పాకిస్థాన్ ఈ పేరు వింటేనే హడల్ అన్నట్లు ఉంటాయి అక్కడి పరిస్థితులు. కరుడుగట్టిన తీవ్రవాదం అంతా అక్కడి నుంచే పుట్టిందా అన్నట్లు ఉంటాయి అక్కడి పరిణామాలు. ఇటీవలె పాకిస్థాన్‌లో మైనార్టీ బాలికలను టార్గెట్ చేస్తూ కొన్ని ఆ దేశంలో కొన్ని వ్యవహారలు నడుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే… పాకిస్థాన్‌లో మైనార్టీ బాలికల కిడ్నాప్‌లకు ఎక్కడా బ్రేక్ పడకుండా జరుగుతూనే ఉన్నాయి.
గత కొద్ది కాలంగా మైనార్టీలైన హిందూ, సిక్కు, క్రైస్తవ యువతులే లక్ష్యంగా పెట్టుకుని ఈ అపహరణలు చేస్తున్నారు. అంతేకాకుండా అంతటితో ఆగకుండా.. వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తున్నారు. ఆపై దారుణంగా ముస్లిం యువకుడితో వివాహం చేస్తున్నారు. ఈ నెల 14న సింధ్ ప్రావిన్స్‌కు చెందిన ఇద్దరు హిందూ బాలికలు కిడ్నాప్ చేశారు. తరువాత వారిని బలవంతంగా మతం మార్చి.. ముస్లిం యువకులతో వివాహం చేశారు.
ఇదిలా ఉండగానే.. తాజాగా మరో బాలిక పైన కూడా అరాచకంగా కిడ్నాప్‌కు గురి చేసి… ఆ బాలికను కూడా బలవంతంగా ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం యువకుడితో పెళ్లి చేశారు. ఈ ఘటన కూడా సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై స్పందించిన అకాలీదళ్ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఘాటుగా స్పందించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, లాహోర్ వైస్రాయ్ జకరియా ఖాన్ల హయాంలోనూ ఇలాంటి బలవంతపు మతమార్పిడులు జరిగాయని.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చేయడం ఒకరకంగా చాలా నేరం. ఎంత అది ఇస్లామిక్ రాజ్యమైనా సరే ప్రజల మానవ హక్కుల బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయన్నది. అక్కడి ప్రభుత్వాలు కాస్త గమనిస్తే బావుంటుందని పలువురు భావిస్తున్నారు. ఇటువంటి అరాచక పనులు జరిగే నేపధ్యంలో చాలా మంది అక్కడి వారు భారతదేశానికి వలస వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.