Today Horoscope : జనవరి 25th సోమవారం మీ రాశి ఫలాలు

today-january-25th-21-daily-horoscope-in-telugu

మేషరాశి : ఆర్థికంగా బాగుంటగుంది !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటగుంది. మీకు ఆకస్మిక ధనలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చేసే పనులలో కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. ఆనందమైన రోజుకోసం శ్రీశివ పంచాక్షరీ మంత్రాన్ని జపించండి.

వృషభరాశి: నిర్ణయాలలో మార్పులు !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. చేసే పనుల్లో జాప్యం. మీ ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కుటుంబ సభ్యుల నిర్ణయాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దేవాలయ దర్శనాలు. కుటుంబం సభ్యులలో ఒకరికి అనారోగ్యం. విద్యార్థులకు పర్వాలేదు. వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాలు రావడానికి దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

మిథునరాశి: అనవసర ఖర్చులు !

ఈరోజు వివాదాలు, ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లోవారితో వివాదాలు. అనవసర ఖర్చులు, ఆర్థికంగా నిరాశజన కంగా ఉంటుంది. . ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.కుటుంబంలో చికాకులు. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శుభఫలితాల కోసం శ్రీశివ ఆరాధన చేయండి.

కర్కాటకరాశి : నిరుద్యోగులకు ఉద్యోగలాభం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు, వ్యాపారులకు లాభాలు రావచ్చు. కొత్త అవకాశాలకు ఈరోజు ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ అభిమానం మరింత పెరిగే రోజు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత. వైవాహికంగా బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.

today-january-25th-21-daily-horoscope-in-telugu
today-january-25th-21-daily-horoscope-in-telugu

సింహరాశి: కొత్త విషయాలు తెలుసుకుంటారు !

ఈరోజు అనుకూంగా ఉంటుంది. మీకు ఆర్థికంగా బా౪గుంటుంది. ఆస్తివివాదాలు పరిష్కారం. సెమినార్లకు లేదా మీటింగులకు హాజరువు అవుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

కన్యరాశి: కుటుంబసభ్యులతో విభేదాలు !

ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుండదు. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. విద్యార్థులకు నిరాశ, ఆఫీస్‌లో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగాలలో నిరుత్సాహం. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివుడికి పంచామృతాభిషేకం చేయండి.

తులారాశి: అనవసర ధనవ్యయం !

ఈరోజు ఆటంకాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. గ్రహచలనం రీత్యా ఆర్థికంగా సమస్యలు, అనవసర ధనవ్యయం,. కుటుంబంలో వివాదాలు లేదా సమస్యలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. వైవాహికంగా బాగుండదు. శుభఫలితాలకోసం శ్రీ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

వృశ్చికరాశి: సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది !

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యజయం.ఆర్థికగా బాగుంటుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. బంధువుల నుంచి వస్త్రలాభాలు. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాల పరిష్కారం. ఉద్యోగాలలో పోత్సాహం. వైవాహికంగా పర్వాలేదు. విద్యార్థులకు సంతోషంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

ధనుస్సురాశి: కుటుంబ సభ్యులతో సమస్యలు !

ఈరోజ ఆటంకాలు, ప్రతిబంధకాలు, ఆర్థికంగా ఇబ్బందులు, అవసరాల కోసం రుణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమస్యలు, ఒత్తిడులు. విద్యార్థలకు శ్రమించాల్సిన రోజు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీశివ ఆరాధన చేయండి.

మకరరాశి: అత్యంత శుభకరంగా ఉంటుంది !

ఈరోజు అత్యంత శుభకరంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ప్రయత్న కార్యసిద్ధి, వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు రావచ్చు. దూరపు బంధువులను కలుసుకుంటారు., ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. వైవాహికంగా సంతోషం ఉంటుంది. శుభం జరుగడానికి శ్రీశివ పంచాక్షరీ జపించండి.

కుంభరాశి: ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి !

ఈరోజు శుభవర్తాలు వింటారు. కార్యజయం. అనుకోని చోట నుంచి ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. శుభవార్తలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. శుభఫలితాలకోసం దానాలు చేయండి.

మీనరాశి: ఈరోజు ఆటంకాలు !

ఈరోజు ఆటంకాలు, ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో చికాకులు. ఆర్థికంగా బాగుండదు. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా. ఆఫీస్‌లో ఇబ్బందులు, తోటి వారితో అనవసర వివాదాలు రావచ్చు. విద్యార్థులు బాగా శ్రమిస్తేనే ఫలితం వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. వైవాహికంగా పర్వాలేదు, శుభ ఫలితాల కోసం శ్రీశివుడికి  ఆవుపాలతో అభిషేకం చేయండి.