స్పానిష్ ప్లూని..క‌రోనాని ఆటాడేసిన 113 అవ్వ‌

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచంలో ఎక్కువ‌గా మృత్యువాత ప‌డింది వృద్ధులు, చిన్నారులే. రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండటం, వ‌య‌సు ముద‌ర‌డంతో త‌లెత్తే సాధార‌ణ స‌మ‌స్య‌లు కార‌ణంగా వృధుల‌పై కొవిడ్-19 అధిక ప్ర‌భావం చూపిస్తోంది. అవ్వ‌ల‌కు, తాత‌ల‌కు క‌రోనా సోకిందంటే? ఆ కుటుంబంలో భ‌యాన‌క పరిస్థితులే. తిరిగి కోలుకోవ‌డం ఆసాధ్యంగా మారుతోంది. కొవిడ్-19 చికిత్స‌లో పాజిటివ్ నుంచి నెగిటివ్ కు రావ‌డ‌మంటే కార‌ణ జ‌న్ములే. తాజాగా 113 ఏళ్ల భామ ప్ర‌పంచాన్ని ఒణికిస్తోన్న క‌రోనాని జ‌యించి ఔరా అనిపించింది. క‌రోనాని ఎదురీదిన అతి పెద్ద‌ వ‌య‌స్కురాలిగాను చ‌రిత్ర‌లోకి ఎక్కింది.

ఆమె పేరు మ‌రియా. స్పెయిన్ కి చెందిన వృద్ధురాలు. ఏప్రిల్ లో మ‌రియా కొవిడ్-19 భారిన ప‌డింది. వ‌య‌సు ఎక్కువ‌..ఎలా బ్ర‌తికి బ‌ట్ట క‌డుతుందోన‌ని డాక్ట‌ర్లు సైతం కంగారు ప‌డ్డారు. ఓల్డేజ్ కేర్ హోంలో ఉంటున్న ఆమెను అధికారులు అక్కడే ఐసోలేషన్‌లో ఉంచారు. డాక్ట‌ర్లు త‌రుచూ వ‌చ్చి మందులిచ్చి వెళ్లేవారు. దాదాపు నెల రోజుల‌గా వైర‌స్ పోరాడి చివ‌రికి గెలిచింది. కోవిడ్ -19 ప‌రీక్ష‌లో పాజిటివ్ నుంచి నెగిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం చిన్న పాటి ఒళ్లు నొప్పులు త‌ప్ప ఇంకేం లేవ‌ని ఆ భామ సంతోషంగా చెప్పింది. మ‌రో విశేషం ఏంటంటే ఆ అవ్వ స్పెయిన్ లో నే అత్యంత వృద్దిరాలిగా రికార్డు ఉంది.

అంతేనా మ‌రియా పేరిట మ‌రో రికార్డు కూడా ఉంది. 1918-19 లో ప్ర‌పంచాన్ని క‌రోనా కంటే మందుగానే గ‌డ‌గ‌డ‌లాడించిన స్పానిష్ ప్లూని ఆ అవ్వ త‌ట్టుకుంది. అయితే మ‌రియా కంటే ముందే 106 ఏళ్ల భామ కూడా క‌రోనా జ‌యించింది. ఇప్పుడా రికార్డును మ‌రియా చెరిపేసింది. చాప‌కింద నీరులా వ్యాపించిన క‌రోనా ఇప్పుడు భార‌త్ ని ఒణికిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మూడు ద‌శ‌ల లాక్ డౌన్ పూర్తి కావ‌చ్చొంది. నాలుగో ద‌శ‌కు రెడీ అవుతున్నాం. అయితే ప్ర‌పంచ దేశాలు క‌న్నా భార‌త్ క‌రోనాని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కుంటుంది. ఆవిష‌యంలో ప్ర‌చంచ దేశాల‌కు భార‌త్ ఆద‌ర్శంగా నిలించింది.