Home Horoscope Today Horoscope : జనవరి 26th మంగళవారం మీ రాశి ఫలాలు

Today Horoscope : జనవరి 26th మంగళవారం మీ రాశి ఫలాలు

మేషరాశి : వ్యవహారాల్లో ఆటంకాలు !

ఈరోజు పనుల్లో అవరోధాలు. పిల్లల వైపు నుంచి ఆందోళనలు పరిష్కరించుకుంటారు. ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఈరోజు కొన్ని సమస్యలు ఉండవచ్చు. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఈరోజు ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. ఏక ముఖి రుద్రాక్షను వేసుకోండి.

వృషభరాశి: ఈరోజు మీ కీర్తి పెరుగుతుంది !

ఈరోజు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దు. కొత్త విషయాలు తెలుస్తాయి. ఈరోజు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకలపాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈరోజు ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. మానసికంగా అసౌకర్యంగా ఉండవచ్చు. ఈరోజు శుభవార్తలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఈరోజు శుభకరమైన వ్యయం చేయడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది. లక్ష్మీ అష్టోతరాన్ని పారాయణం విధానంలో చేయండి.

మిథునరాశి: ఈరోజు ప్రయాణంలో ప్రయోజనాలు !

ఈరోజు పనుల్లో అవాంతరాలు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, చేసిన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రయాణంలో ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఈరోజు పిల్లల నుంచి శుభవార్తలు వస్తాయి. శివారాధన చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది !

ఈరోజు ఉద్యోగ, వ్యాపారంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగార్ధుల యత్నాలు సఫలం. ఈరోజు ఏదైనా నూతన ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటారు. సామాజిక రంగంలో పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు బంధువుల రాకతో కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ దేవతకు పసుపు, కుంకుమలతో ఆరాధన చేయండి.

Today January 26Th  Daily Horoscope In Telugu
today january 26th daily horoscope in telugu

సింహరాశి: ఈరోజు ఇంటాబయటా అనుకూలం !

ఈరోజు పనులు విజయవంతంగా సాగిస్తారు. మీ అదృష్టం పెరుగుతుంది. ఈరోజు ఆకస్మిక డబ్బును పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ధన, వస్తులాభాలు. ఈరోజు ప్రయాణాలు కోసం ఖర్చు చేస్తారు. ఇంటాబయటా అనుకూలం. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఈరోజు అదికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో లక్ష్మీ అష్టోతరం చదవుతు పూజించండి.

కన్యారాశి : మిత్రులతో విభేదాలు !

ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు రుణదాతల ఒత్తిడులు. ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈరోజు కుటుంబ సభ్యులతో విడిపోయే పరిస్థితి ఉండవచ్చు. శ్రమాధిక్యం. ఈరోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు మిత్రులతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

తులారాశి: వ్యాపారాలు విస్తరిస్తారు !

ఈరోజు వివాహానికి సంబంధించి సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఈరోజు మీ కీర్తి, ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలో చికాకులు. ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశముంది. ఈరోజు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి. ఈరోజు వ్యాపార భాగస్వామ్యంలో సంబంధాలు బాగుంటాయి. డబ్బు వల్ల ప్రయోజనం ఉంటుంది. పేదలకు పండ్లు పంపిణీ చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు పనిలో విజయం !

అనారోగ్యంగా ఉంటే ఈరోజు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఈరోజు మీరు పనిలో విజయం సాధించడమే కాకుండా మీ కీర్తి వల్ల ఉత్సాహం పెరుగుతుంది. సంఘంలో గౌరవం. ఉద్యోగంలో లాభదాయకమైన వార్తలు లభిస్తాయి. ఈరోజు విలువైన వస్తువులు సేకరిస్తారు. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు ప్రత్యర్థులు, పోటీదారులు ఓడిపోతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. శ్రీసూక్తపారాయణం చేయండి.

ధనస్సురాశి: విద్యార్థుల యత్నాలు సానుకూలం !

ఈరోజు ప్రయాణాలు మానుకోండి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన ఉండవచ్చు. ఈరోజు పిల్లల విషయంలో కొంత సమస్య వచ్చే అవకాశముంది. ఈరోజు విద్యార్థుల యత్నాలు సానుకూలం. ఆర్థిక ప్రణాళికలకు ఈరోజు శుభం. ఈరోజు పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని 28 లేదా 108 సార్లు పఠించడం అనుకూల ఫలితాలను ఇస్తుంది.

మకరరాశి: పనుల్లో అవాంతరాలు !

ఈరోజు పనుల్లో అవాంతరాలు వ్యాపార విషయాలపై మానసిక ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఈరోజు శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈరోజు తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ ఆస్తికి సంబంధించి వివాదం ఉండవచ్చు. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. పేదలకు ఆహారం పంపిణీ చేయండి.

కుంభరాశి: ఈరోజు పనిలో విజయం !

ఈరోజు నూతన పనులు ప్రారంభమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. మీరు ఏం చేసినా, దాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఈరోజు పనిలో విజయం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఈరోజు మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఈరోజు స్నేహితుల మద్దతు లభిస్తుంది. మనస్సు గందరగోళం నుంచి బయటపడుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు చిక్కులు. అవసరమయ్యే ప్రజలకు ఆహార పదార్థాలు, పండ్లు దానం చేయండి.

మీనరాశి: ఉద్యోగాలలో ప్రోత్సాహం !

ఈరోజు ఇంటాబయటా అనుకూలం. మానసిక గందరగోళం కారణంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండరు. ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వెనక ఖర్చు ఉంటాయి. ఆరోగ్యం సరిగా ఉండదు. ఈరోజు భూవివాదాలు తీరతాయి. విద్యార్థులు ప్రతికూల ఆలోచనలు తొలగించడం మంచిది. ఈరోజు ప్రేమ వ్యవహారాలకు సంతోషకరమైన రోజు. ఈరోజు ఉద్యోగాలలో ప్రోత్సాహం. శివుడికి పంచామృతాభిషేకం, బిల్వదళాలు సమర్పించండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News