బంక‌ర్లోకి భ‌య‌ప‌డి కాదు చూద్దామ‌ని అంట‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే వ్యాఖ్య‌లు ఎంత ఆస‌క్తిక‌రంగా ఉంటాయో !అప్పుడ‌ప్పుడు గ‌మ్మ‌త్తుగా నూ…హాస్యాస్ప‌దం గాను ఉంటాయి. మొన్న‌నే ఆందోళ‌న కారుల‌కు భ‌య‌ప‌డి ట్రంప్ ర‌క్ష‌ణ క‌వ‌చంగా నిలిచే బంక‌ర్లో దాక్కున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌పంచం యుద్ధం త‌లెత్తిన‌ట్లు..ట్రంప్ మీద తీవ్ర‌వాదులు దాడి చేస్తున్న‌ట్లు మ‌రీ భ‌య‌ప‌డిపోయి బంకర్లో దాక్కోవ‌డం ఏంట‌ని సోష‌ల్ మీడియా కామెంట్లు అదే స్థాయిలో ప‌డ్డాయి. మ‌రి ఇప్పుడు ట్రంప్ ఏమ‌నుకున్నారో? ఏమోగానీ త‌న భ‌యాన్ని క‌వ‌ర్ చేసి మ‌రోసారి న‌వ్వించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రువు పోయింద‌ని భావించారో ఏమా గానీ బంక‌ర్లోకి భ‌య‌ప‌డి వెళ్ల‌లేదు.

బంక‌ర్ ఎలా ఉందో జ‌స్ట్ చూసొద్దామ‌ని వెళ్లాన‌ని భ‌యాన్ని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేసారు. అదీ కూడా ప‌గ‌టి పూటే వెళ్లానన్నారు. అదే రాత్రి పూట అయితే భ‌యంతో వెళ్లాను అనుకోవ‌చ్చు. కానీ వెళ్లింది ప‌గ‌లే కాబ‌ట్టి భ‌యలాంటింది కాదంటూ చెప్పుకొచ్చారు. అలా వెళ్ల‌డం ఇది తొలిసారి కాద‌ని..గ‌తంలోనూ రెండు, మూడు సార్లు బంక‌ర్లోకి వెళ్లిన‌ట్లు తెలిపారు. అలాగే త‌న‌పై వ‌చ్చిన క‌థ‌నాల‌ను, సెటైరిక‌ల్ వార్త‌ల్ని చ‌దివి న‌వ్వుకున్నాన‌న్నారు. త‌న‌ ద‌గ్గ‌ర వ‌ర‌కూ వ‌చ్చి ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేర‌ని త‌న‌దైన శైలిలో చెప్పే ప్ర‌యత్నం చేసారు. ఆఫ్రో అమెరిక‌న్ జార్జ్ ప్లాయిడ్ మృతిపై అమెరికా నిర‌స‌న‌ల‌తో అట్టుడుకిన సంగ‌తి తెలిసిందే.

ఆందోళ‌న‌కారులు బారికేడ్ల‌కు నిప్పు అంటించి లోప‌లికి వెళ్లే ప్ర‌య‌త్నం చేసారు. దీంతో ప్రెసిడెన్షియ‌ల్ ఎమెర్జెన్సీ ఆప‌రేష‌న్స్ సెంట‌ర్ గా పిలిచే బంక‌ర్ లోకి ట్రంప్ ని తీసుకెళ్లారు ర‌హ‌స్య భ‌ద్ర‌తా సిబ్బంది. సాధార‌ణంగా ఉగ్ర‌దాడులు..ప్ర‌పంచ యుద్ధాల‌ స‌మ‌యంలో ఇలాంటి ఘ‌ట్టాలు చోటు చేసుకుంటాయి. కానీ ట్రంప్ చిన్న ఆందోళ‌న‌కే బంకర్లోకి వెళ్ల‌డంతో అమెరికా మీడియా సంస్థ‌లు ప్ర‌చారంతో ఠారెత్తించాయి. శ్వేత‌సౌథం తూర్పు భాగంలో భూమిలోప‌ల ఈ బంక‌ర్ల‌ను నిర్మించారు. ట్విన్ ట‌వ‌ర్స్ పై దాడి స‌మ‌యంలో అప్ప‌టి అధ్య‌క్షుడు జార్జ్ బుష్, వైట్ హాస్ సిబ్బంది ఆబంక‌ర్లోనే దాక్కున్నారు.