Home Horoscope Today Horoscope : జనవరి 13th బుధవారం మీ రాశి ఫ‌లాలు

Today Horoscope : జనవరి 13th బుధవారం మీ రాశి ఫ‌లాలు

మేషరాశి: కుటుంబసభ్యులతో వివాదాలు !

ఈరోజు సవాళ్లు ఎదుర్కొంటారు. పనులు మందగిస్తాయి. ఈరోజు సామజిక రంగంలో ఉన్న వారు కీర్తి ప్రతిష్టలు పోకుండా జాగ్రత్త పడాలి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. మీ శత్రువులు మీ పై కుట్రలు పన్నే ప్రమాదం ఉంది. ఈరోజు సంయమనం పాటించండి. లేకుంటే, సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆలయాలు సందర్శిస్తారు. శివ అభిషేకం చేసుకుంటే మంచిది.

వృషభరాశి: ఈరోజు ఉద్యోగాలలో పురోగతి !

ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ వ్యాపారాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు చిన్ననాట విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తండ్రి ఆశీర్వాదం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూల సమయం కాదు. ఈరోజు వెనకడుగు వేయకండి. స్థిరాస్తి వృద్ధి. దుర్గా సప్తశతి పారాయణం చేసుకోండి.

మిధునరాశి: ఈరోజు ఇంటాబయటా ప్రోత్సాహం !

ఈరోజు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఈరోజు ఆర్ధికంగా కలిసి వస్తుంది. ఈరోజు ప్రయోజకరంగా గడుస్తుంది. మీ సోదరులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు విద్యార్థులు భవిష్యత్ ప్రణాళిక కోసం ప్రయత్నాలు చేస్తారు. పనులలో విజయం. ఈరోజు ఉద్యోగాలలో అనుకూలస్థితి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకరాశి: ఈరోజు తీరిక లేకుండా గడుపుతారు !

ఈరోజు మీ వ్యక్తిత్వం వలన ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో మీరు తీసుకున నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తీరిక లేకుండా గడుపుతారు. ఈరోజు పనుల్లో అవాంతరాలు. శ్రమ తప్పదు. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోండి.

Today January 13Th 2021 Daily Horoscope In Telugu
today january 13th 2021 daily horoscope in telugu

సింహరాశి: ఈరోజు విజయం సాధిస్తారు !

పని ప్రదేశంలో ఈరోజు మీకు మద్దతు లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీరు విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఈరోజు ఏకాగ్రతతో పని చేయండి. ప్రత్యర్థుల కుట్రలను మీ తెలివితేటలతో భగ్నం చేస్తారు. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఈరోజు శివాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యరాశి: వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి !

ఈరోజు కొత్త పనులు చేపడతారు. విలువైన వస్తువులు కొంటారు. పనిప్రదేశంలో పోటీదారులతో తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ సోదరులు కష్టకాలంలో ఆదుకుంటారు, వారి సాయంతో మీ పనులను మరింత సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు చంద్రశేఖర అష్టకం పారాయణం చేసుకోండి.

తులరాశి: భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది !

ఈరోజు వ్యాపారస్తులకు పని భారం పెరుగుతుంది. ఉద్యోగయత్నాలలో పురోగతి, నూతన అవకాశాలు కూడా లభిస్తాయి. మీ ప్రయత్నాలకు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు ఎక్కువ శ్రమ పడతారు అయినప్పటికీ, ఉత్తమ ఫలితాలను పొందుతారు. వినాయక ఆరాధన చేయండి.

వృశ్చికరాశి: పనుల్లో అవాంతరాలు !

కుటుంబసభ్యులతో వివాదాలు.పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. ఈరోజు పనుల్లో అవాంతరాలు. మీ తండ్రి మార్గదర్శకత్వం మీకు అనుకూలిస్తుంది. ముఖ్యమైన వ్యాపారాల్లో ఒప్పందాలు కుదురుతాయి. ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

ధనుస్సురాశి: ఈరోజు రుణఒత్తిడులు !

ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కష్టకాలం. రుణఒత్తిడులు పెరుగుతాయి. ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పనులు వాయిదా వేస్తారు. శత్రువులు మీకు హాని చేయాలనీ చూస్తారు. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈరోజు బంధువులతో విభేదాలు. శ్రీరామ జయరామ జయరామ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి.

మకరరాశి: అదృష్టం కలిసివస్తుంది !

ఈరోజు వ్యవహారాలలో విజయం.మీ పై అధికారులు సాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు సమస్యలు తీరతాయి. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు అదృష్టం కలిసివస్తుంది. సుబ్రమణ్య ఆరాధన చేయండి.

కుంభరాశి: ఈరోజు మిత్రులను కలుసుకుంటారు !

ఈరోజు పనులలో కొంత జాప్యం. తల్లి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మిత్రులను కలుసుకుంటారు. ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉద్యోగాలు, వ్యాపారాలలో చికాకులు. సప్తశతిలోని ధ్యాన శ్లో్కాలను చదవండి లేదా వినండి.

మీనరాశి: ఈరోజు. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి !

ఈరోజు అంచనాలు నిజం కాగలవు.వ్యాపారంలో అడ్డంకులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఈరోజు కొత్త ఆదాయవనరులు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. శివకవచం వినండి లేదా చదవండి.

- Advertisement -

Related Posts

Today Horoscope : ఫిబ్రవరి 27th శనివారం మీ రాశి ఫలాలు

మేష రాశి: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ! శ్రమ పెరుగుతుంది. మీ సన్నిహితుల సలహాలు తీసుకుంటే ప్రయోజనాలుంటాయి. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఈరోజంతా ఆహ్లదకరం గా గడిచిపోతుంది. దుర్గా అష్టోత్తర...

Today Horoscope : ఫిబ్రవరి 26th శుక్రవారం మీ రాశి ఫలాలు

మేష రాశి: ఉద్యోగాలలో అభివృద్ధి ! ఈరోజు ఆహ్లదకరంగా గడుస్తుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సోదరభావం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి. అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు....

Today Horoscope : ఫిబ్రవరి 25th గురువారం మీ రాశి ఫలాలు

మేష రాశి: బంధువులతో తగాదాలు ! వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. ఈరోజు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఓం సూర్య నారాయణే నమో...

Latest News