Today Horoscope : జనవరి 7th గురువారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 7th గురువారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు రుణాలు చేస్తారు.ఈరోజు క్రియేటివ్ గా పని చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. మీ కుమార్తె, లేదా కుమారుడు వివాహం గురించి ఆలోచనలు చేస్తారు. ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా సమర్ధ వంతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రీకాలభైరావాష్టకం పారాయణం చేయండి.

వృషభరాశి: ఈరోజు పనులు పూర్తి చేస్తారు !

ఈరోజు మీకు ప్రాపంచిక ఆనందాలు అనుభవంలోకి వస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఈరోజు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి షాపింగ్ చేస్తారు. చిన్ననాట మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రీమల్లికార్జున స్వామి ఆరాధన, స్తోత్రం పారాయణం చేయండి.

మిధునరాశి: ఈరోజు విభేదాలు తొలగుతాయి !

ఈరోజు వ్యాపార రంగం వారికి బాగుంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి సహకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఈరోజు అనుకోని విధంగా డబ్బు అందుతుంది. అప్పుల బెడద తగ్గించుకుంటారు. ఈరోజు సోదరులతో విభేదాలు తొలగుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు ఆనందంగా గడుస్తుంది !

ఈరోజు రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఆనందంగా గడుస్తుంది. మీకు ఇష్టమైన వారితో సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు అతిధి మీ ఇంటికి వస్తారు. ఈరోజు కొన్ని పనులలో ఆటంకాలు. ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఆటంకాలు ఎదురవుతున్న పనులను పూర్తి చేయడానికి సిద్ధపడతారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి చేయండి.

సింహరాశి: మిత్రులతో మాటపట్టింపులు !

ఈరోజు పరోపకారం చేయడంలో ముందుంటారు. ప్రయాణాలలో మార్పులు. ఈరోజు కొన్ని పనులు ముందుకు సాగవు. ఇతరుల మాట వినండి. ఈరోజు మిత్రులతో మాటపట్టింపులు. ఈరోజు మీకు కలిసి వస్తుంది. మీ సన్నిహితులు మీకు మద్దతు ఇస్తారు. శ్రీశివకవచం పారాయణం చేయండి.

కన్యరాశి: ఈరోజు మిత్రులను కలుసుకుంటారు !

ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు మనసులో సంతృప్తి కరంగా ఉంటుంది. మీ సన్నిహితుల సలహాలు, మద్దతుతో మీరు పూర్తి చేయాల్సిన పనులను సరైన క్రమంలో పూర్తి చేస్తారు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. భార్య పిల్లలతో సంతోషకరం సమయం గడుపుతారు. ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చంద్రగ్రహారాధన చేయండి.

 

Today Horoscope : జనవరి  7th గురువారం మీ రాశి ఫ‌లాలు
Today Horoscope : జనవరి 7th గురువారం మీ రాశి ఫ‌లాలు

తులారాశి: ఈరోజు కొన్ని పనులు వాయిదా !

ఈరోజు ఆనందంగా గడుస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మీకు సంపద, ఉల్లాసం లభిస్తుంది ఈరోజు నిపుణుల సలహాల వలన మీరు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు. మీ స్నేహితుడు మిమ్మల్ని అవసరానికి ఆడుకుంటారు. ఈరోజు అన్ని రకాల వ్యాధుల నుంచి మీరు బయట పడగలుగుతారు. శ్రమాధిక్యం. శివుడికి పంచామృతాభిషేకం చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు విజయం లభిస్తుంది !

ఈరోజు శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు శుభప్రదంగా గడుస్తుంది.మీకు అకస్మాత్తుగా ఎక్కడ నుంచి అయినా సంపద లభిస్తుంది. ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఈరోజు విజయం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఈరోజు మీ పనుల కోసం ఇతరులపై ఆధార పడకండి. శ్రీరామరక్షాస్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి: ఈరోజు ప్రశంసలు పొందుతారు !

ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు ప్రతిచోటా ప్రశంసలు పొందుతారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఈరోజు వ్యాపారం పై దృష్టిని ఉంచండి. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఈరోజు కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. అనవసర గొడవల్లో తల దూర్చవద్దు. శ్రీదుర్గాసూక్తంతో అభిషేకం చేయండి.

మకరరాశి: పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ప్రత్యర్ధులు బలంగా ఉన్నప్పటికీ మీదే విజయం అవుతుంది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న పట్టు విడవకుండా పనులను పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. ఈరోజు మీ పట్టుదలే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుంది. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి: ఈరోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు !

ఈరోజు మీ కోరికలను నెరవేర్చుకోగలరు. ఈరోజు సమస్యలను పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువులు కొంటారు. మనసులో విచారం మాయం అవుతుంది. ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో ఉల్లసముగా గడుపుతారు. ఈరోజు ఉద్యోగాలలో పదోన్నతులు. శ్రీసూక్తపారాయణం చేయండి.

మీనరాశి: సమాజంలో గౌరవం లభిస్తుంది !

ఈరోజంతా క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. సమాజం పట్ల మీ భౌతిక దృక్పధం మారుతుంది. ఈరోజు బంధువులతో తగాదాలు. పనిని ఇష్టంగా చేయండి. ఈరోజు ఎన్ని పనులున్నా, ఆటంకాలు ఎదురవుతున్న సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. శ్రీరామనామాన్ని కనీసం 108 సార్లు జపించండి.