టిక్ టాక్ పై అమెరికా వేటు..చైనాకి పుండు మీద కారం

నోటితో న‌వ్వి నొస‌టితే వెక్కిరించే బుద్ధి ప్ర‌పంచ దేశాల్లో ఎవ‌రికి ఉందంటే? వెంట‌నే గుర్తొచ్చే ఒకే ఒక్క దేశం పేరు చైనా. అవును భార‌త్ తో త‌లెత్తిన స‌రిహ‌ద్దు విష‌యంలో గాల్వానా లోయ ఘ‌ర్ష‌ణ‌తో చైనా వ‌క్ర బుద్దికి ఎలాంటి మూల్యం చెల్లించుకుందో తెలిసిందే. ప్ర‌పంచ జ‌నాభాలో రెండ‌వ దేశంగా పేరుగాంచిన భార‌త్ డ్రాగ‌న్ దేశం చైనా యాప్ ల‌న్నింటిని నిషేధించిన సంగ‌తి తెలిసిందే. టిక్ టాక్ స‌హా మొత్తం 59 యాప్ ల‌పై మోదీ స‌ర్కార్ వేటు వేసింది. చైనా యాప్ ల‌కు బ‌ధులుగా స్వ‌దేశీ టెక్నాల‌జీని వినియోగంలోకి తెచ్చింది. అవ‌స‌ర‌మైతే ఇత‌ర దేశాల సాయం కోరుదాం గానీ….డ్రాగ‌న్ సాయం మ‌న‌కొద్దంటూ చైనా ని ఎలా దెబ్బ‌కొట్టాలో అలా దెబ్బ‌కొట్టింది. ఇంకా చైనాతో ఇండియ‌న్ రైల్వేస్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంది.

ఇలా చైనాని ఆర్ధికంగా వెన‌క్కి లాగాల‌ని భారత్ గ‌ట్టిగానే సంక‌ల్పించింది. ఈ విష‌యంలో చైనా,  ఒక్క దేశంలో మా టెక్నాల‌జీ వినియోగంలో లేక‌పోతే మాకు పోయింది ఏదీ లేదంటూ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించినా లోలొప‌ల ఆ న‌ష్టం దెబ్బ ఎలా ఉందో డ్రాగ‌న్ కు బాగా తెలుసు. ఈ నేప‌థ్యంలో తాజాగా అగ్ర రాజ్యం అమెరికా కూడా చైనా టిక్ టాక్ పై వేటు వేసింది. ఆ యాప్ ని నిషేధిస్తూ అక్క‌డి ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది. టిక్ టాక్ ని బ్యాన్ చేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఒక్క టిక్ టాక్ నే కాదు పలు చైనా యాప్ ల‌ను బ్యాన్ చేస్తూ సంత‌కాలు చేసారు. అమెరికా దేశ భ‌ద్ర‌త‌కు చైనా యాప్ ల నుంచి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని కొన్ని నెల‌లుగా ట్రంప్ హెచ్చరిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

శ‌త్రు దేశం చైనా మ‌న స‌మాచారాన్ని వాడుకుని ఎలాగైనా దెబ్బ తీయ‌డానికి గుంట న‌క్క వేశాలు వేస్తుంద‌ని ట్రంప్ ముందే మేల్కొన్నారు. టిక్ టాక్ అప్లికేష‌న్ వినియోగించే వినియోగ‌దారుడి నుంచి టిక్ టాక్ అధిక మొత్తంలో స‌మాచారాన్ని సంగ్ర‌హి స్తుంద ని..అమెరిక‌న్ల వ్య‌క్తిగ‌త యాజ‌మాన్య స‌మాచారాన్ని చైనా క‌మ్యునిస్టు పార్టీకి చేర వేస్తుంద‌ని ట్రంప్ ఆరోపించారు. ఫెడ‌రల్ ఉద్యోగులు, కాంట్రాక్ట‌ర్ల స్థానాన్ని ట్రాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయ‌డానికి టిక్ టాక్ యాప్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారుతుంద న్నారు. తాజా బ్యాన్ తో చైనా కు మ‌రో పెద్ద త‌గిలినట్లు అయింది. భార‌త్, అమెరికా దేశాలు చైనాకు అతి పెద్ద మార్కెట్లగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే భార‌త్ వేటుతో చైనా టిక్ టాక్ కి పుండు ప‌డింది. ఇప్పుడా పుండు మీద అమెరికా నిషేధంతో కారం చ‌ల్లిన‌ట్లు అయింది. మ‌రి ఈ బ్యాన్ పై డ్రాగ‌న్ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.