భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి వస్తువు దాదాపుగా ఇతర దేశాల నుంచి ఎగుమతి అయ్యేవే ఎక్కువగా ఉంటున్నాయి. అందులో ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఈ ప్రభావం ఉంటుంది. ఈ మద్య కాలంలో ఫోన్ వాడని వారంటూ ఎవ్వరూ ఉండడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది. అందులో ప్రతి పదిఫోన్లలో ఏడు ఫోన్లు దాదాపుగా చైనా కంపెనీవే ఉండటం గమనార్హం. తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఇక ఈ కంపెనీల ప్రభావం ఇక్కడితో ఆగకుండా ఇప్పుడు ఆలో మార్కెట్ పైన కూడా పడింది. ఫోన్లు ఎలాగైనా చవక ధరతో ఎక్కవ ఫీచర్లు పెట్టి అమ్ముతున్నారో ఇప్పుడు అదే విధంగా మరింత ఎడ్వాన్స్డ్ టెక్నాలజీతో కార్లను కూడా దించే పనిలో ఉంది చైనా మార్కెట్.
చైనాలో ఉన్న టాప్ ఆటో కంపెనీలన్నీ ఎస్ఏఐసీ (ఎంజీ మోటార్స్ ), బీవైడీ (ఈవీలను, బ్యాటరీలను తయారు చేస్తుంది), గ్రేట్‌వాల్ (చైనా అతిపెద్ద ఎస్యూవీ మేకర్), ఎఫ్ఏడబ్యూ హైమా ఇవన్నీకూడా ఇండియా ఆటో మార్కెట్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. అమ్మకాలు లేక ఇండియాలో ఉన్న ఆటో కంపెనీలన్నీ చతికిలపడుతున్నాయి. చైనా కంపెనీలు మాత్రం ఇక్కడ కస్టమర్ల పై బోలెడు ఆశలు పెట్టుకుంటున్నాయి. హెక్టర్ ఎస్యూవీ కంపెనీకి ఇప్పటికే ఏకంగా 20 వేల ఆర్డర్లు వచ్చాయంటే దీనికి ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కారు కోసం కస్టమర్లు నెలల తరబడి ఎదురుచూస్తుండటం విచిత్రం. అంతేకాదు హెక్టర్‌కు బాగా ఆదరణ రావడంతో ఈ కంపెనీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసింది.ఇక్కడ ఉండే స్థానిక కంపెనీలతో కలసి దీనికోసం ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది.
గ్రేట్‌వాల్‌తోపాటు చంగన్ అనే మరో చైనా కంపెనీ సైతం ఇండియాలో ప్రొడక్షన్ కోసం ప్లాన్లు వేస్తూ తెగ ఆరాటపడుతుంది. అప్పేడే ఇక్కడ కొంతమంది సప్లయర్లతో కూడా మాట్లాడిందని సమాచారం. ఈవీ బ్యాటరీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్లను పెట్టాలని కూడా నిర్ణయించుకుంది. నాలుగైదు సంవత్సరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇండియాలో త్వరలో ఆరు ఈ–బైకులను కూడా పెట్టబోతున్నారు. త్వరలోనే ఈ వీ మార్కెట్ అత్యుత్తమ స్థాయికి వెళ్ళబోతుంది.