క‌రోనా కేసుల్లో చైనాను దాటేసిన భార‌త్

Covid - 19

క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్ లో పంజా విసురుతోంది. నానాటికి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక‌వైపు కేంద్రం సడ‌లింపులు ఇస్తోన్న నేప‌థ్యంలో మ‌హమ్మారి అంతంక‌త‌కు విజృంభిస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల్లో భార‌త్ డ్రాగ‌న్ దేశం చైనాను మించిపోయింది. వైర‌స్ వ్యాప్తి పురిట గ‌డ్డ‌ను వ‌దిలి ప‌రాయి గ‌డ్డ‌పై పగ తీర్చుకుంటోంది. నిన్న ఒక్క‌రోజే దేశంలో 3970 కేసులు న‌మోదయ్యాయి. ప్ర‌స్తుతం చైనాలో క‌రోనా కేసుల సంఖ్య 82,900 ఉండ‌గా, భార‌త్ లో 85,940 కి కేసులు న‌మోదవ్వ‌డంతో భారత్ చైనాను ప‌క్క‌కు  నెట్టేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు న‌మోదైన దేశాల్లో భార‌త్ 11వ స్థానంలో ఉండ‌గా, చైనా 13వ స్థానంలో ఉంది. మ‌ర‌ణాల్లో మాత్రం మ‌న‌క‌న్నా చైనా ముందు వ‌రుస‌లో ఉంది. భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కూ కొవిడ్ -19 తో 2753 మంది మృతి చెంద‌గా చైనాలో 4633 మంది కోల్పోయారు. చైనా త‌ర్వాత ఎక్కువ జ‌నాభాను క‌లిగి భార‌త్ వైర‌స్ ని క‌ట్ట‌డి చేయ‌డంలో ఇక్క‌డ‌ వ్యూహం ఫ‌లించి ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలించింది. మరోప‌క్క అమెరికా, ఇట‌లీ, స్పెయిన్ వంటి దేశాల్లో మ‌హ‌మ్మారి భారిన ప‌డి ల‌క్ష‌లాది మంది చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ అక్క‌డ వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది.

అయితే వైర‌స్ పుట్టి పెరిగిన చైనాలో మాత్రం కేసుల సంఖ్య‌ను, మృతుల సంఖ్య‌ను దాచిపెట్టింద‌ని ప్ర‌పంచ దేశాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ ను క‌నిపెట్టి ప్ర‌పంచ దేశాల మీద‌కు పగ తీర్చుకోమ‌ని చైనా వ‌దిలిందని అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర్రంగా ఆరోపిస్తుంది. ప్ర‌పంచంలో సంభ‌విస్తోన్న మ‌ర‌ణాల‌న్నింటికీ ఐకాస వేదిక‌గా చైనా బ‌ధులివ్వాల్సిందేన‌ని ట్రంప్ శివ‌తాండ‌వం ఆడేస్తున్నాడు. ఇప్ప‌టికే ఐక్య‌రాజ్య స‌మితికి చైనా నుంచి వెళ్లే నిధులు ఆపేసిన‌ట్లు కూడా ఆ దేశం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.