Today Horoscope : జనవరి 16th శనివారం మీ రాశి ఫ‌లాలు

today-february-23rd-2021-daily-horoscope-in-telugu

మేషరాశి: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి !

ఈరోజు మీకు ఆహ్లదకరంగా గడుస్తుంది. పనుల్లో జాప్యం. సోదరభావం పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు శుభవార్తలు వింటారు. మీ పాత స్నేహితుడ్ని కలుస్తారు. ఈరోజు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆవులకు బెల్లం తినిపించండి.

వృషభరాశి: ఈరోజు పరిచయాలు పెరుగుతాయి !

ఈరోజు సన్నిహితుల నుంచి ధనలాభం.ఉన్నతాధికారుల వలన మీకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ తల్లితండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. పనుల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. భైరవుడిని ఆరాధించడం ద్వారా శాంతి యుతంగా ఉండండి.

మిధునరాశి: ఈరోజు మిత్రులతో విభేదాలు !

ఈరోజు సానుకూలంగా గడుస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బు చేతికందే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతో విభేదాలు. మీ ఆర్థిక స్థితిగతి పెరుగుతుంది. ఈరోజు రుణాలు చేస్తారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి. హనుమాన్‌ చాలీసా, సింధూర ధారణ చేయండి.

కర్కాటకరాశి: ఈరోజు శ్రమ ఫలిస్తుంది !

ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతోషంగా ఉంటారు. పనులు సకాలంలో పూర్తి. ఈరోజు శ్రమ ఫలిస్తుంది. ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈరోజు ఆహరం విషయంలో శ్రద్ధ వహించండి. లేకుంటే, ఆరోగ్యం విషయంలో ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇష్టదేవతరాధన చేయండి.

సింహరాశి: ఈరోజు వ్యాపారాలు వృద్ధి !

ఈరోజు ఇంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. పనులు విజయవంతమవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈరోజు మీకు అనుకోని విధంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. రుద్రాక్షలను ధరించండి.

today january 16th 2021 daily horoscope in telugu
today january 16th 2021 daily horoscope in telugu

కన్యారాశి: ఈరోజు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం !

ఈరోజు పనులు నిదానంగా సాగుతాయి.ఈరోజు పోటీ రంగంలో ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. గౌరవాన్ని పొందుతారు. ఈరోజు ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఈరోజు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పదుటుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రీగణపతి ఆరాధన చేయండి.

తులారాశి: ఈరోజు ఆలోచనలు స్థిరంగా ఉండవు !

ఈరోజు ఆర్ధికంగా బలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఈరోజు మీ మాటలపై సంయమనం పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో కాస్త నిరాశ. ఈరోజు మీ స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. గురు ఆరాధన చేయండి.

వృశ్చికరాశి: పాతబాకీలు వసూలవుతాయి !

ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు ఎక్కువగా ఖర్చులు అవుతాయి. మీ బంధువులు లేదా సహోద్యోగుల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఈరోజు సమస్యలు పరిష్కృతమవుతాయి. కుజగ్రహారాధన చేయండి.

ధనుస్సురాశి: ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం !

వ్యాపారం కలిసి వస్తుంది. ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. గతంలో కంటే ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సోమేశ్వర ఆరాధన చేయండి.

మకరరాశి: రుణాలు చేస్తారు !

ఈరోజు వ్యవహారాలలో ఆటంకాలు.శారీరక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఈరోజు కొత్త రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. అత్తగారి ఇంటి నుంచి చర్చలు జరిగే అవకాశాలుంటాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలను పరిశీలించండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రీకాశీవిశ్వేశర్వ స్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి: కుటుంబసభ్యులతో తగాదాలు !

ఈరోజు వైవాహిక జీవితం బాగుంటుంది. పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. స్నేహితులను కలవడం వలన సంతోష పడతారు. ఈరోజు కుటుంబసభ్యులతో తగాదాలు. తల్లి తండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు మీకు మరింత మేలు చేకూరుస్తాయి. శ్రీసుబ్రమణ్య స్వామి ఆరాధన, శ్లోకాలను నిత్యం పఠించండి.

మీనరాశి: ఆత్మీయుల నుంచి శుభవార్తలు !

ఈరోజు ఇతరులకు సాయం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. కార్యాలయంలో మీకు అనుకూలంగా మార్పులు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ ప్రవర్తన ద్వారా మీ సహోద్యోగుల్లో మార్పులు తీసుకొస్తారు. సమస్యలు తీరతాయి. శ్రీకాలభైరవాష్టకం పఠిచండి.