Home Horoscope Today Horoscope : జనవరి 20th బుధవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 20th బుధవారం మీ రాశి ఫ‌లాలు

మేష రాశి: ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరపు వ్యక్తులకు డబ్బులను, వస్తువులను అప్పుగా ఇవ్వకుండా ఉండటం మంచిది, లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదరులతో సఖ్యతగా ఉండటం మంచిది. ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

వృషభ రాశి: ఆర్థిక లాభం పొందుతారు !

ఈరోజంతా ఆనందంగా ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని ఆర్థిక లాభం పొందుతారు. పెద్ద వారి మాటలను, సూచనలను గౌరవిస్తారు, పాటిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్వర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. సరైన సమయంలో ఆహారాలను తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఉత్తమ శ్రేణి మార్కులు పొందుతారు. శుభవార్తలు వింటారు. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

మిధున రాశి: ఈరోజు వచ్చిన అవకాశాలు దూరం !

ఈరోజు కష్టంగా ఉంటుంది. పెద్ద వారి మాటలను వినకుండా పనులు చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తొందరపడి క్రొత్త ఉద్యోగాని చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువగా చేసి మొండి బాకీలు వసూలు కాక ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది, స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పు ఇవ్వడం, తీసుకోకపోవడం చేయకుండా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో దృష్టిపెట్టడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యంగా ఉండడం వల్ల వచ్చిన మంచి అవకాశాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు మీద ఏకాగ్రత పెట్టడం మంచిది. ఈరోజు బీదవారికి తినే పదార్థాలను దానం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి: ప్రయాణాల విషయంలో జాగ్రత్త !

ఈరోజు అనుకూలంగా ఉండటం లేదు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విలువైన పత్రాలు జాగ్రత్త. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువు కోవడం మంచిది. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

సింహరాశి: ధన ప్రాప్తి పొందుతారు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండి చదువు మీద ఏకాగ్రత చూపి చదువుకోవడం మంచిది. అనవసరపు వ్యక్తులతో అనవసరపు విషయాలను చర్చించకుండా ఉండటం మంచిది. సమయాన్ని వృధా చేసుకోకుండా అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటం మంచిది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది, నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. సోదరులతో సఖ్యతగా ఉంది ధన ప్రాప్తి పొందుతారు. దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

Today January 20Th 2021 Daily Horoscope In Telugu
today january 20th 2021 daily horoscope in telugu

కన్యారాశి: ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. వాహనాలను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

తులారాశి: ఈరోజు కలిసి వస్తుంది !

ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని చేతి నిండా ధనం కలుగుతుంది. ధనవృద్ధి పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ పని చేసిన కలిసి వస్తుంది. గొప్ప వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి: ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు !

ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని కార్య లాభం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలు చేసుకుని ధన లాభం పొందుతారు. ఉద్యోగంలో అనుకున్న స్థానాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధ చర్చలు అనుకూలిస్తాయి. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించి లాభాలు పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ఉద్యోగము తిరిగి పొందుతారు. శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి: ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది !

ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఏ పనిలో అయినా కష్టపడితే అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును ఈరోజు పొందుతారు. సోదరులతో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. ఈరోజు అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

మకర రాశి: ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. గతంలో కుటుంబ సభ్యులతో ఉన్న వివాహ గొడవలన్నీ సమసిపోయి సఖ్యతగా ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో ఉన్న అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రుల అవకాశం ఉంటుంది. మిత్ర లాభం పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండి అప్పుల బాధలు తీర్చుకొంటారు. ధన లాభం పొందుతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని పనుల్లో ఆదరణ పొందుతారు.ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి: ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను, డబ్బును తిరిగి పొందుతారు. గృహంలో ఒక శుభకార్యం తలపెట్టే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో గొప్ప శుభ వార్తలు వింటారు.రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

మీన రాశి: ఈరోజు పై చదువులకు అర్హులవుతారు !

ఈరోజు అదృష్ట యోగంగా ఉంటుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. అయిన వారిని కలుసుకుని ఆనందంగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన మార్కులు పొండి పై చదువులకు అర్హులవుతారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలను పెంచుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. బంధువుల రాక వలన లాభం కలుగుతుంది. తల్లిదండ్రుల సౌకర్యాన్ని కోరుకుంటారు.భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Today Horoscope : ఫిబ్రవరి 24th బుధవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు ! ఈరోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులు అవుతారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం పొందుతారు. కుటుంబ సభ్యులతో...

Latest News