Home Horoscope Today Horoscope : జనవరి 3rd ఆదివారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 3rd ఆదివారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి : అనూకూలమైన ఫలితాలు వస్తాయి !

ఈరోజు అనూకూలమైన ఫలితాలు వస్తాయి. మీరు ఈరోజు ఈ రోజు పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అధిక పని కారణంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. మీ పని ద్వారా ప్రత్యర్థులు ఓడిపోతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. ఈ రోజు మీకు వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. శ్రీసూర్యారాధన చేయండి.

వృషభరాశి: నూతనోత్సాహంతో పనులు పూర్తి !

మీ సంపద పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. నూతనోత్సాహంతో పనులు పూర్తి. ఇంటాబయటా అనుకూలత. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారానికి మంచి సమయం, సామాజిక ఖ్యాతి విస్తరిస్తుంది. ఆఫీస్‌లో అనుకున్న పని పూర్తి చేస్తారు. విద్యార్థుల తెలివితేటలు, అనుభవాల నుంచి నూతన అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి: వ్యాపారంలో లాభాలు వస్తాయి !

ఈరోజు ఈరాశివారికి వ్యాపారంలో లాభాలు వస్తాయి. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఉన్నత విద్యను పొందడానికి విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. సోదరులు, స్నేహితులకు సహాయం చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వివాహం కోసం చూస్తున్నవారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామి సలహ సహాయపడుతుంది. ఆదిత్యహృదయం పారాయణం చేయండి.

కర్కాటకరాశి: మీ శ్రమ పెరుగుతుంది !

ఈరోజు మీ శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. వ్యాపార ప్రణాళికలు వేగం పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. మీకు అనారోగ్య సూచన. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ. ఆఫీస్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. విద్యార్థులు అడ్డంకులను ఎదుర్కొంటారు. మీ చర్యల వల్ల ప్రత్యర్థులు ప్రభావితమవుతారు. కుటుంబంలో వినోదావకాశాలు పొందుతారు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. కుటుంబ ఖర్చులను నియంత్రించండి. శ్రీగిరిపుత్రాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి.

సింహరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు !

ఈరోజు మీ వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. మీరు వ్యాపారంలో ఏదైనా కొత్త ఒప్పందాన్నిచేసుకుంటారు. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి శుభవార్తలు. కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అత్తమామల నుంచి ప్రయోజనం పొందండి. గృహ వినియోగాలు పెరుగుతాయి. ఓం నారాయణాయనమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు పారాయణం చేయండి.

కన్యరాశి: ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి !

ఈరోజు వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. మీ ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఒత్తిడి వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించిన తగిన నైపుణ్యాలను ఎంచుకుంటారు.కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తండ్రి మార్గదర్శకత్వం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. బంధువులతో వివాదాలు. ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. శ్రీరామ రక్షస్తోత్రం పారాయణం చేయండి.

Today January 3Rd 2021 Daily Horoscope In Telugu
today january 3rd 2021 daily horoscope in telugu

తులారాశి: సమస్యల నుంచి విముక్తి పొందుతారు !

ఈరోజు సమస్యల నుంచి విముక్తి పొందుతారు. నూతన ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో పెద్ద వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం. దైవచింతన. ఆఫీస్లో సానుకూల అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి: ఉపాధి విషయంలో విజయం సాధిస్తారు !

ఈరోజు మీకు ఉపాధి విషయంలో విజయం సాధిస్తారు. పాత బాకీల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు శ్రమా«ధిక్యం.
ప్రేమ జీవితంలో అనూకూలత. స్నేహితుల్లో మహిళల నుంచి పురోగతి అవకాశాలు లభిస్తాయి. మీకిష్టమైన వారు అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరమైన లావాదేవీలను వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఇష్టదేవతరాధన చేయండి.

ధనస్సురాశి: ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది !

ఈరోజు వ్యాపార విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి సలహా ఉపయోగపడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది. ఈరోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఈరోజు ఈరాశి వారు వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యాపారంలో జీవిత భాగస్వామి సలహాతో మీరు విజయం సాధిస్తారు. సహోద్యోగుల పట్ల జాగ్రత్త వహించండి. వివాహానికి సంబంధించి కొన్ని వార్తలు అందుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదిత్య పారాయణం చేయండి.

మకరరాశి: పెండింగ్ పనులు పూర్తవుతాయి !

ఈరోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈరాశి వారికి వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సమస్యలను తొలగించడానికి మీ ఇంట్లో సభ్యులతో చర్చిస్తారు. ఆఫీస్‌లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడుతారు. అధికారుల సహాయంతో మీ పని పూర్తవుతుంది. బహుమతులు అందుకుంటారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదేవతరాధన చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

కుంభరాశి: మీకు చేసే పనుల్లో విజయం !

ఈరోజు మీకు చేసే పనుల్లో విజయం. వృత్తిపరమగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ఈరోజు మీరు శుభవార్తలు వినే అవకాశం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.
తల్లిదండ్రులకు సేవ చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఆఫీస్‌లో అధికారుల సహాయంతో మీ గౌరవం పెరుగుతుంది. బాల్య స్నేహితుడిని కలిసే అవకాశముంది. వైవాహికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

మీనరాశి: మీ ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది !

ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. మీరు రుణాలు చేస్తారు. ఈరోజు పనుల్లో జాప్యం. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో మీరు విజయం సాధిస్తారు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సాధిస్తారు. ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపార ఖ్యాతి పెరుగుతుంది. అత్తమామల వైపు నుంచి ఉద్రిక్తత ఉంటుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News