Today Horoscope : జనవరి 17th ఆదివారం మీ రాశి ఫ‌లాలు

today-february-23rd-2021-daily-horoscope-in-telugu

మేషరాశి: ఈరోజు ఉద్యోగాలలో గందరగోళం !

ఈరోజు ఇతరులతో మాట్లాడే సమయంలో నిగ్రహంగా ఉండాలి. మిత్రులతో కలహాలు. మీరు చేసే పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు ఇస్తారు. ఈరోజు విద్యార్థులకు నిరుత్సాహం. పట్టు వదలకుండా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృషభరాశి: కుటుంబంలో ఒత్తిడులు !

ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఈరోజు మీ మనసుకి సంతృప్తి లభిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం. ఈరోజు వ్యాపారాలు నత్తనడకనగా సాగుతాయి. ఈరోజు మీకు ఇష్టం లేని వ్యక్తులను కలవాల్సి రావచ్చు. ఈరోజు శ్రీలలితా దేవి సహస్రనామాలను పారాయణం చేసుకోండి.

మిధునరాశి: ఈరోజు శుభవార్త వింటారు !

ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం సాధించిన శుభవార్త వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉత్సాహాన్ని పొందుతారు. నిలిచిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మీస్నేహితులతో కలిసి మంచి సమయము గడుపుతారు. శ్రీదుర్గా అష్టకం పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి: ఈరోజు ప్రయోజనాలు లభిస్తాయి !

ఈరోజు పిల్లల కోరికలను నెరవేరుస్తారు. మీకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు ప్రముఖులతో పరిచయాలు. ఈరోజు మీరు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మారేడుదళాలతో శివుడికి పూజ చేయండి.

సింహరాశి: సన్నిహితులతో విభేదాలు !

ఈరోజు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మీ మాటలు మృదువుగా ఉండేలా చూసుకోండి. ఈరోజు సన్నిహితులతో విభేదాలు. మీకు గౌరవం లభిస్తుంది. విద్య, పోటీ రంగాలలో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. పేదలకు దానధర్మాలు చేయండి.

today january 17th 2021 daily horoscope in telugu
today january 17th 2021 daily horoscope in telugu

కన్యరాశి: ఈరోజు ఆరోగ్యం మందగిస్తుంది !

ఈరోజు పనుల్లో ఆటంకాలు.ఈరోజు మీకు ప్రత్యేకమైనది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు వ్యాపారంలో మీకు కలిసి వస్తుంది. ఈరోజు ఆరోగ్యం మందగిస్తుంది. మీ ప్రత్యర్థుల మధ్య గొడవలు జరుగుతాయి. కుటుంబంలో చికాకులు. ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పసుపు, కుంకుమతో అమ్మవారికి అష్టోతరపూజ చేయండి లేదా చేయించండి.

తులారాశి: ఈరోజు ప్రయాణాలు వాయిదా !

ఈరోజు చాలా ప్రత్యేకంగా గడుస్తుంది. శుభవార్తలు వింటారు . పోటీపరీక్షల్లో విజయం. ఆర్ధిక లావాదేవీల సమస్యలను పరిష్కరిస్తారు. ఈరోజు ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఈరోజు ఉద్యోగాలలో అనుకూలత. శ్రీదేవీ ఖడ్గమాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులలోను విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు మిమల్ని ఇబ్బంది పెడతాయి. ఈరోజు వ్యాపారాలు ముందుకు సాగవు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రామరక్షా స్తోత్రం పారాయణం చేయండి.

ధనుస్సురాశి: బంధుమిత్రులతో ఆనందం !

ఈరోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రశంసలు పొందుతారు. నూతన ఉద్యోగప్రాప్తి. అత్తామామల నుంచి కానుకలు పొందుతారు. ఈరోజు మీరు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయంలో కొబ్బరికాయను సమర్పించండి.

మకరరాశి: ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు !

ఈరోజు కుటుంబ, ఆర్ధిక విషయాలలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఈరోజు ఇంటాబయటా ఒత్తిడులు. ఎవరితోనూ గొడవలు పడకండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు మీ ఇంటికి అతిధులు వచ్చే అవకాశం ఉంది. శ్రీబాలాత్రిపురసుందరీ ఆరాధనచేయండి అనుకూల ఫలితాలు వస్తాయి.

కుంభరాశి: ఈరోజు ప్రారంభించిన పనులు నెరవేరుకాపోవచ్చు !

ఈరోజు శుభవార్తలు వింటారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఈరోజు కొన్ని సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ప్రారంభించిన పనులు నెరవేరుకాపోవచ్చు. ఈరోజు సోదరుల సహకారంతో లాభం పొందుతారు. అనుకూల వాతావరణం. చేదు వార్తలు వినాల్సి రావచ్చు. తగాదాలు పెట్టుకోవద్దు. ఈరోజు శ్రీశివకవచం పారాయణం చేసుకోండి.

మీనరాశి: ఆదాయం పెరుగుతుంది !

ఈరోజు ఎలాంటి కారణం లేకపోయినా మీరు ఇబ్బందుల్లో పడతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు ఆర్ధిక లావాదేవీలు జరపకండి. పనులు అనుకున్న విధంగా పూర్తి. ఈరోజు వివాహ జీవితంలో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. గురుసంబంధ దేవాలయ దర్శనం, లేదా గురు చరిత్ర పారాయణం చేయండి.