Today Horoscope : జనవరి 6th బుధవారం మీ రాశి ఫ‌లాలు

today january 6th 2021 daily horoscope in telugu

మేషరాశి : ముఖ్యమైన పనుల్లో అవరోధాలు !

ఈరోజు సామాన్యం గా గడుస్తుంది. కుటుంబ చర్చలకు దూరం గా ఉండండి. ఈరోజు వ్యాపారాలలో ఒడిదుడుకులు. సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు అనవసరం గా గొడవలలో తల దూర్చకండి. కార్యాలయం లో పరిస్థితులు బాగుంటాయి. ఈరోజు మిత్రులతో తగాదాలు. ఆర్ధిక లావాదేవీల విషయం లో జాగ్రత్త వహించండి. ఈరోజు ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. లక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

వృషభరాశి: ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు !

ఈరోజు ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితోను, కుటుంబంతోనూ మీ సమయాన్ని గడుపుతారు. మీ తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఇంటికి వచ్చే అతిధి సంతోషం కలిగిస్తారు. ఈరోజు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

మిధునరాశి: ఈరోజు అంచనాలు నిజమవుతాయి !

ఈరోజు వ్యాపారం లో లాభాలు చేకూర్చవచ్చు. ఈరోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పని చేసే చోట అనవసర ఖర్చులను తగ్గించుకోండి. ఈరోజు మీ అంచనాలు నిజమవుతాయి. మీ ప్రేమ జీవితం మధురం గా ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు నడిపేడపుడు జాగ్రత్త వహించండి. ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి: ఈరోజు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి !

ఈరోజు కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు. ఈరోజు విజయం లభిస్తుంది. మీ వద్దకు పెద్ద మొత్తం లో డబ్బు చేరుతుంది. ఈరోజు వ్యాపారంలో తండ్రి సహకరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కాస్త మందగిస్తాయి. ఈరోజు పాత అప్పుల నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఈరోజు లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

సింహరాశి: ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు !

ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు రావాలంటే ఏకాగ్రత పెట్టి పని చేయాలి. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. విజయం సాధించాలంటే ఏకాగ్రత గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. సోదరుల సాయం తో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మిత్రుల నుంచి ఒత్తిడులు. ఈరోజు గాయత్రీ స్తోత్రాలు పారాయణం చేసుకోండి.

today january 6th 2021 daily horoscope in telugu
today january 6th 2021 daily horoscope in telugu

కన్య రాశి: ఈరోజు అంచనాలు నిజం కాగలవు !

ఈరోజు పాతమిత్రులను కలుసుకుంటారు.మీ సహచరుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి భావాలను అర్ధం చేసుకోవడనికి ప్రయత్నించండి. ఈరోజు ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. ఈరోజు స్నేహితుల సాయంతో మీకు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఈరోజు శత్రువులను ఆకట్టుకుంటారు. ఈరోజు శ్రీమంగళ చండికా స్తోత్రం పారాయణం చేసుకోండి.

తుల రాశి: ఈరోజు అనుకోని ధనవ్యయం !

ఈరోజు వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి. పిల్లల భవిష్యత్ గురించి మీలో ఆందోళన నెలకొంటుంది. ఈరోజు అనుకోని ధనవ్యయం. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు సహకరిస్తారు. ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చిన సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చికరాశి: ఈరోజు సంతోషంగా గడుస్తారు !

ఈరోజు తల్లి తండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఈరోజు మీ ఆర్ధిక పరిస్థితులు బలం గా ఉంటాయి. గతంలో కంటే ఈరోజు ఆర్ధికం గా బలపడతారు. ఈరోజు మీకు ఇష్టమైన వారితో మీరు సంతోషం గా గడుస్తారు. వాహనయోగం. ఈరోజు మీ మాటలపై సంయమనం పాటించండి లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నవదుర్గా స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనుస్సు రాశి: ఈరోజు బాధ్యతలు పెరుగుతాయి !

ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.ఈరోజు సామాన్యం గా ఉంటుంది. ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్త వచ్చు. ఈరోజు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులకు సాయం చేస్తారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఈరోజు విజయం సాధించడం కోసం విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అవకాశాలు చేజారతాయి. ఈరోజు శ్రీనారాయణ స్తోత్రం పారాయణం చేసుకోండి అనుకున్నది జరుగుతుంది.

మకరరాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి.పని ప్రదేశం లో ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు వ్యాపార రంగం లో మీకు అనుకూలం గా ఉండే అవకాశం ఉంది. ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి మీరు అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. శ్రీశివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు !

ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు సామాన్యం గా ఉంటుంది. మీ రహస్య విషయాలను ఎవరికీ చెప్పకండి. ఈరోజు సమస్యలు అధిగమిస్తారు. మీ సహచరులు ద్రోహం చేసే అవకాశం ఉంది. ముఖ్య పనులలో విజయం. ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కుటుంబం లో ఉద్రిక్తతలకు దూరంగా ఉండండి. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి: ఉద్యోగాలలో మార్పులు !

ఈరోజు వ్యాపారలో వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. బంధువులతో వివాదాలు. కొత్త ఆదాయవనరులు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారం లో పురోగతి ఉంటుంది. ఈరోజు మీ తల్లితండ్రుల సలహాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఉద్యోగాలలో మార్పులు. ఈరోజు విద్యార్థులకు మానసికంగా బరువు తొలగుతుంది. మీ మనస్సు విశ్రాంతిని పొందుతుంది. ఈరోజు శ్రీభ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.