంతరించిపోయింద‌ని చెప్పుకుంటారు.

Recent Posts

30 ఇయర్స్ పృథ్వీ ఇప్పుడు ఏం చేస్తురో తెలుసా?

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ‌ ఏమైపోయారు, ఎక్కడున్నారు? తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనను దూరం పెట్టిందా? ఆయన చేసిన ఓ చిన్న తప్పిదానికి రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసిపోయిందా..? తెలుగు సినీ...

‘ఆపరేషన్ నమస్తే’ రంగంలోకి దిగిన ఆర్మీ.. ఏం చేయబోతోంది?

ప్రపంచ దేశాలను వణికిస్తూ విలయ తాండవం చేస్తోన్న కరోనా కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటిచగా ఇప్పుడు ఆర్మీని రంగంలోకి దింపింది. 'ఆపరేషన్ నమస్తే' పేరిట కరోనాపై యుద్ధనికి...

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం..?!

క‌రోనా ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయం సహా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డ విషయం విధితమే. అయితే భక్తులకు దర్శనాన్ని ఆపేసినా తిరుమలలో స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు మాత్రం యథావిధిగా...

మాస్ట‌ర్ మైండ్ ఎందుకు ఫెయిల‌య్యాడు?

ఇండ‌స్ట్రీలో వున్న నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ అన్న విష‌యం తెలిసిందే. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని అయినా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో అల్లు అర‌వింద్‌ని మించిన వారు లేర‌న్న‌ది ఇండస్ట్రీ వ‌ర్గాల...

ప్ర‌దీప్ మాచిరాజు మళ్లీ మొద‌లుపెట్టాలా?

ప్ర‌దీప్ మాచిరాజు.. బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌. ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో ప్ర‌దీప్ త‌న పేరే వినిపించేలా చేసుకున్నాడు. అయితే బుల్లితెర‌పై క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్ర‌దీప్‌కు వెండితెర‌పై ఆక‌ట్టుకోవాల‌నే ఆశ మొద‌లైంది. దీంలో...

మ‌నోజ్‌కు విష్ణు ఇచ్చిన స‌ల‌హా ఏంటీ?

హీరో మంచు మ‌నోజ్ ఇటీవ‌ల అత‌ని భార్య‌తో విడిపోయాడు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌డానికి చాలానే స‌మ‌యం తీసుకున్నాడు. వ‌రుస పుకార్ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న భార్య‌తో విడిపోయిన‌ట్టు వెల్ల‌డించాడు. ఆ...

భ‌ళా రాజ‌మౌళి భ‌ళా…ఎవ్వ‌రినీ తగ్గించ‌లేదే!

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కి ప్ర‌ధాన అడ్డంకి ఇద్ద‌రు హీరోల‌కు స‌మ ప్రాధాన్య‌త‌. కథ డిమాండ్ చేసినా చేయ‌కపోయినా ఇద్ద‌రు హీరోల్లో ఏ ఒక్క‌రికీ ప్ర‌ధాన్యం పెర‌గ‌కూడ‌దు త‌గ్గ‌కూడ‌దు. పెరిగితే త‌గ్గిన హీరో ఫ్యాన్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటోన్న చంద్రబాబు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి మరోసారి రుజువవుతోంది. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఎప్పుడు ఎవరిని ఎటువైపుకి నడిపిస్తాయో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయో ప్రస్తుతం మాజీ...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

కేసీఆర్ మాటల ఆంతర్యం అదేనా?

ప్రస్తుత కష్టకాలంలో తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించకుండా చూసే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజల, విద్యార్థులను కూడా కాపాడుకుంటామని పెద్ద మనసు చాటుకునన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏ...

Featured Posts

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

షాకింగ్‌…. క‌ర్ఫ్యూ మొత్తం 21 రోజులు… క‌రోనా క‌ట్ట‌డికి ఇదే మార్గం..!

వేలాది మందిని నిలువునా పొట్ట‌పెట్టుకుంటున్న క‌రోనా దెబ్బకు ప్ర‌పంచం మొత్తం మూత‌బ‌డుతోంది. దేశ దేశాల‌న్నీ విధిలేక క‌ర్ఫ్యూ విధిస్తున్నాయి. భార‌త్‌లో ఇప్ప‌టికే వారం రోజుల పాటు పూర్తిగా ర‌వాణా నిలిపివేశారు. దాదాపు 75...